సీనియర్ కథా రచయిత మునిపల్లె రాజు గారి కథ కస్తూరి తాంబూలం కథాజగత్‌లో ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. మీలో చాలామంది ఇప్పటికే ఆ కథను చదివే ఉంటారు. ఆ కథలో రచయిత ఒక చిన్న (చిన్నదే సుమా!) పొరబాటు చేశారు. అదేమిటో మీరు కనిపెట్టగలరా?
అలాగే ఇంతకు ముందు నేను ఇచ్చిన క్రాస్‌వర్డు పజిల్ ను జ్యోతిగారు, ఊకదంపుడుగారు,ఫణి ప్రసన్న కుమార్ కలిసి సగం పూరించారు. మిగిలిన పజిల్‌ను ఎవరైనా పూర్తి చేయగలరా? మీకొక చిన్న హింట్ ఇస్తాను. ఈ పజిల్‌లోని పదాలన్నీ హ్రస్వాక్షరాలతో ఉన్నవే. దీర్ఘాక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సంయుక్తాక్షరాలు ఈ పజిల్‌లో లేవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి