...

...

29, జనవరి 2010, శుక్రవారం

అంతా మన మంచికే!

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ద్రౌపది నవలకు సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించడం పట్ల చెలరేగిన దుమారం మనకందరికీ తెలిసిందే. టీ.వీ చానళ్లలో, పత్రికలలో, బ్లాగుల్లో ఎక్కడ చూసినా ఇది చర్చనీయాంశమైపోయింది. ఈ నవలలో ద్రౌపది పాత్ర చిత్రణలో రచయిత అనౌచిత్యాన్ని ప్రదర్శించాడనీ, కామ ప్రవృత్తి గలిగిన ఓ నీచమైన వ్యక్తిగా ద్రౌపదిని చూపించాడనీ, భారతీయ పౌరుడి మనోభావాలను దెబ్బతీసేదిగా ఈ నవల ఉందనీ, ఈ పురస్కారాన్ని వెనుకకు తీసుకోవలసిందిగా కొందరు డిమాండ్ చేస్తున్నారు. సాహిత్య అకాడెమీని, ఈ నవల ఎంపికలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన జూరీ సభ్యులను వీరు దుమ్మెత్తిపోస్తున్నారు కూడా. వీరిలో కొంతమంది దృష్టిలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు తుచ్ఛుడైపోయాడు. ఈ విమర్శించే వాళ్ళలో చాలామంది అసలు నవలను చదవలేదని, చదువకుండానే ఆ నవలలో ఏముందో తెలుసుకోకుండానే నానా యాగీ చేస్తున్నారని, రచయిత ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడంలో వీళ్ళు విఫలమయ్యారనీ మరో వర్గం వాదన. 


అయితే ఈ వివాదాన్ని కొంతమంది 'అంతా మన మంచికే' అని అనుకుంటున్నారు. అలా భావించి దాన్ని సొమ్ముచేసుకుంటున్నారు. ఈ వివాదం ద్వారా లభించిన పబ్లిసిటితో పుస్తకం సేల్స్ ఖచ్చితంగా పెరిగి ఉంటాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రింటయిన ఈ నవల ఇంకెన్ని రీప్రింట్లు తీసుకుంటుందో వేచి చూడాలి. 


ఇక నవ్య వీక్లీ వారు యార్లగడ్డ తరువాతి నవల సత్యభామను సీరియల్ గా ప్రకటించారు. త్వరలో రాబోయే ఈ నవల ఇంకెన్ని వివాదాలకు స్థానం కల్పిస్తుందో,ఈ సత్యభామలో ఎన్నెన్ని వికారాలను దర్శించాల్సి ఉందో, ఈ సారి ఏ జ్ఞానపీఠానికో మరో దానికో ఈ రచయిత టెండర్ పెట్టబోతున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

1 కామెంట్‌:

మైత్రేయి చెప్పారు...

ఈ ముసలాయనకు ఏదో దశ మారినట్లుంది. పొయ్యేముందు బోల్డంత అపకీర్తి , తిట్లు మూట కట్టుకొని వెళ్ళాలేమో జాతక ప్రకారం. ఏమి సాధిస్తాడు?
మహా మహా వాళ్ళే, పరాయి పాలనే, హిందూ మతాన్ని కూల్చలేక పోయింది.
మహమ్మద్ ఇక్బాల్ అంటారు సారే జహా సే అచ్చా పాట ఇంకో చరణం లో ..
"గ్రీసు, యూనాను, రోమను, సుమేరియన్ మొదలై న మహా నాగరికతలు, సంస్కృతులు అన్ని మట్టి కరిచి కొత్తవి వచ్చాయి,అప్పటి సింధూ లేక హిందూ సంస్కృతీ ఇంకా ఉంది."
అలాగే ఉంటుంది.