...

31, జులై 2013, బుధవారం
24, జులై 2013, బుధవారం
17, జులై 2013, బుధవారం
తులనాత్మక విమర్శకుడు, పరిశోధకుడు – సర్దేశాయి తిరుమల రావు
చాలా కాలం ముందు అంటే సుమారు వందేళ్ళ ముందు సాధన అన్న పత్రిక రాయలసీమ నుండి వెలువడేదిట. అందులో ‘వదరుబోతు ‘ పేరిట వ్యాసాలు వచ్చేవి. అవి రాసిన వారు ఎవరో తెలియదు.ఆ వ్యాసాలలో ఒకానొక వ్యాసంలో పేరు సంపాదించుకోవడానికి మార్గాల గురించి వ్యంగ్యంగా చెబుతారు. ప్రాచుర్యం రావాలంటే – గొప్ప ‘పేరు ‘ ను సంపాదించుకొని ఉండాలి లేదా, గొప్ప వ్యక్తులతో ముందుమాట వ్రాయించుకోవాలి లేదా ప్రముఖులు ఆ పుస్తకాన్ని పొగడాలి. ఇది నాటి పరిస్థితి అయితే మరి నేటి విషయం చెప్పనవసరమే లేదు. ఇలా ప్రాచుర్యం పొందిన వారు తామరతంపరగా కనిపిస్తున్న రోజుల్లో శాస్త్రజ్ఞుడిగా వృత్తిని, సాహిత్య అనుశీలకుడు, విమర్శకుడుగా ప్రవృత్తినీ పెంపొందించుకుని, రెంటినీ సమన్వయం చేయాలన్న తపన నేపథ్యంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన ఒక అజ్ఞాత అనల్ప ప్రతిభావంతుని గురించిన పుస్తకం ఇది.
సర్దేశాయి తిరుమల రావు గురించిన ఈ పుస్తకం లో రెండు పార్శ్వాలున్నాయి. ఒకరు వ్యక్తి, మరొకరు సాహిత్యవిమర్శకుడు.
Labels:
SDTR
14, జులై 2013, ఆదివారం
ద్విగుణీకృతమే!
'జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు' పుస్తకంలో 81వ పేజీలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి 'వడ్లగింజలు'లోని ఉత్సుకత కలిగించే ఒక సన్నివేశం గురించి వివరించబడివుంది. ఆ కథను పూర్తిగా ఇక్కడ చర్చించడం లేదు కానీ దానిలో ప్రస్తావించిన లెక్క గురించి కొంచెం విచారణ చేద్దాము. చదరంగం గళ్లలో మొదటి గదిలో ఒక (వరి/గోధుమ)గింజ, రెండవ గదిలో రెండు గింజలు, మూడవదానిలో నాలుగు, నాలుగవదానిలో ఎనిమిది,ఇలా పెంచుతూ పెట్టుకుంటూ పోతే 64 గదులను నింపడానికి మొత్తం 18446744073709551615(20 అంకెలు) గింజలు పెట్టవలసి వుంటుంది. అయితే ఈ వ్యాసం చివరలో సర్దేశాయి తిరుమలరావు గదిగదికీ గింజల సంఖ్య ద్విగుణీకృతమా (1,2,4,8,16,32....) లేక ద్విఘాతమా (1,2,4,16,256,65536....) అనే సందేహాన్ని వెలిబుచ్చారు. ఆ వ్యాసం వ్రాసే కాలం (1989) నాటికి అధునాతనమైన కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు లేకపోవడం వల్ల ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునే అవకాశం లేకపోవచ్చు. ప్రస్తుతం మనం పరిశీలిస్తే అది ద్విగుణితమే అని నిర్ధారణకు రాగలం. ఈ క్రింది పట్టిక చూడండి.
Labels:
SDTR
12, జులై 2013, శుక్రవారం
9, జులై 2013, మంగళవారం
8, జులై 2013, సోమవారం
విశ్వం వెర్సస్ సర్దేశాయి
ఒకరు సాహితీ విరూపాక్షుడు. మరొకరు జ్ఞానసింధువు.
ఇద్దరూ పండితులే. మేధావులే. ఒకరితో ఇంకొకరిని పోల్చలేము.
ఎవరికి వారు గొప్పవారే. ఇద్దరూ దాదాపు సమకాలికులే.
విద్వాన్ విశ్వం 1915 - 1987 ల మధ్యకాలంలో జీవిస్తే
సర్దేశాయి తిరుమలరావు 1928 -1994 ల మధ్య జీవించారు.
ఇద్దరూ రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురానికి సంబంధించిన వారే.
అయితే ఒకరి గురించి మరొకరు ప్రస్తావించుకున్న సందర్భాలు దాదాపు లేవు.(కనీసం నాకు తెలిసినంత వరకూ)
విద్వాన్ విశ్వం సంస్కృత కావ్యాలను తెలుగులోనికి అనువదిస్తే
సర్దేశాయి తిరుమలరావు పాశ్చాత్య కవులను వారి కవితారీతులను మనకు పరిచయం చేస్తారు.
ఒకరు విశిష్ట సంపాదకులయితే మరొకరు విలక్షణ విమర్శకులు.
విద్వాన్ విశ్వం జర్నలిస్టుగా రూపాంతరం చెందిన రాజకీయవేత్త కాగా
సర్దేశాయి తిరుమలరావు తైల సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయిలో ఎన్నదగిన శాస్త్రవేత్త.
అయితే వీరిద్దరికీ ఒక విషయంలో సామ్యం వున్నది.
మహామహోపాధ్యాయ డాక్టర్ చిలుకూరు నారాయణరావు గారి శిష్యగణంలోనివారే ఇద్దరూను.
విద్వాన్ విశ్వం 1932 నుండి చిలుకూరు నారాయణరావు గారి వద్ద సంస్కృత, వ్యాకరణ, భాషా శాస్త్రాలను అభ్యసిస్తే
సర్దేశాయి తిరుమలరావు దత్తమండల కళాశాలలో చిలుకూరి నారాయణరావుగారివద్ద శిష్యరికం చేశారు.
విద్వాన్ విశ్వం గురువుగారికి గురుదక్షిణగా తన తొలికావ్యం విరికన్నె అంకితం ఇచ్చారు.
కాగా సర్దేశాయి తిరుమలరావు తన గురుదక్షిణ సమర్పించుకోవడంలో సఫలీకృతులు కాలేక పోయారు.
డా.చిలుకూరు నారాయణరావుగారు తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ మొదలైన పలు భాషలలో లక్షన్నరకు పైగా సేకరించిన సామెతలను ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా వర్గీకరించే బాధ్యతను సర్దేశాయి తిరుమలరావు తన భుజస్కందాలపై వేసుకున్నారు కానీ దానిని ఏ కారణం చేతనో నెరవేర్చలేక పోయారు. అదే కనుక సాధ్యమయి ఉంటే సారస్వత రంగానికి గొప్ప నిధి లభ్యమైవుండేది.
Labels:
SDTR,
vidwan viswam
గూడు చాలని సుఖం!
పురాణం శ్రీనివాస శాస్త్రిగారి గూడు చాలని సుఖం
కథను కథాజగత్లో చదవండి. జ్యోతి మాసపత్రిక 1978లో నిర్వహించిన కథలపోటీలో ఈ కథకు మొదటి
బహుమతి వచ్చింది.జయంతి పాపారావుగారి సంపాదకత్వంలో వచ్చిన 'నూరేళ్లు- నూరుగురు కథకులు- నూరు కథానికలు'సంకలనంలో ఈ కథ చోటు చేసుకుంది. ఇంకా విహారిగారు తమ కథాకృతి గ్రంథంలో ఈ కథను పరామర్శించారు.
Labels:
katha jagat
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)