...

...

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

చెప్పుకోండి చూద్దాం!

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పగలరేమో ప్రయత్నించండి.
1. "ఒక కన్నీటి చుక్క!" కథా రచయిత ఎవరు?
2. ఆ కథ మొదటి సారిగా ఏ పత్రికలో ఎప్పుడు ప్రచురింప బడింది?
3.ఆ కథా రచయిత నిర్వహిస్తున్న తెలుగు బ్లాగు, ఇంగ్లీష్ బ్లాగుల పేర్లు ఏమిటి?
4.ఆ కథా రచయిత వ్రాసిన నవలల పేర్లు రెండు చెప్పగలరా?
5.ఈ బ్లాగరుకూ ఆ కథా రచయితకు కల 'సారూప్యత' లేమిటి?
6.ఆ కథలోని పాత్రలు సుజాతకూ, రేణుకకూ మధ్య కల సంబంధమేమిటి?
7. ఆ కథలో సుజాత ఎన్నిసార్లు ఏడ్చింది?
8. భావ కవిన్మాత్రం కాను. నేనహంభావ కవిని అని చాటుకున్న కవి ఎవరు?
9. పెనుగొండ లక్ష్మి అనే కావ్యం ప్రత్యేకత ఏమిటి?
10.కవికాకి అన్న బిరుదు ఉన్న కవి ఎవరు?

పై ప్రశ్నలలో 1నుండి7 వరకు సమాధానాలకై క్లూ కొరకు నా కథాజగత్ బ్లాగును చూడండి.

7 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

9. నారాయణాచార్యులవారు పన్నేండేళ్ళ వయసులో వ్రాసిన గేయ కావ్యం అది. దాని మీద వచ్చిన ప్రశ్న వల్లే ఆయన విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపొయారని విన్నాను.

Malakpet Rowdy చెప్పారు...

10. 10. ఆయన పేరు సీతారాం అని లీలగా గుర్తు. "కొండెక్కిన చందమామ" అనే పుస్తకం కూడ వ్రాసారు కదూ?

Malakpet Rowdy చెప్పారు...

8. పట్టాభి రామిరెడ్డి గారు. ఈ విషయం బాగా గుర్తు నాకు. "ఇన్స్పిరేషనల్ మూసింగ్స్" బ్లాగులో చదివా!

Malakpet Rowdy చెప్పారు...

1. ఇంకెవరు? మన బ్లాగర్ కస్తూరి మురళి కృష్ణగారే!

Malakpet Rowdy చెప్పారు...

5. Both of you have the name "K.Murali"

Malakpet Rowdy చెప్పారు...

3. "రాతలు కోతలు" - ఇంగ్లీష్ బ్లాగ్ తెలియదు

mmkodihalli చెప్పారు...

Malakpet Rowdy గారూ!
అభినందనలు. సమాధానాలను కొత్త టపాలో పెట్టాను సరిచూసుకోండి.నారాయణాచార్యుల వారి విషయంలో మీరు విన్నది తప్పు కావచ్చు."కొండెక్కిన చందమామ" అనే పుస్తకం వ్రాసింది ఎవరో నాకు తెలియదు."ఇన్స్పిరేషనల్ మూసింగ్స్" బ్లాగును పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.