...

...

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

క్రాస్‌వర్డుపజిల్ సొల్యూషన్!

మొత్తంమీద క్రాస్వర్డుపజిలు సాల్వుము -2 అనే టపాలో నేను ఇచ్చిన క్రాస్వర్డుపజిల్‌కు యిచ్చిన గడువు ముగియడంతో ఆ పజిల్ సొల్యూషన్‌ను  ఇక్కడ ప్రకటిస్తున్నాను. ఈ పజిల్‌ను సాధించడానికి ప్రయత్నించిన జ్యోతి, ఊకదంపుడు, ఫణిప్రసన్నకుమార్, మలక్‌పేట రౌడీ, మందాకిని, చదువరి, కుంభకర్ణ గార్లకు నా హృదయపూర్వక అభినందనలు. 



వివరణలతో కూడిన సమాధానాలు:
అడ్డం:1 కమల తనయ (ఇందిరాగాంధీ కమలానెహ్రూ కూతురు కదా!),4.నటన,6. వచన రచన, 10 తడ (తడ అనే ఊరు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులకు దర్శనీయమైంది. తడ అంటే కొన, అంచు అనే అర్థాలున్నాయి.), 11.డజ, 12.సమత,13.తరక(తరక అంటే తాలు, తప్ప, పొల్లు అని అర్థం) 15.అలవ (అలవ= కంచె),17.రవరవ (రవరవ అనేది పోటికి పర్యాయపదం), 21.గవరన (గవరన = ఎఱుపు,ఎఱ్ఱనిది), 23.అలసట, 24.పచరణ (పచరణ =ప్రియ వచనము, ఇచ్ఛకము),25. అగడత (అగడత, అగడ్త = పరిఖాతము, కందకము)28.భరనభ (భరనభభరవ ఉత్పలమాల గణాలు),30.నగ, 32.పడవ, 34. నడవ(నడవ =ప్రాంగణము), 37.జట (జట = జడ),39.సప,42. జలలత (జలలత = కెరటం), 43.కత, 45.దశ, 47. అవతల, 50. మఘ, 53.మమ, 56.ఎడమ,57.నగజ, 59.నవ (నవ అంటే దురద. కూరగాయలు తాజాగా ఉండటాన్ని నవనవలాడుతున్నాయి అంటారుకదా!),61.తలగడ, 65.పరమత, 67.అమవస,68.పడమర, 69.సరజస (సరజస = రజస్వల), 72.మసజస(మసజసతతగ శార్దూల విక్రీడితం గణాలు),74. భజన,76. కనక,78.జనత (జనతాపార్టీ జయప్రకాశ్‌నారాయణ నేతృత్వంలో ప్రారంభమైంది),81.వడ,82.లత, 84.నగధర వశ, 85.పడక,86.శరవణభవ

నిలువు: 1.కటమర (కటమర అంటే దవడ),2.లయ,3.నదమ(మదన = మన్మథుడు),4.నడత,5.నడక, 7.చగల(చగల = మేకపోతు), 8.రమ (రాగతి రమ పేరున్న రచయిత్రి),9.నలకన,12.సవ (సవ = ఆచూకీ, అనుక్రమము,14.ర ఇ(ఇర = కల్లు) ,16. వగ (వగ = విధము, పద్ధతి, పరిపాటి),18.వటగ (వటగ = నేర్పరి), 19.మసక,20.అచల,22.రసన(రసన = నాలుక), 25.అచలజ (అచలజ = పార్వతీ దేవి), 26.తన, 27.కడ, 28.భవ (మేడ = భవనము అందులో మొదటి సగము భవ), 29.భయ (భయము =వెఱపు), 31.గజ, 32.పల( కత్తి మహేష్‌కుమార్ గారి బ్లాగు పేరు పర్ణశాల),33.వస (వశముకు వికృతి వసము. వసపడుట అంటే సాధ్యపడుట), 35. డన (నడ = కదము),36.అలక, 38.టక, 40.పద,41.కవట (పశురోగ విశేషము), 44.తమ, 46.శమ, 48.ల ఇవత(లేదా)లవ ఇత, 49.దడ (దడ = భయము), 51.ఘన, 52.పజ, 54.మన, 55.హత (హత అనగా కన్యాత్వము చెడిన స్త్రీ, దూషిత),56. ఎడ, 58.గడ, 60.వప (వప = రంథ్రము), 62.లహర, 63.రవణ (రవణ అంటే భర్త, అందము అనే అర్థాలున్నాయి), 64.కడవ, 66.మనజ( జనమ - జన్మ - పుట్టుక),69.సరసన,70.సభ, 71.దన, 72.మత, 73.సవసవ (సవసవ = అల్పము, సూక్ష్మము),75.జనవ, 76.కడప, 77.కలక, 79.నసర, 80.వధ, 83.ఫణ (ఫణ = పడగ, నుదురు)

ఈ పజిల్‌ను తయారు చేసుకోవడానికి ఆచార్య జి.ఎన్.రెడ్డిగారి పర్యాయపద నిఘంటువు ఉపయోగపడింది.       

3 కామెంట్‌లు:

ఊకదంపుడు చెప్పారు...

ఈ సారి కాసిని తక్కువ గడులతో ఇవ్వండి. ( ఓ 12 యేళ్ల క్రితం అంధ్రప్రభ వారప్రత్రిక లో వచ్చేవి చూడండి అంతవి) పొద్దు వారు వారి దగ్గర ఉన్న ఉపకరణాన్ని పంచుకుంటారేమో - గడిలోనే నింపటానికి వీలుగా

mmkodihalli చెప్పారు...

ఊకదంపుడు మహాశయా! కొంత వ్యవధి తీసుకుని మీ ఆజ్ఞ శిరసావహిస్తాను.

ఊకదంపుడు చెప్పారు...

మురళి గారు,
ఈ మధ్యనే ఓ మిత్రుడు అన్నాడు, నీ English Dictionary లో కర్టసీ లో "ఒ" ఉండి ఉండదు అని. ఇంకో మిత్రుడు నేను పొరబాటున ఎప్పుడైనా Thanks చెబితే, ఒద్దురా "నీ కోట శ్రీనివాసరావ్ Thanks "అంటాడు. మిమ్మల్ని నొప్పిస్తే క్షంతవ్యుడిని.
ఆజ్ఞ కాదండీ, నూటికి నూరుపాళ్లు వినతియే.
భవదీయుడు