...

...

12, జనవరి 2009, సోమవారం

అంకెలతో తమాషా!

సుభద్ర 50రాగిని జూచి ఇట్లనియె" నాథా! నీకు నా 100నములు. నిన్ను వివాహ మాడుటకు ది4ణించుచున్నాను. క్షణమొక యుగం5ర్భరముగా నున్నది. నీ1000క్కడి నుండి బయట పడు మార్గము జూపుము" అనిన ఆ కపట వేషధారి ఇట్లు నుడివె. "రమణీ! నా నో2కొని పోవుచున్నది. 1న్నులో నీరు తెమ్ము. 6క్మిణీ పతి 400క్మిణీ దేవి నిన్నూ కాపాడుచున్నారు. మ40టి వారు చూచిన కీడు3ను.ఈ రహస్యమును ఇంకొన్ని దినములు 10లముగా కాపాడుము. లేకున్న మిక్కిలి 30తీరును. త్వరలో శుభ100000ణములు కనబడుచున్నవి. అంత వఱకు ఓపిక బట్టుము."
రాప్తాT OBరెడ్D కV EటువంTV Aన్నో వ్రాUను.
మురళీ మోహన్ EటువంTV Aన్నో కాP చేUను.

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ అంకెలతో తమాషా లో నాకు రెండు అనుమానాలు వున్నాయి.
ఒకటి. ఒక టిన్నులో నీరు తెమ్ము. సుభద్ర అర్జునుల కాలంలో టిన్ అనే ఇంగ్లీషు పదం వాడేవారా?
రెండు. ఈ సంభాషణలో ఏదో తేడా ఉంది. సుభద్ర పలకాల్సిన దానిని అర్జునునితో, అర్జునుడు పలకాల్సిన వాక్యాలను సుభద్రతో పలికించినట్లుంది.

mmkodihalli చెప్పారు...

అజ్ఞాత గారూ!
నేను ఈ అంకెలతో తమాషాను 1980లలో గౌతమ ప్రభ అనే పత్రికలో చదివాను. గుత్తినుండి అప్పట్లో ఈ మాస పత్రిక వెలువడేది. అప్పుడు చదివిన దానిని మళ్ళీ గుర్తు చేసుకోవడంలో పొరబడి ఉండవచ్చు. మీరు చెప్పినట్లే కొంచెం మార్చి వ్రాశాను గమనించారా?
ఇక మీ మొదటి సందేహానికి సమాధానం. "రసపట్టులో తర్కం కూడదు."

అజ్ఞాత చెప్పారు...

:) ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ చదవడానికి కాస్త ఎక్కువసేపే పట్టింది.
-- 400క్మిణీ దేవి - దీన్ని కనుక్కోవడం అన్నిటి కంటే కష్టమైంది!
-- కీడు3డును - ఒక 'డు' అదనం.

mmkodihalli చెప్పారు...

చదువరిగారూ!
నా టపా చదివి దోషాన్ని ఎత్తి చూపినదులకు ధన్యవాదాలు. సవరించాను గమనించండి.
--400రుక్మిణీ - రుక్మిణీపతి (కృష్ణుడు) నన్నూ రుక్మిణీ దేవి నిన్నూ--

mmkodihalli చెప్పారు...

చూపినదులకు - చూపినందులకు

నేస్తం చెప్పారు...

నాకు ఇప్పటికి 400రుక్మిణి ఎంటో అర్దం కాలేదు :(

నేస్తం చెప్పారు...

నన్నూరు అంటే నాలుగువందలా!! క్షమించాలి ....ఇప్పుడు అర్దం అయింది :)

mmkodihalli చెప్పారు...

ఈ అంకెలతో తమాషా చాలామందికి అర్థం అయ్యిందో లేదో అనే సందేహం కలిగింది. అందుకే అర్థం కానివారి కోసం ఇక్కడ దాని సమాధానం(?) వ్రాస్తున్నాను.
సుభద్ర యా భైరాగిని జూచి ఇట్లనియె "నాథా! నీకు నా వందనములు. నిన్ను వివాహ మాడుటకు దినాలు గుణించుచున్నాను. క్షణమొక యుగమై దుర్భరముగా నున్నది. నీవే యిక్కడి నుండి బయట పడు మార్గము జూపుము" అనిన ఆ కపట వేషధారి ఇట్లు నుడివె. "రమణీ! నా నోరెండు కొని పోవుచున్నది. ఒక టిన్నులో నీరు తెమ్ము. ఆ రుక్మిణీ పతి నన్నూ రుక్మిణీ దేవి నిన్నూ కాపాడుచున్నారు. మనల బైటి వారు చూచిన కీడుమూడును.ఈ రహస్యమును ఇంకొన్ని దినములు పదిలముగా కాపాడుము. లేకున్న మిక్కిలి ముప్పైతీరును. త్వరలో శుభ లక్షణములు కనబడుచున్నవి. అంత వఱకు ఓపిక బట్టుము."
రాప్తాటి ఓబిరెడ్డి కవి ఇటువంటివి ఎన్నో వ్రాయును.