ఇంతకు ముందు ఇదే శీర్షికతో ఇచ్చిన టపాలో మునిపల్లె రాజుగారి కథ కస్తూరితాంబూలంలో ఉన్న తప్పును కనిపెట్టమని అడిగాను. ఇంతవరకూ ఎవరూ కనుక్కోలేక పోయారు. సరే! ఇప్పుడు ఇక్కడ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుగారి పద్యం ఇస్తున్నాను.
జఠర రసమేల స్రవియించు జఠర గ్రంధి?
అడవిలో యేల నివసించు నడవి పంది?
ఏల పిచ్చి కుక్క కరుచు? కాకేల యరుచు?
ఏల తలమీద వెండ్రుకలిన్ని మొలుచు?
జొన్నవిత్తుల వారి పై పేరడీ పద్యానికి మాతృక అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పద్యం ఏమిటో కనిపెట్టగలరా?
సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికల నేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? మూడో పాదం లో గాడ్పేల విసరు అని చూసి - నాకు పేరడి చేయాలనిపించిది- అనుమతి ఇవ్వండి.. ఓ నెలలపిల్లాడికి హాయిగా స్నానం చేయించి ఊయలలో పడుకో బెట్టి- సాంబ్రాణి వేస్తే - ఇలా అనుకుంటున్నాడు సౌరభములేల కల్గు డోలసజ్జందు శబ్దముల నేల వెదజల్లు ఆటబొమ్మ? [ఈ లోపల బట్ట తడుపుకున్నాడు] ఏల సలిలంబు పారు? ఏడ్పేల వినరు? ఏల నా నిదురందు మాన్పింతు నిన్ను?
మలక్‌పేట్ రౌడీ, ఊకదంపుడుగార్లకు మహాశివరాత్రి శుభాకాంక్షలు! ఊకదంపుడుగారూ కృష్ణశాస్త్రిగారి పద్యం కనుక్కోగలిగారు. హ్యాట్సాఫ్! మీ పేరడికూడా అదిరింది. మలక్‌పేట్ మీరు చాలా దగ్గరికొచ్చారు. ఆ తప్పు శివరాత్రికి సంబంధించినదే. కాస్త మీబుర్రకు పని పెట్టండి:)
3 కామెంట్లు:
ఈ మూడిట్లో ఒకటి తప్పవ్వచ్చు -
1. శివరాత్రి రోజు పోస్టాఫీసుకు సెలవు
2. తంతి మనీ-ఆర్డర్ ని పోస్టాఫీసులో తీసుకోవడం
3. శేషమ్మగారి కర్మ రోజు వ్రాసిన జాబుకి కస్తూరి వాసన అంటడం
సౌరభము లేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికల నేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?
మూడో పాదం లో గాడ్పేల విసరు అని చూసి - నాకు పేరడి చేయాలనిపించిది- అనుమతి ఇవ్వండి..
ఓ నెలలపిల్లాడికి హాయిగా స్నానం చేయించి ఊయలలో పడుకో బెట్టి- సాంబ్రాణి వేస్తే - ఇలా అనుకుంటున్నాడు
సౌరభములేల కల్గు డోలసజ్జందు
శబ్దముల నేల వెదజల్లు ఆటబొమ్మ?
[ఈ లోపల బట్ట తడుపుకున్నాడు]
ఏల సలిలంబు పారు? ఏడ్పేల వినరు?
ఏల నా నిదురందు మాన్పింతు నిన్ను?
భవదీయుడు
ఊకదంపుడు
మలక్‌పేట్ రౌడీ, ఊకదంపుడుగార్లకు మహాశివరాత్రి శుభాకాంక్షలు! ఊకదంపుడుగారూ కృష్ణశాస్త్రిగారి పద్యం కనుక్కోగలిగారు. హ్యాట్సాఫ్! మీ పేరడికూడా అదిరింది. మలక్‌పేట్ మీరు చాలా దగ్గరికొచ్చారు. ఆ తప్పు శివరాత్రికి సంబంధించినదే. కాస్త మీబుర్రకు పని పెట్టండి:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి