...

...

9, అక్టోబర్ 2010, శనివారం

కనుక్కోండి చూద్దాం!కి - సమాధానం!!



కనుక్కోండి చూద్దాం! శీర్షిక ఇచ్చిన పంక్తులు విద్వాన్ విశ్వంగారి సుప్రసిద్ధకావ్యం పెన్నేటి పాట లోనిది. పెన్నా నది ప్రవహిస్తున్న(?) రాయలసీమ ప్రాంతంలోని కరువు పరిస్థితులను పై వాక్యాలు మనకు కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నాయి. కారణాలు ఏవైనా ఈ కావ్యానికి రావలసినంత పేరు రాలేదు. ఈ అద్భుత కావ్యంపై రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారి అభిప్రాయం ఇలా  ఉన్నది.

నా మిత్రులు విద్వాన్ విశ్వంగారి తీవ్ర నిర్వేదమే ఈ పెన్నేటి పాటగా పరిణమించినది.విశ్వంగారిది మానవ హృదయము. ఊహకన్న, భావనకన్న అనుభవమే మూలాధారముగా వెడలిన పరవశ రచన వీరి 'పాట'. 'పీనుగుల పెన్న', 'వట్టియెడారి','నక్కబావలు', 'నాగుబాములు','బొంతగద్దలు','రేణిగంపలు',"పల్లేరుగాయలు','తుమ్మతోపులు' ఇత్యాది అసంఖ్య సామగ్రితో విశ్వంగారి కవితావిరూపాక్షుడు తాండవించినాడు; భాష, అర్థము, భావము, చందస్సు అన్నియు ఆ తాండవమునకు ప్రక్క వాద్యాలు వాయించినవి. 'పిన్పాట' పాడినవి! ఒక మాటలో, ఒక చేయూపులో, ఒక తలయాడింపులో, ఒక తిరుపులో ఈ నటరాజు రాయలసీమలోని భూతభజ్జీవితమునందలి చిన్న పెద్ద ఖండికలెన్నో విసరివైచినాడు. 



కామెంట్‌లు లేవు: