...

...

26, ఫిబ్రవరి 2010, శుక్రవారం

గుంటూరులో 'బుడ్డావెంగళరెడ్డి' ఆవిష్కరణ!

                ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 34వ సమావేశాలు ఫిబ్రవరి 23, 24 తేదీలలో గుంటూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక జాగర్లమూడి కుప్పుస్వామిచౌదరి కాలేజ్ వేదికగా జరిగిన ఈ సమావేశాలకు రాష్ట్రం నలుమూలలనుండి సభ్యులు హాజరై చారిత్రక అంశాలపై తమ తమ పరిశోధక పత్రాలను సమర్పించారు. ఈ సభలలో మామిడిపూడి వెంకటరంగయ్య స్మారక ప్రసంగాన్ని ప్రఖ్యాత చరిత్రకారులు కలకత్తా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ్ బంధోపాద్యాయ "The Cultural Legacies of Forest Policies in India: A Comparative Study in Environmental History” అనే అంశంపై మాట్లాడారు. ఇంకా ఈ సభల్లో ప్రొఫెసర్ ఆర్వీఆర్ చంద్రశేఖర్, డా.వకుళాభరణం రామకృష్ణ, పి.రామలక్ష్మి, ఎం.బసవపున్నయ్య, జె.నరేంద్రనాథ్, ఎస్.ఆర్.కె.ప్రసాద్, యాగంటి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సభలలో 23వ తేదీ సాయంత్రం సమావేశంలో మా సంస్థ ప్రచురించిన బుడ్డావెంగళరెడ్డి చారిత్రక నవలను ప్రొ.అరుణ్‌బంధోపాధ్యాయ ఆవిష్కరించారు. దీనితో ఈ పుస్తకం ముచ్చటగా మూడోసారి ఆవిష్కరింపబడినట్టయింది. ఈ ఆవిష్కరణకు సంబంధించిన ఫోటో క్రింద చూడండి. 

                    

ఫోటోలో రచయిత ఎస్.డి.వి.అజీజ్(మధ్య)తో పాటు డా.వకుళాభరణం రామకృష్ణ(ఎడమ), ఆవిష్కర్త ప్రొ.అరుణ్ బంధోపాధ్యాయ(కుడి)లను చూడవచ్చు.       

కామెంట్‌లు లేవు: