...

...

19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

శ్రీరమణగారి కథ!

శ్రీరమణ (వంకమామిడి రాధాకృష్ణ ఉరఫ్ కామరాజు రామారావు)గారి కథ ధనలక్ష్మి కథాజగత్‌లో ప్రకటించాం. ఈ కథను మీలో చాలామంది ఇదివరకే చదివి ఉంటారు. చదవని వారు తప్పక చదివి తీరాల్సిన కథ ఇది. చదివిన వారు మరోసారి చదివి ఆనందించండి. ఈ కథపై మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం.  

3 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...

ఈ కథను మొదటి సారి ఇండియా టుడే లో చదివాను నేను. ఇంటి బాధ్యతను నడిపే ఇల్లాలికి తెల్సినంతగా దేశ ఆర్థిక మంత్రికి కూడా ఆర్థిక విధానలు తెలీవంటారు చూడండి..అది అక్షరాలా నిజమనిపిస్తుంది! ఈ కథ వల్ల ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నేర్చుకోవాలి!

వరదల సమయంలో ఎరువులు రాకుండా ఆపేయడం,గోతిలో ఉన్న స్థలాన్ని కొని పిల్లర్ల మీద డాబా వేయడం,మొగుడిని బెంచీ ఎక్కించిన మాస్టార్నే పన్లో పెట్టుకోవడం,యాత్రా స్పెషల్ బస్సూ... ఇంత బిజినెస్ చేస్తూ...చివరికి కొడుకు "నాలుగక్షరాలు అమ్ముకుంటాడు"అని వాడిని చదువులో పెట్టడం..ధనలక్ష్మి బుర్రే బుర్ర!

నిజానికి ఇక్కడ కథ మళ్ళీ చదవకుండానే రాశా ఇదంతా! అంతగా గుర్తుండిపోయింది.

మొత్తానికి శ్రీరమణ గారి అసలు పేరు ఇదా? ఇన్నాళ్ళకి తెలిసింది!

అజ్ఞాత చెప్పారు...

meeru chadavakundaa raayadame manchidayyindi. aa linkulo aa kathe ledu!

mmkodihalli చెప్పారు...

@సుజాతగారూ! మీరన్నది నిజమే. ఈ కథ వల్ల ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నేర్చుకోవలసి వుంది.

@అజ్ఞాత గారూ! ఆ లింక్‌లో కథే లేదా!?! కాస్త వెదకాలండీ! మీరు లింకును క్లిక్ చేస్తే కథాజగత్ హోమ్ పేజీ వస్తుంది. పక్కనే ఎడమ వైపు ఉన్న సైడ్‌బార్‌లో కథాజగత్తులోకి అడుగిడండి అనే దానిపై క్లిక్ చేస్తే కథల జాబితా వస్తుంది. మీకు కావలసిన కథను క్లిక్ చేస్తే ఆ కథ ప్రత్యక్షమౌతుంది.