...

...

27, సెప్టెంబర్ 2009, ఆదివారం

బుడ్డా వెంగళరెడ్డి పుస్తకావిష్కరణ!!!

మా అబ్జ క్రియేషన్స్ తరఫున నాల్గవ ప్రచురణగా వెలువరించిన శ్రీ ఎస్.డి.వి.అజీజ్ గారి చారిత్రక నవల 'బుడ్డా వెంగళరెడ్డి' గ్రంథాన్ని ప్రముఖ కవి శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు ఆవిష్కరించారు. తెలుగుభాషా వైభవ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రవితేజమ్ దినపత్రిక కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఆవిష్కర్త శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తిగారు మాట్లాడుతూ మానవతావాది బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్రను నవలా రూపంలో పాఠకులకు పరిచయం చేసిన రచయిత అజీజ్ గారిని అభినందించారు. అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి కోడీహళ్లి మురళీమోహన్ మాట్లాడుతూ ఆకస్మికంగా దసరా కానుకగా ఈ ఆవిష్కరణను ఏర్పాటు చేసినందువలన గ్రంథ రచయిత శ్రీ అజీజ్‌గారు హాజరు కాలేక పోయారనీ త్వరలో ఇదే పుస్తకాన్ని కర్నూలు, ఆళ్ళగడ్డ పట్టణాలలో ఘనంగా ఆవిష్కరించ నున్నామని వివరించారు. ఇంకా ఈ సమావేశంలో రవితేజం సంపాదకులు శ్రీ భూపతి రవీంద్రనాథ్, సాహిత్యకిరణం పత్రిక సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బారావు, సాహితీ వేత్తలు శ్రీ గురజాడ అప్పారావు, శ్రీమతి గురజాడ విజయశ్రీ, శ్రీ ఎస్.వివేకానంద, శ్రీ టి.గోపాలరావు, శ్రీ గుంటూరు శివరామకృష్ణ, శ్రీ కె.రామకృష్ణ, శ్రీ ఎ.గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఆ సమావేశానికి చెందిన ఫోటోలు కొన్ని .







4 కామెంట్‌లు:

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

ఫాక్షనిస్టులకి కూడా జీవిత చరిత్రలా? వేంపెంట గ్రామంలో బుడ్డా వెంగళరెడ్డి ముఠా ఒకే రోజు తొమ్మిది మంది దళితులని చంపిన ఘటన మరచిపోయావా?

కోడీహళ్లి మురళీమోహన్ చెప్పారు...

అయ్యా PKMCT గారూ!
మీరు పేర్కొన్న వేంపెంట దళితుల ఊచకోత సంఘటన జరిగింది 1998లో.(చూడుhttp://archive.deccanherald.com/Deccanherald/mar042005/n12.asp ) కానీ మేము ప్రచురించిన పుస్తకంలోని బుడ్డా వెంగళరెడ్డి బ్రిటీష్ వారు మన దేశాన్ని పరిపాలించిన కాలం నాటి వ్యక్తి. క్రీ.శ.1822 - 1900ల మధ్య జీవించిన మహాపురుషుడు.(చూడుhttp://www.24fps.co.in/2007/12/23/%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%B0%E0%B1%87%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81/ ) ఆయనకూ ఫ్యాక్షనిజానికీ ఎటువంటి సంబంధం లేదు. అదే పేరుకల వ్యక్తి(ఆత్మకూరు మాజీ ఎం.ఎల్.ఏ.)కి వేంపెంట సంఘటనతో ముడిపడి ఉన్నాడు.(చూడుhttp://www.hindu.com/2005/03/02/stories/2005030212150300.htm) ఒకే పేరు ఉన్నంత మాత్రాన ఇలా అన్యాయంగా ఆరోపించటం మీకు భావ్యంగా ఉందా?

ప్రవీణ్ ఖర్మ చెప్పారు...

సార్ మురళీ మోహన్ గారూ ఈ PKMCT కున్న మిడిమిడి జ్ఞానంతో మీరు వేగలేరు....దయచేసి వాడినలా వదిలేయండి.

amma odi చెప్పారు...

విజయ దశమి శుభాకాంక్షలు