మహమ్మారి స్వైన్‌ఫ్లూ విజృంభణ సంగతి అలా ఉంచితే మీడియాలో ఈ వ్యాధికి సంబంధించిన ప్రచారం మాత్రం విపరీతంగా ఉంది. ఏ పేపర్ చదివినా, ఏ న్యూస్ చానల్ చూసినా స్వైన్‌ఫ్లూకు చెందిన వార్తలే ఉంటున్నాయి. ఈ రోజు పేపర్లో రెండు వార్తలు ఆకట్టుకున్నాయి. మొదటిది ముద్దుల దినోత్సవం స్వైన్‌ఫ్లూ కారణంగా ప్రేమికులకు నిరాశ పరిచింది అనే వార్త. మరొకటి ఈ వ్యాధి భయం వల్ల తిరుమలలో రద్దీ తగ్గిందనే వార్త.
ప్రపంచ ముద్దుల దినోత్సవం సందర్భంగా గురువారం 'ముద్దు' ముచ్చట తీర్చుకోవాలనుకున్న ప్రేమికులు స్వైన్ భయంతో వెనక్కు తగ్గారట! ఈ దినాల సంస్కృతి ఇటీవల బాగా పెరిగి యువతలో క్రమశిక్షణా రాహిత్యాన్ని, విచ్చలవిడి తత్వాన్ని, బరితెగింపును ప్రేరేపిస్తున్న ఈ తరుణంలో స్వైన్‌ఫ్లూ పుణ్యమా అని ముద్దు కాస్త రద్దు కావటం చాదస్తులకు కాస్త మోదాన్ని కలిగించే విషయమే!
కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి దర్శనానికి విపరీతమైన రద్దీ వుండాల్సిన దసరా శెలవుల్లో రోజూ 50 వేలకు మించి భక్తులు కూడా దర్శించటానికి రావటం లేదంటే స్వైన్‌ఫ్లూ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. తిరుమలలో స్వైన్‌ఫ్లూ వ్యాపించకుండా టి.టి.డి ముందస్తు ఏర్పాట్లు చేసినా భక్తుల్లో భయం తగ్గలేదట! ఈ స్వైన్‌ఫ్లూ ఎఫెక్ట్ వేంకటేశ్వర స్వామి పైన కూడా పడటం భక్తుల్లో కొంత ఖేదాన్ని కలిగించే విషయమేకదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి