...

...

22, ఫిబ్రవరి 2009, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం!కి - సమాధానాలు.

1.కస్తూరి మురళీ కృష్ణ
2.నవ్య దీపావళి ప్రత్యేక సంచిక-2008 లో ప్రచురింప బడింది.
3.'రాతలు - కోతలు' కస్తూరి సాహిత్య లోకం, murali's chacolate factory
4.అసిధార, అంతర్మథనం
5.ఇద్దరి పేర్లలో మురళి అనే పదం ఉంది. ఇద్దరూ రైల్వే శాఖలో సికందరాబాద్‌లో పనిచేస్తున్నారు.
6.ఇద్దరూ తోడికోడళ్ళు.
7.లెక్కలేనన్ని సార్లు.
8.పఠాభి (తిక్కవరపు పట్టాభి రామి రెడ్డి)
9.'సరస్వతీపుత్ర' శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ కావ్యాన్ని అతి పిన్న వయసులో వ్రాశారు. వారు విద్వాన్ పరీక్షకు ఈ కావ్యాన్ని ఒక పాఠ్యాంశంగా చదివారు. తాము రాసిన పుస్తకాన్నే చదివి పరీక్ష వ్రాయడం ఒక వింత అనుభవం.
10.అనంతపురం మండలానికి చెందిన కోగిర జై సీతారాం అనే కవికి కవికాకి అనే బిరుదు ఉంది. వీరు కావ్‌కావ్ శతకము, కాకిగోల మొదలైన కావ్యాలు వ్రాశారు.

3 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

మురళిమొహన్ గారూ,

నారాయణాచార్యుల విషయంలో నేను విన్నదేమిటంటే ఆ పరీక్షలో ఆ ప్రశ్న కి ఉన్న మార్కులు 2 మాత్రమే. కాని ఆయన భావొద్వేగంలో ఉన్న సమయమంతా ఆ ప్రశ్నకి సమాధానం వ్రాయడానికే వెచ్చించడంతో దానికి 2 మార్కులొచ్చినా పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోయారని విన్నా. తప్పయి ఉండవచ్చు కూడా. మళ్ళీ పరిశీలించుకునుంటా.

Malakpet Rowdy చెప్పారు...

హమ్మయ్య - లంకె దొరికింది ...

http://te.wikipedia.org/wiki/పుట్టపర్తి_నారాయణాచార్యులు లో ఇలా ఉంది:

కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.

mmkodihalli చెప్పారు...

నిజమే సుమా! ఒక కొత్త విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.