పొలాలనన్నీ హలాల దున్ని
ఇలాతలంలో హేమం పండగ
జగానికంతా సౌఖ్యం నిండగా
విరామ మెరుగక పరిశ్రమించే
బలం ధరిత్రికి బలి కావించే
కర్షక వీరుల కాయం నిండా
కాలువ కట్టే ఘర్మ జలానికి
ఘర్మ జలానికి ధర్మ జలానికి
ఘర్మ జలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్
కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం
జాలరి పగ్గం సాలెల మగ్గం
శరీర కష్టం స్పురింప చేసే
గొడ్డలి రంపం కొడవలి నాగలి
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు ...
............ -శ్రీశ్రీ
మేడే సందర్భంగా శ్రామిక లోకానికి నా శుభాకాంక్షలు!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి