...

...

9, ఏప్రిల్ 2011, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 41



ఆధారాలు:
1.  ఎంగిలి విస్తరాకులో వ్యాఘ్రము కనబడిందా? (2,6)
3. తొలురిక్క నెల.(4)
5. దక్షిణ భారత కాలగణన పద్ధతి యిది. (5,2)
7. మంచి మతపు యంగీకారము.(3)
9. జలవిహార్‌కు వెళ్ళినవాడు :) (5)
10. మెగాస్టార్ తమ్ముడు. యిప్పుడు తీన్‌మార్ అంటూ డప్పుకు దరువు వేయమంటున్నాడు.(3,2)
11. నిలువు 8లో బిందువు లోపిస్తే ఋషులాచరించేది. (3)
14.ముదిగొండ శివప్రసాదు వారి నవల తంజావూరు విజయం అయితే మల్లాది వసుంధర గారిది? (4,3)
15.  భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన వ్యక్తి అట్నుంచి.(4)
16. నక్క గుణము :) (6)
నిలువు:
1. ప్రశాంతినిలయానికీ శివతాండవానికీ వున్న సంబంధం.(4)
2. ఉబలాటపడే మాజీ మంత్రిణి(5)
4. హస్తినలో ధర్నా సెంటర్ (3,3)
5. ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య 19,యతి ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము
ప్రాస పాటించ వలెను ప్రాస యతి చెల్లదు.... యింతకీ నేను చెబుతున్నది దేని గురించి?(3,4)
6. నల్లమోతు శ్రీధర్‌గారి ఒకప్పటి కలనయంత్రపు తెలివిడి (4,3)
7. భలె భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ అంటూ పాట పాడిన నటి  (3)
8. అడ్డం 11లో సున్న చేరిస్తే బలుపు అవుతుందా(3)
9. ఈ బ్లాగరువి అందమైన అక్షరాలు (4,2)
12. ఏలూరులోని బలమైన ప్రదేశం (3,2)
13. అలజడి(4)

9 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం
1. పులివిస్తరాకు, 3. ఆశ్వయుజం, 7. సమ్మతం, 9. జలవిహారి, 10. పవర్‌స్టార్, 11. తపము, 15. ర్మవవిర, 16. కపటవర్తనం.
నిలువు
1. పుట్టపర్తి, 2. కుతూహలమ్మ, 4. జంతర్‌మంతర్, 5. శార్దూలవిక్రీడితం, 6. కంప్యూటర్‌విజయం, 7. సరిత, 8. తంపము. ........

mmkodihalli చెప్పారు...

కంది శంకరయ్యగారూ! మీరు పంపిన వాటిలో అడ్డం 16 తప్ప మిగిలినవి అన్నీ కరెక్టేనండి.

mmkodihalli చెప్పారు...

కంది శంకరయ్య గారూ! నిలువు 6 కూడా తప్పేనండి.

అజ్ఞాత చెప్పారు...

ప్రశాంతినిలయానికీ శివతాండవానికీ వున్న సంబంధం.(4) -- భలే !!!

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

14 అడ్డము :తంజావూరు పతనం

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

12 నిలువు పవర్ పేట

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

16 అడ్డము టక్కుటమారము

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) పులియిస్తరాకు, 3) ఆశ్వయుజం, 5) శాలివాహనశకం,7) సమ్మతం, 9) జలవిహారి, 10) పవరుస్టారు, 11) తపము, 14) తంజవూరుచరిత్ర, 15) ర్మవవిర, 16) టక్కరితనము.
నిలువు: 1) పుట్టపర్తి, 2) కుతుహలమ్మ,4) జంతరుమంతరు, 5) శార్ధులవిక్రీడితం 6) కంప్యూటరుచరిత్ర,7) సరిత, 8) తంపము,9) 12) పవరుపేట, 13) కల్లోలము.

mmkodihalli చెప్పారు...

ఈ క్రాస్‌వర్డ్ పజిల్‌ను పూరించడానికి ప్రయత్నించిన కంది శంకరయ్య, గన్నవరపు నరసింహమూర్తి, భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లకు అభినందనలు!