ఓమ్
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీకృష్ణ సంకీర్తనములు
గ్రంథకర్త :-
కీ.శే.కోడీహళ్ళి చన్నరాయప్ప
జై కృష్ణ! ముకుంద! మురారి - గోవిన్దా!
అక్రూర వరద! నన్నదరింపుము కృష్ణా!
(పల్లవి - అనుపల్లవి)
1. కృష్ణ! నీ కీర్తనల్ - కీర్తింప మది దలచి
కృష్ణ నిను భజియింతు - కృతకృత్యుడై దినము
కృష్ణ నిను స్మరియింతు - కీర్తింతు - ప్రణుతింతు
కృష్ణయ్య! నను బ్రోవు - కృపగలిగి సతతమ్ము
llకృష్ణll
2. విఘ్నరాజా! నిన్ను - వినుతిన్తు ప్రణుతిన్తువిఘ్నములు లేక ని - ర్విఘ్నముగ యత్నమున
నిఘ్నమేమియు లేక - నియమముగ జరుగుటకు
విఘాధిపతి నిన్ను - వేడుకొందును భక్తి
llకృష్ణll
3. శారదామాతా! సన్నుత చరితా!
భారతి గొల్చెద - పరమేష్ఠి రాణీ!కారుణ్యమున నన్ను - కాపాడుమమ్మా!
నారద తుంబురుల - జ్ఞానము నిమ్మా!
llకృష్ణll
4. ఆదికవులనె గాక - ఆధునిక కవి జనుల
ఆదరమ్మున దలచై - అంజలులను సలిపెదనుఖేదములు భేదములు - కికురించి కేవలము
మోదములె కలుగుటకు - ముద్దులయ్య కృష్ణా
llకృష్ణll
5. గణయతుల ప్రాసల - క్షణములింతయు నెఱుగ
అణువైన అరయనా - కర్థ జ్ఞానము లేదుగణుతింప భక్తి మది - గణ్యమనుచు దలచి
ప్రణుతిన్తు నమ్రుడై - పద్మనాభ! కృష్ణా
llకృష్ణll
6. భక్తియొక్కటెకాని - వయసు ముఖ్యము కాదు
ముక్తిని సాధించి - మోదమును పొందుటకుభక్తి నాబాల గో - పాలముగ నెల్లరును
భక్తి శ్రీహరి కృష్ణు - భజన చేతామయ్య
llకృష్ణll
కథా ప్రారంభము
7. దేవకీదేవికి - దేవ! పుట్టితివి
కావలి వారల - కనులు మూసితివి
ఆ వసుదేవుడు - ఆ క్షణమున నిన్ను
శ్రీవర! జేర్చెను - వ్రేపల్లె పురికి
llకృష్ణll
8. యశోద నదులకు - ఆనందమగుచు
కుశలముగ నచ్చోట - కూర్మి పెరిగితివివిశదముగ నీ కీర్తి - వెలయ జేసితివి
దశరూప మొందెడు - ధన్య శ్రీకృష్ణ
llకృష్ణll
9. తల్లియు నీవే - తండ్రియు నీవే
చల్లగ బ్రోచెడు - స్వామియు నీవెఎల్ల లోకములు - ఎల్ల బాంధవులు
సల్లలిత సుగుణ - సర్వము నీవే
llకృష్ణll
10.అదితినన్దన కృష్ణ - అబ్ధి గంభీరా!
సదయాత్మ సర్వేశ - షాడ్గుణ్య గణ్య!త్రిదశాలయాధిపుడ - దేవాధి దేవా!
ముదమారగైకొనుము - మ్రొక్కులను కృష్ణా
llకృష్ణll
11.హరి హరి హరియను అక్షర ద్వయములు
హరియించు పాపములు - అంబుజనాభా!హరినామ మహిమలను - అరసి వర్ణింపను
హర బ్రహ్మాదులకైన - అలవి కాదయ కృష్ణ
llకృష్ణll
12.నిర్వాణ దాయకుడ - నిర్మలాత్మక దేవ!
నిర్విఘ్న సంధాత - నిర్దోష చారిత్ర!శర్వాణి వినుతుడీ - జగదాధార మూర్తి!
సర్వాత్మ! లక్ష్మీశ - సర్వేశ! కృష్ణయ్య
llకృష్ణll
13.శుక్రాది దివిజులు - స్మరియిమపలేరు
శుక్రార్చిత నిన్ను - సుందర రూప!చక్ర ఖడ్గ పాణి - శౌరి ముకున్దా!
అక్రూర వరదా - అఖిలలోకేశా
llకృష్ణll
14.పరమేష్ఠి సురవరులు - ప్రస్తుతింపగ మకరి
మరణమున గూల్చితివి - మదగజము నేలితివిసరసిజాక్షుడ దేవ! - సన్మౌని స్తుతిపాత్ర!
వరదుడై రక్షింపు - భక్త వత్సల కృష్ణ
llకృష్ణll
15.నా దిక్కు జూడుము - నన్నుగావు కరుణా
నీదిక్కె నిజముగ - నెరనమ్మినాడను ఆది పరబ్రహ్మ - అనఘ చక్రపాణి
వేదములైన నిను - వినుతింప జాలవు
llకృష్ణll
16.బాలుడౌ ప్రహ్లాదు - పాలించు విధముగను
పాలసుండగు నన్ను - పాలింపు కరుణింపుపాలనైనను ముంచు - నీళ్ళనైనను ముంచు
పాల బడితిని దేవ - పాహిమాం కృష్ణయ్య
llకృష్ణll
17.పదునాగు భువనాలు - పద్మనాభా నీవు
కుదురుగ నిల్పితివి - కుక్షిలోపల జేర్చివిదితముగ దేవకి - హృదయఫలకం నందు
ఒదిగి యెట్లుంటివి - ఓ చిన్ని కృష్ణయ్య
llకృష్ణll
18.వ్రతములను క్రతువులను - వరుస తీర్థములను
మితిలేని దానములు - మించి చేసిన కూడసతతమ్ము నిను భక్తి - స్మరియించు జపమునకు
హితమతిని యోచింప - ఈడుగావయ కృష్ణ
llకృష్ణll
19.స్పష్టముగ శ్రావణ - అష్టమి రోహిణి
అష్టమ గర్భమున - అవతరించితివిదుష్టు కంసుని బట్టి - దునిమి శ్రీఘ్రమున
సృష్టిని పాలనము - చేసితివి కృష్ణ
llకృష్ణll
20.రతినాథ జనక ఓ - లక్ష్మీదేవికాన్త
హితమతిని ననుగావు - ఇన్దిరేశ కృష్ణ!అతుల సద్గుణ గణ్య - అంబుజాక్ష దేవ
శతకోటి రవితేజ! - స్వామినాథ కృష్ణ!
llకృష్ణll
(సశేషము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి