ఓమ్
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీకృష్ణ సంకీర్తనములు
గ్రంథకర్త :-
కీ.శే.కోడీహళ్ళి చన్నరాయప్ప
61.దేవేంద్రుడుగ్రుడై - తీవ్రముగ వర్షింప
గోవర్ధనాద్రిని - గొడుగుమాదిరినెత్తి
గోవులను గోపకుల - కోరి రక్షించితివి
దేవేంద్రు గర్వమును - దేవ! ఖండించితివి llకృష్ణll
62.ఎటువలె ప్రహ్లాదు - నేలితివి కరుణ
ఎటువలె కరిమొఱను - ఎఱిగి బ్రోచితివి
కుటిలుడ చపలుడ - క్రూరుడగు నన్ను
అటువలె రక్షింపు - అచ్యుత! కృష్ణా!! llకృష్ణll
63.గారడి మాయగ - గన్పడి సర్పము
వారక నాశము - వనరుహ లోచన!
సారహీన సం - సారమసారము
ఘోరవిపత్తులొ - గూల్పకుము కృష్ణా! llకృష్ణll
64.దుర్జనులైనట్టి - దుష్టరాజులను
నిర్జింప మనసిడి - నిఖిలాధారా!
దుర్జనుల రణమున - దునుమాడుటకై
అర్జునకు సారథి - వైతివి కృష్ణయ్య llకృష్ణll
65.తారల లెక్కలను - త్వరగ జెప్పగవచ్చు
భూరేణు గణితము - బోల్చి పల్కగ వచ్చు
నారాయణ నిన్ను - నయముగ వర్ణింప
అరయ తరమౌనె - హర బ్రహ్మాదులకైన llకృష్ణll
66.గ్రహభయదోషములు - గ్రక్కున మాయమౌ
బహు పీడలు కూడ - బాసిపోవు వేగ
ఇహపరసౌఖ్యములు - ఇమ్ముగ గలుగుటకు
బహుయోచనలేల - భక్తిని భజియింప llకృష్ణll
67.అండజ వాహన! - బ్రహ్మాండములనెల్ల
చెండులుగ నెత్తుచు - చెలగియాడు నీకు
కొండల నెత్తుట - కొండిక పని గాక
కొండ నీకు దొడ్డ - కొండ గాదు కృష్ణ llకృష్ణll
68.కందర్ప సుందర! - కరుణ సింధు మూర్తి!
మందరధర కృష్ణ! - మధుకైటభాంతక!
సుందర విగ్రహ! - సుర ముని గుణ వంద్య!
వందనములు భక్త - వత్సల! శ్రీకృష్ణ ! llకృష్ణll
69.పదియారు వేలుగ - పద్మాక్షులు నీకు
ముదితలై యుండగ - ముద్దుగ కులుకుచు
విదితముగ వారలకు - వేడుకల జూపుచు
వదలక రమియించి - వసుధ బరగితివయ్య llకృష్ణll
70.భవబంధ మోచన - భక్త జన పోషణ
పవనజ నుత రామ - భద్రాద్రి రామా!
అవని నాయకుడ - ఆశ్రిత పోషకుడ
భవహర! మురహర - భక్త కల్పవృక్ష! llకృష్ణll
(సశేషము)
2 కామెంట్లు:
ఓ సత్కవి స్వామివారిని వేడిన గీతాన్ని అందించారు . ధన్యవాదములు
ఈ సత్కవి మా ముత్తాతగారే (మా తల్లిగారికి మాతామహులు)నండీ. క్రిమికీటకచ్ఛటాపూరితమై వృథసెడెడి అముద్రిత పంక్తిని ఇలా కంప్యూటరీకరించానంతే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి