...

...

19, జనవరి 2010, మంగళవారం

పజిలును పూరించండి!

నేను క్రాస్వర్డుపజిలు సాల్వుము -2 అనే పేరుతో ఒక టపాలో యిచ్చిన పజిల్‌కు ఇంతవరకూ ఎలాంటి స్పందనా లేదు. బహుశా పొద్దు గడిలో లాగా అక్కడే పూరించే అవకాశం లేకపోవడం ఒక కారణం కావచ్చు. అధిక సంఖ్యలో అడ్డం నిలువు కలిపి మొత్తం 95 ఆధారాలను కనిపెట్టడం మరో కారణం అని నేను భావిస్తున్నాను. అంతా పూరించడం కష్టం అని అనుకుంటే ఎంతవరకు పూరించగలరో అంతే సమాధానలు కౌంటర్ల రూపంలో పంపండి. సరి అయిన సమాధానాలు పజిల్‌లో నింపగలను. ఎక్కువ మంది కలిసి కట్టుగానైనా పూర్తిచేయగలరేమో చూద్దాము. అన్నట్టు ఈ పజిల్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటో కనిపెట్టారా? పజిల్‌ను సాల్వు చేసేకొద్దీ ఆ ప్రత్యేకత ఏమిటో మీకే తెలిసిపోతుంది.

1 కామెంట్‌:

చదువరి చెప్పారు...

నేను ప్రయత్నించానండి.. ఒక ఇబ్బంది వచ్చింది - సాధారణంగా గళ్లనుడికట్టును పూరించేటపుడు గడినీ, ఆధారాలు మార్చి మార్చి చూసుకుంటూ ఉంటాం. మీ గడిలో పేజీని పైకీ కిందికీ పదేపదే జరుపుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. పైగా, అబ్బో.. 86 ఆధారాల గడాయె, ఈ పైకీ కిందికీ జరపడం ఇంకా ఎక్కువ. అడ్డం, నిలువూ ఆధారాలను పక్కపక్కనే ఇస్తే కొంతవరకు ఈ ఇబ్బంది తొలగొచ్చు.