...

...

26, జనవరి 2010, మంగళవారం

పాఠకులారా మిమ్మల్ని క్షమించలేను - నామిని సుబ్రహ్మణ్యం నాయుడు

నిన్న సోమవారం (25 జనవరి 2010) ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్యపేజీ వివిధలో నామిని ప్రసంగ వ్యాసం ప్రచురించారు. ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన వ్యాసమిది. ఈ వ్యాసంలో వీరు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. వాటిలో కొన్ని మీకొసం వారి మాటల్లోనే.
"అమర రాజా బ్యాటరీస్ ఎవరైనా ఎందుకు కొంటారు? చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడానికి కొంటారు. శాంతా బయోటెక్నిక్స్ వారి షాన్‌వాక్ ఇంజెక్షను డబ్బులు పెట్టి ఎందుకు కొంటారు? హెపటైటిస్ బి బారిన పడకుండా దేహాన్ని కాపాడుకోవడానికి కొంటారు. ఎసుట్లో బియ్యం వేసుకుని మీరంతా అన్నం ఎందుకని వండుకుని తింటారు? రైతుల్ని ఉద్ధరించడానికి కాదు మీరు అన్నం తినేది, మీ దేహానికి పిండిపదార్థాలు కావాలని చెప్పి! ........................................................................................................................................... 
చూసినారా? నా 'ప్రోడక్టు'ను నాకు సహాయం చేయడానికి ఆయన కొనుక్కొంటున్నాడు. అదాయన మంచితనం కావచ్చు కానీ, నాకు అవమానం. అట్లాంటివాళ్లు ఎవ్వరూ నా పుస్తకాలు కొనుక్కోకూడదు. ఇది నా రోషం! కర్నాటక ప్రభుత్వాన్ని కాస్త ఆర్థికంగా ఆదుకున్నట్టు వుంటుందని కాదు మనం మన దేహాలకు మైసూర్ శాండిల్ సబ్బు పూసుకునేది, దుర్వాసనను పోగొట్టుకొనడానికి! ప్రజా సాహిత్యం చదవడం వల్లా మనకూ, మన కుటుంబాలకూ ఎన్నో ప్రయోజనాలున్నాయి."
"బెల్టులకూ, బ్యాడ్జీలకూ, బూట్లకూ, యూనిఫాం డ్రస్సులకూ, పుట్టినరోజు కేకులకే కాదు డబ్బు ఖర్చుపెట్టాల్సింది, ఇట్లాంటి పుస్తకాలకు కూడా అని చెప్తా. ................................................................................................. వాళ్లిద్దరు 'పర్మిషన్' ఇచ్చే ఒక్క పని చేయకపోవడం వల్ల ఎన్ని మంచిపనులు చేయలేకపోయారంటే - పిల్లలు ఇంటికెళ్లి ఒక పుస్తకం గురించి తల్లిదండ్రులతో ముచ్చటించే భాగ్యాన్ని లేకుండా చేసినారు. తల్లిదండ్రులతో ఒక పుస్తకం కొనడానికి, డబ్బు డిమాండ్ చేసే అదృష్టాన్ని లేకుండా చేసినారు."
"నా దగ్గరకి వచ్చేసరికి నా విద్వత్తునూ, నా పుస్తకాన్నీ చూసీ చూడనట్టు చూసి, నా నిరుద్యోగాన్నీ, నా అవస్తల్నీ, నా సైకిల్నీ, నా బీదరికాన్నీ ఎక్కువ భాగం చూసేసి, నాకు సహాయాలు చేసి మంచితనాన్ని చాటుకుంటున్నారు. ................................................................................................... డబ్బుతో సంబంధం లేకుండా ఏ.ఆర్.రహమాన్‌కీ, మాడుగుల నాగఫణిశర్మకీ సన్మానాలు జరిగినట్లే దరిద్రంతో సంబంధం లేకుండా నా బోటి ప్రజా రచయితలకు కూడా సన్మానాలు జరగాలి."
నామిని సుబ్రహ్మణ్యం నాయుడి ఆవేదన మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వ్యాసం పూర్తిగా చదవండి.

3 కామెంట్‌లు:

కాజ సురేష్ చెప్పారు...

నాయుడు గారివి కొన్ని కథలు చదవాను, కాబట్టి నన్ను క్షమిస్తారేమో లెండి. ఈ అవేదన గురించి లింక్ పంపినందుకు ధన్యవాదాలు.

Anil Dasari చెప్పారు...

I've met that girl Mr Namini was talking about - some three years ago when she newly got her posting in DoD, Chennai branch. Very interesting personality indeed. I's amazed at her self confidence and the will to beat all odds.

రవిచంద్ర చెప్పారు...

నాకు కథా సాహిత్యం పై ఆసక్తి ఉన్నా రాయలసీమ మాండలికంలో ఉన్న ఈ కథలు ఎలా మిస్ చేసుకున్నానో అర్థం కావడం లేదు. అందుకనే ప్రస్తుతం నామిని గారి మిట్టూరోడి పుస్తకం చదువుతున్నాను.