...

...

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

బుడ్డా వెంగళరెడ్డి !!!

1866లో రాయలసీమలో తీవ్రమైన కాటకం వచ్చింది. ఇది ధాత నామ సంవత్సరంలో రావడంచే దీనిని ధాత కరవు అన్నారు. ఇది అనంతపురం మండలంలో వచ్చింది. ఈ కరవు కాలంలో బుడ్డా వెంగళరెడ్డి కరవు పీడితులైన ప్రజలకు మూడు నెలల పాటూ అన్న వస్త్రాలు ఇచ్చి కన్నతండ్రిలాగా కాపాడాడు. రాయలసీమలో పుట్టిన అపర దానకర్ణుడు వెంగళరెడ్డి. రాయలసీమ ప్రజలు ఇప్పటికి ఇతని దాతృత్వాన్ని గురించి చెప్పుకుంటారు. ఈ అపర దానకర్ణుని జీవిత చరిత్రను ఎంతో శ్రమకోర్చి పరిశోధించి చారిత్రకనవలా రూపంలో శ్రీ ఎస్.డి.వి.అజీజ్‌గారు నిక్షిప్తం చేయగా దానిని మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ అతి త్వరలో తమ నాల్గవ ప్రచురణగా పాఠకలోకానికి అందించనున్నది. ఆ వివరాలు అతి త్వరలో తెలియజేస్తాం!

1 కామెంట్‌:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

నిజమే ఈ నాటి తరానికి ఆయన తెలియకపోయినా పల్లెల్లోని పెద్దలు ఇప్పటికీ బుడ్డా వెంగళరెడ్డి గారి దాతృత్వం గురించి మా ప్రాంతంలో చెప్పుకుంటూనే ఉంటారు.ఆయన గురించి తెలుసుకోవాలని ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటాము.