మనుషుల నైజం వారివారి ప్రవర్తనలవల్ల తెలుస్తుంది అంటారు అది ముమ్మాటికీ నిజం.
ఒక రోజంతా అతని జాడ తెలీక మొత్తం రాష్ట్ర ప్రజలంతా టెన్షన్‌లో ఉన్న సమయమది. హెలికాప్టరు క్రాష్ ల్యాండ్ అయిందని కేంద్రం ప్రకటించింది. ఐనా ఆయన ఎక్కడో క్షేమంగానే ఉండి ఉంటారనే యావత్ ప్రజానీకం నమ్ముతూ వచ్చింది.ఆయన ఉనికి కోసం ప్రజలంతా టీవీలకు అతుక్కుని పొయారు. ఇంతలో హెలికాప్టరు శిథిలాలను కనుగొన్నట్టు అందులో ప్రయాణించిన ఐదుగురూ చనిపోయినట్టు వార్తలు. ఆ వార్తలను ఇంకా జీర్ణం చేసుకునే స్థితిలో ఎవరూ లేరు. నా హృదయంలో ఏదో వెలితి. ఇందిరాగాంధి, రాజీవ్ గాంధి, ఎన్‌టీయార్, పి.వి.నరసింహారావు లాంటి ప్రముఖుల మరణ వార్త విన్నప్పుడు కలిగిన అనుభూతే కానీ కాస్త ఎక్కువ మోతాదులో. మీడియా కవరేజి అందుకు కారణమేమో! ఇంకా అధికారికంగా మరణవార్తను ప్రకటించాల్సి వుంది.
సరిగ్గా ఆ సమయంలో నా మొబైల్ కు ఒక ఎస్.ఎం.ఎస్. వచ్చింది. అది చదవగానే ఆశ్చర్యమూ అసహ్యమూ రెండూ ఒకేసారి కలిగాయి.
ఆశ్చర్యం అంత తొందరగా స్పందించినందుకు.
అసహ్యం అందులోని విషయానికి.
మరో రెండు నిమిషాలకు అదే మెస్సేజి మరొకరు ఫార్వర్డు చేశారు!
ఇంతకీ ఆ ఎస్.ఎం.ఎస్‌లో ఉన్నది ఇది.
రోజా అబ్ ఫిర్ బాబుకే సాత్ సోజా.
ఈ మెస్సేజ్ అర్థం ఏమిటి?
అంటే అంత వరకూ రోజా వైఎస్సార్‌తో పడుకుందనా?
ఇది రోజాను అవమానించినట్టా లేక వైఎస్‌ను టార్గెట్ చేసినట్టా?
ఏదో పేద్ద జోక్ అన్నట్టు అందరికీ ఆ మెస్సేజ్‌పంపడం ఏమిటి? అదీ వైఎస్ మరణించాడని తెలిసిన కొన్ని క్షణాలకే..!?
ఆ పంపేదేదో రోజాకే పంప వచ్చుకదా? అంత గట్స్ ఉందా?
అసలు ఉద్దేశం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు కాబట్టి కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో నామరూపాలు లేకుండాపోతుందని కాబట్టి రోజాకు తెలుగుదేశం గూటిలోనే ఉండిపొమ్మని ఇచ్చిన సలహా కావచ్చు. కానీ అది చెప్పే విధానమూ సమయమూ సరియైనదేనా?
ఒక పక్క దుర్వార్త విని ఒక విధమైన వేదనలో ఉన్న సమయంలో ఇలాంటి కామెంట్లు చేసి రాక్షసానందం పొందే వారిని ఏమి చేయాలి?
ఆ మెస్సేజ్‌ను పంపిన ఇద్దరూ నా కొలీగ్స్ కావటం నా దురదృష్టం.
3 కామెంట్లు:
I pity U...because u r having such friends
hahaha.........i haven't find any mistake.....
they said their opinion.people got frustration with their behaviour....
do u have guts to say this to ur friends........
కామెంట్‌ను పోస్ట్ చేయండి