...

...

11, ఫిబ్రవరి 2012, శనివారం

స్పర్శించే స్వరం


  ఆశబోతు, పొగరుబోతు. సమకాలీన వీరుడు. ఒక్క అక్షరం ముక్కతో సమాజాన్ని ఎదిరించినోడు. జీవితాన్ని యుద్ధమంత అందంగా జీవించినోడు. ప్రగతిశీల ఉద్యమాల బాటలో పూలై పూసినోడు. చీకటి జీవితంలో కూడా చిరునవ్వును వీడనోడు. ఆకాశానికి, భూమికి హద్దులు చెరిపేసినోడు. మాటలకు, రాతలకు మధ్య ఖాళీని పూరించినోడు, ప్రపంచాన్ని తిరగేసి సత్తా చాటాలనేటోడు. ఎగిరే జెండాలకు దరువైనోడు. బతుకుపుటల్లో కవిత్వపు మెతుకులు తిన్నోడు.
  తాగుబోతు, తిరుగుబోతు. సాహిత్యమంటే తీరని ప్రేమున్నోడు. సముద్రాన్ని ఎదురించి అలలకు తన తాత్వికత బోధించెటోడు. హిందీ అయినా, ఇంగ్లీషైనా అనువాదాల నిండా తన ముద్రను చెరిపేసుకోగలిగినోడు.
  మనిషిని ... మనసును తనకు మించి ప్రేమించగలిగినోడు. సమాజపు పొరలు దాటి బతకటం చేతైనోడు. హృదయానికి స్వేచ్ఛను, స్వచ్ఛతని ఇవ్వగలగినోడు.
  వాడు .. నిజంగా ... నిఝంగా వాడే. వాడి గురించి ఇలా రాస్తూపోతే అక్షరాలు ఎరుపెక్కుతాయ్ ... నల్లరంగు పులుముకొని నవ్వేస్తాయ్ ... మౌనంగా రోదిస్తాయ్ ... ద్రవాలై స్రవిస్తాయ్ ... ఆపై క్రీడిస్తాయ్. వాడిని గురించి ఇంకా తెలుసుకోవాలంటే కథాజగత్‌లో డా.ఎ.రవీంద్రబాబు వ్రాసిన స్పర్శించే స్వరం కథ చదవండి. 
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి