...
30, ఏప్రిల్ 2009, గురువారం
మహాకవి శ్రీశ్రీకి శతజయంత్యుత్సవ నివాళి!!!
మహాకవి శ్రీశ్రీ శతజయంత్యుత్సవాల సందర్భంగా ఆ మహానుభావుణ్ని తలచుకునే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా నా పాత టపాలోని 'శ్రీశ్రీ - ఆరుద్ర'ల సంవాదం సాహిత్యోపనిషత్ నుండి కొన్ని భాగాలు మళ్ళీ మీకోసం.
చెప్పిందే చెప్పిందే మళ్ళీ చెప్పడం
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కొందరి కిష్టం
చెప్పింది చెప్పి మెప్పించాలని
చేస్తున్నాను నేను నా రచనల్లో ప్రయత్నంఅదే అనుకుంటాను కవిత్వం
అనుకరణం అనవసరం
అంతేకాదు అనర్ధకం
అందుకనే దేవుణ్ణి సహా ఇమిటేట్ చెయ్యడం
మానెయ్యడం
అదీ నా ప్రయత్నం
అదే నా కవిత్వం
ఈ మేకలే నాలోని పెద్దపులికి ఆహారం
నా కవిత్వం ఆ వ్యాఘ్రం ఆకలి ఆహారం
* * * * * *
రుచీ, ఔచిత్యం ఇవీ ముఖ్యం మెప్పుకి
కవికోరే మెప్పు గండపెండేరం కాదు
సమానధర్ముల హృదయస్పందనం శిరఃకంపనం
అదీ గీటురాయి అసలైన కవిత్వానికివానలాగ ప్రజల హృదయాలల్లో వర్షించి
కొత్త భావాల బీజాలు జల్లేది కవిత్వం
ప్రజలు చప్పట్లు కొట్టే భావాలకి
పద్యాల రూపం ఇస్తే చాలదు
ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తూనే కవి
మెజారిటీకి అందని ఊహలు వెదకాలి
ఆ తర్వాత అతని మైనారిటీ ఓటు
ఆక్రమిస్తుంది ప్రజాహృదయంలో చోటు
ఏమైనాసరే కవిత్వం
మేలుకొల్పాలి కాని జోగొట్టగూడదు
* * * * * *
కవిత్వమ్మీద కవిత్వంకూడా కవిత్వమే
అది ఎప్పటికైనా తెలిసిపోయే రహస్యమే
ఈలోగా ఎవరైనా తికమక పడుతున్నప్పుడు
వ్యాఖ్యాత జోక్యం చేసుకోక తప్పదు
భావాల సరిహద్దులవద్ద కాపలా కాయాలి కవి
ప్రపంచాన్ని ప్రజానీకానికి విశదం చేయాలి కవి
చక్రాల్లో చక్రాల్లాగా అర్ధాల్లో అంతర్ధాలుంటాయి
కొంతమట్టుకే బోధపడవచ్చు కొందరికి
ఇంకా అందులో ఏముందో చెబుతాడు వ్యాఖ్యాత
అర్ధంకాని రహస్యం లేనట్టే అసలే బోధపడనిదంటూ ఏదీ
ఉండదు
అన్ని కళల్లాగే కవిత్వం కూడా
ఏక కాలంలో రెండు లెవెల్స్ లో పనిచేస్తుంది
అందుకే అసలైన కవిత్వం
ఏకకాలంలోనే పండిత పామరజన రంజకం
ఎవరో అనగా విన్నాను "మనుష్యులంతా సమానులే గాని
కొందరు మరికొంచెం ఎక్కువ సమాను"లని
విదూషకుడి నోటంట వచ్చే నిజం లాంటిదిది
మనుష్యుల్లో హెచ్చు తక్కువలు సర్దుదాం మొదట
మనసుల్లో ఎగుడు దిగుడులు సర్దుకొంటా యాపిదప
సరేగాని నేనొకటడుగుతాను చెప్పు
ఛందస్సుల నియమ బంధంలో లేదా ముప్పు?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్లు:
" ఏమైనా సరే కవిత్వం మేల్కొల్పాలి
కాని జొకొట్టకూడదు. "
విశ్వవిద్యాలయాల ఉడుకు రక్తాన్ని..
రగిలంచి వెలిగించిన మహాకవి ని
నీడలు ..ఉన్న మీ రచన బావుంది.
చాలా బావుంది.
ఈ సందర్భంగా శ్రీ శ్రీ కీ - దాశరధి కీ మధ్య జరిగిన
వివాదం గుర్తుకొస్తోంది.
ఒకప్పుడు
"మా తరానికి గురువు శ్రీ శ్రీ
మా కలాలకు బలము శ్రీ శ్రీ ...."
అంటూ అభివర్ణించిన దాశరధే
శ్రీ శ్రీ తో విభేదం వచ్చి నప్పుడు
" ఒరే శ్రీ శ్రీ నువ్వొక తాగు బోతువి
నీ మహా ప్రస్థానం
నీ పాలిటి మహా స్మశానం ..." అంటూ
తిట్టి పోశాడు.
అప్పడు కాళోజీ కల్పించుకుని
" వాడు రాసిన కవితలు
గుబాలిస్తున్నప్పుడు
వాడు తాగి పారేసిన
సీసాల కంపు మనకెందుకురా...?"
అంటూ మందలించాడు.
అదొక (క)వి చిత్ర సన్నివేశం
చాలా బాగుంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి