...

31, డిసెంబర్ 2011, శనివారం
26, డిసెంబర్ 2011, సోమవారం
గగనమేగిన తారలు!
2011లో కన్నుమూసిన సాహిత్యరంగానికి చెందిన ప్రముఖులను స్మరిస్తూ ఈరోజు సాక్షి సాహిత్యం పేజీలో ఒక వ్యాసం వచ్చింది. దానిని ఇక్కడ చదవ వచ్చు. అయితే ఈ వ్యాసం అసమగ్రంగా ఉంది అనిపిస్తోంది. ముఖ్యంగా సెప్టెంబరు 13న మరణించిన అనకాపల్లికి చెందిన ప్రముఖ కవి బద్ది నాగేశ్వరరావు, డిసెంబరు 12న అస్తమించిన సహజకవి మల్లెమాల సుందరరామిరెడ్డి, 23 డిసెంబరున మరణించిన ప్రముఖ సినీ రచయిత త్రిపురనేని మహారథి మొదలైన వారిని ప్రస్తావించక పోవడం ఒక లోటు.
25, డిసెంబర్ 2011, ఆదివారం
కారామాష్టారి మెప్పు పొందిన కథ!
కాళీపట్నం రామారావు గారిచే ప్రశంసలను అందుకున్న పోతుబరి వెంకట రమణగారి కథానిక కృతజ్ఞతను కథాజగత్‌లో మీరూ చదవండి.
Labels:
katha jagat
24, డిసెంబర్ 2011, శనివారం
చిరుగు బొంత
'ఒరేయ్! చూడు ఈ లోకంలో నువ్వనుకుంటున్నట్లుగా స్వాభిమానం లేనివాడంటూ ఎవడూ ఉండడురా. కానీ మన స్వాభిమానం మన మనుగడకు అడ్డం కాకూడదు. ఈ కాలంలో ఏ ఎండకాగొడుగు పట్టేవాడే ఆనందంగా ఉండగలడు. మారుతున్న కాలాన్ని బట్టి మనమూ మారాలి' చెప్పాడు జగన్నాథం.
జగన్నాథం మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? జగన్నాథం అలా వాదించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? తెలుసుకోవాలంటే కథాజగత్‌లోని సోమవఝల నాగేంద్రప్రసాదు గారి కథ చిరుగు బొంత చదవండి.
జగన్నాథం మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? జగన్నాథం అలా వాదించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? తెలుసుకోవాలంటే కథాజగత్‌లోని సోమవఝల నాగేంద్రప్రసాదు గారి కథ చిరుగు బొంత చదవండి.
Labels:
katha jagat
21, డిసెంబర్ 2011, బుధవారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 61
ఈసారి పజిల్ కథాజగత్ ఆధారంగా ఇవ్వబడింది. కథాజగత్ వెబ్సైట్ చూస్తే ఈ పజిల్‌ను సులభంగా నింపవచ్చు.
ఆధారాలు:
అడ్డం:
1. ఎ.వి.ఎం.గారి కథానిక(2)
2.
'కారులో షికారు' చేయిస్తున్న రచయిత్రి (2)
3. శశిశ్రీ కథ! (3,2)
5.
సత్యం మందపాటిగారి కథ (2)
6.
కలిసుందాం రా! అంటున్న కథకుడు తడబడ్డాడు.(3)
7.
దేవరకొండవారి కథానిక (3)
8.
నిలువు 8లోని కథను వ్రాసిన వారి ఇనిషియల్
(2)
10.
దీక్షితులవారి కథలో తొలి రెండక్షరాలు (2)
11.
స్వాతీ శ్రీపాద వ్రాసిన కథ (2)
12.
రెండులోకాల కథకుడి ఇంటిపేరు (4)
14.
ఆనందాన్వేషణ చేస్తున్న రచయిత(1)
15.
పొన్నాడ కుమార్ గారి రిజిగ్నేషన్(4)
16.
జాతి వివక్షపై నిడదవోలు మాలతి గారు సంధించిన అస్త్రం (4)
19.
అక్కిరాజు భట్టిప్రోలుగారి కథలో ఒక సున్నా మాయం(2)
20.
కంది శంకరయ్యగారి కథ!(3)
24.
చిన్ని... చిన్ని... ఆశ వ్రాసింది (4)
25. “ఎప్పుడైనా స్కూలుకి
వెళుతూ ‘ఇవ్వాళ
కొంచెం లేటవుతుంది’ అని చెబితే – ‘పిల్లలూ! మీకు జిలేబీ చుట్టలు, నాకు మల్లెపూలు వస్తాయిరోయ్’
అని బ్రాకెట్ బి.ఎ.చమత్కరించేది” ఈ వాక్యాలు ఈ కథలోనివి.(4)
నిలువు:
2. రాంగు సుబ్బారావు రైటరు (2)
3. అరిపిరాల సత్యప్రసాద్ గారి భక్తిరస కథ! (2,5)
4. జగ్నేకీ రాత్ బ్లాగరు వ్రాసిన కథ (3)
5. కిషన్ రావుగారి సుజనత్వము (3)
6. 'వేలాడిన మందారం' జ్వాలాముఖిగారిది. మరి
తంగిరాల చక్రవర్తి గారిది? (3,3)
8. పాకుడురాళ్ళు రచయిత కథాజగత్కు అందించిన కానుక
(3)
9. వూసల రజనీగంగాధర్ వర్తమాన రాజకీయాలపై విసిరిన సెటైర్
(4)
13. అరుణపప్పుగారి
కథ చివరిదాకాలేదు కానీ మొదటి అక్షరం కూడా లోపించింది. దాంతో అర్థం కూడా మారిపోయింది(3)
17. సి.ఎస్.రాజేశ్వరి
వ్రాసిన కథ (2)
18. యండమూరి వీరేంద్రనాథ్
నవల కాదు అడపా చిరంజీవి కథ (4)
21. పాలపిట్ట సంపాదకుని
కథ (2)
22. నిన్నలా... మొన్నలా...
లేదురా! కథకుని ఇంటిపేరు క్రింది నించి పైకి (2)
23. కె.వరలక్ష్మిగారి
కథలోనూ, సహదేవరావుగారి కథలోనూ కామన్‌గా ఉన్నది (2)
18, డిసెంబర్ 2011, ఆదివారం
కథా విశ్లేషణ పోటీ!
తెలుగు కథ శతవార్షికోత్సవ కానుక వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో 200 కథలు ప్రకటించిన సందర్భంగా తురుపుముక్క తెలుగు బ్లాగర్లకు ఒక పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీకి తెలుగులో బ్లాగులు నడుపుతున్న ప్రతి ఒక్కరూ అర్హులే. మీరు చేయవలసినదల్లా కథాజగత్‌లోని కథల్లో ఒక కథను ఎంపిక చేసుకుని ఆ కథ మీకు ఎందుకు నచ్చిందో, లేదా ఎందుకు నచ్చలేదో వివరిస్తూ ఆ కథపై మీ విశ్లేషణను ఇచ్చిన గడువులోగా మీ బ్లాగులో ఒక టపా వ్రాసి ఆ టపా లంకెను ఇక్కడ కామెంటు రూపంలో ఇవ్వడమే. వచ్చిన ఎంట్రీలలో ఉత్తమమైన మూడు విశ్లేషణలను కథాసాహిత్యంలో పేరుగాంచిన న్యాయనిర్ణేతలచే ఎంపిక చేయించి బహుమతులు ఇవ్వనున్నాము.
ఈ పోటీ 18 డిసెంబర్ 2011 నుండి 31 జనవరి 2012 వరకు వుంటుంది. 31-01-2012 సాయంత్రం 6.00గంటలకు(భారతీయ కాలమానం ప్రకారం) ఈ పోటీ ముగుస్తుంది.
నియమ నిబంధనలు:
1. మీ విశ్లేషణను మీ బ్లాగులోనే టపా రూపంలో ప్రకటించాలి. మీ ఎంట్రీలో కథ పేరు కథా రచయిత పేరు స్పష్టంగా పేర్కొనాలి. ఆ కథకు చెందిన లింకును కూడా మీ టపాలో తప్పనిసరిగా ఇవ్వాలి.
2. మీ విశ్లేషణ సుమారు 200 - 500 పదాల మధ్య వుండాలి.
3. మీ టపా సాధ్యమైనంత వరకూ మీరు విశ్లేషించబోయే కథకు పరిమితమై వుండాలి. వ్యక్తిగతంగా ఎవరనీ కించపరిచేదిగా వుండరాదు. అలాంటి ఎంట్రీలు పోటికి పరిశీలింపబడవు.
4. ఒక్కొక్కరు ఎన్ని కథలనైనా విశ్లేషించ వచ్చు. అయితే ప్రతి కథను విడివిడిగా విశ్లేషించి విడివిడి టపాల్లో పెట్టాలి.
5. మీ టపాతో పాటు మీ బ్లాగులో కినిగె.కాం వారి బ్యానరు విధిగా ప్రకటించాలి.
ఈ బ్యానరుకు సంబంధించిన కోడ్ క్రింద ఇవ్వబడింది.
<a href="http://kinige.com"><img
src="http://kinige.com/images/kinigebannerImage.png" border="0" >
<br />కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా </img></a>
పై కోడ్‌ను కాపీ చేసి మీ బ్లాగులో ఉపయోగించుకోవాలి.
6. ఈ పోటీగురించి మీ బ్లాగులో ప్రకటించ వచ్చు కానీ అది కంపల్సరీ మాత్రం కాదు.
7. ఈ పోటీ వున్నంత కాలం, మరియూ ఫలితాలు ప్రకటించే వరకూ మీ ఎంట్రీలను,
కినిగె .కాం వారి బ్యానరును మీ బ్లాగునుండి డిలిట్ చేయరాదు.
8. మీ ఎంట్రీలలోని కంటెంట్‌ను తురుపుముక్కలోగానీ, కథాజగత్‌లో కానీ లేదా ఎక్కడైనా ఏరూపంలోనైనా ఉపయోగించుకునే( ఆ రచయితకు క్రెడిట్ యిస్తూ) హక్కు మాకు వుంటుంది.
9. మీ ఎంట్రీకి చెందిన లింకును ఈ టపాలో కామెంటు రూపంలో పంపాలి. అలాగే mmkodihalli@gmail.com కి ఇ-మెయిల్ చెయ్యాలి. లేకపోతే మీ ఎంట్రీ పరిశీలింప బడటానికి అవకాశం వుండకపోవచ్చు.
10. విజేతల ఎంపికపై పూర్తి అధికారం న్యాయనిర్ణేతలదే.
బహుమతుల వివరాలు:
మొదటి బహుమతి : 2000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్
రెండవ బహుమతి : 1000/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్
మూడవ బహుమతి : 500/- రూపాయల విలువ చేసే కినిగె.కాం వారి గిఫ్ట్ కూపన్
మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రోత్సాహక బహుమతి.
ఈ పోటీలో పాల్గొనడానికి చివరి తేదీ 31-01-2012. త్వరపడండి.
17, డిసెంబర్ 2011, శనివారం
కథాజగత్‌లో 200వ కథ!
రావిపల్లి నారాయణరావుగారి కథ అభయం కథజగత్లో ప్రకటించాము. దీనితో కథాజగత్‌లో ప్రకటించిన కథల సంఖ్య రెండు వందలయ్యింది. ఈ సందర్భంగా ఇదివరకు లాగానే బ్లాగర్లకు కథావిశ్లేషణ పోటీ ఒకటి నిర్వహించాలనుకుంటున్నాము. వివరాలు ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తాను.
Labels:
katha jagat
16, డిసెంబర్ 2011, శుక్రవారం
ఖజురహో - అదరహో
మిత్రులతో పాటుగా ఖజురహో చూసే అవకాశం లభించింది. క్రీ.శ.10 - 12 శతాబ్దాల మధ్యకాలంలో చండేలా రాజులచే నిర్మింపబడి అద్భుతమైన శిల్పకళా ఖండాలు కొలువుదీరిన దేవాలయాలు ఈ ఖజురహోలో దాదాపు ఇరవై దాకా ఉన్నాయి. లక్ష్మణ దేవాలయం, వరాహ మండపం, మాతా నాగేశ్వర దేవాలయం, విశ్వనాథ దేవాలయం, చిత్రగుప్త దేవాలయం, కాందారియ మహదేవ దేవాలయం, చతుర్భుజ దేవాలయం, దేవి జగదంబి దేవాలయం, దులాదేవ్ దేవాలయం, పార్శ్వనాథ దేవాలయం, ఆదినాథ దేవాలయం మొదలైనవి తనివి తీరా దర్శించి సంతోషించాము. పనిలో పనిగా ఊర్ఛా అనే చోట రామ రాజ దేవాలయం, చతుర్భుజ దేవాలయం చూశాము. ఈ ఖజురహో శిల్ప సౌందర్యాలు కొన్ని ఇక్కడ మీకోసం.
10, డిసెంబర్ 2011, శనివారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 60
ఆధారాలు:
అడ్డం:
2. ఒక నెల (1)
4.
అడ్డం 2తో తిండి (1)
6.
వంకర (3)
7.
ఊరుతో యుద్ధం (3)
8.
దీని చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు అని ఆరుద్ర స్టేట్మెంట్ (3)
11.
అడ్డం 4తో మాగాణి (1)
12.
ఈదుల్-అజ్ హా (3)
13.
అటూ ఇటూ ఎటైనా వర్తులమే (3)
14.
అడ్డం 11తో సామాన్యుడి రథం (1)
18.
సమానమైన, సదృశ్యమైన (3)
19.
సత్యవచనము, సాధుభాషణము, శుభము, శోభనము (3)
20.
అజీర్తి (3)
23.
అడ్డం14తో కరువు (1)
24.
శివుడే శ్మశానానికి దొర కదా (3)
25.
నౌఖరు, ప్యూను (3)
26.
అడ్డం23తో మనోజ్, విష్ణుల యింటిపేరు (1)
30.
కార్పెంటరు (3)
31.
గణనాపూర్వకోపనిధి (3)
32.
పతాక సన్నివేశం తారుమారైంది (3)
33. అడ్డం 26తో బాకు (1)
34.
అడ్డం 33తో చలినుండి మనల్ని మనం కాపాడుకునే ఒక సాధనం (1)
నిలువు:
1. క్రమభంగము, దుర్మార్గము, నేరము, దుష్కార్యము (3)
3. ఆగ్రా నేత్రంతో
అపాంగము (3)
5. పద్మిని, శంఖిని,
హస్తిని మొదలగు స్త్రీ జాతులలో నొక జాతి (3)
9. ఇసుక, కంకర, సిమెంటుల
మిశ్రణం (3)
10. జడపదార్థము
(3)
15. పాము (3)
16. అప్పు లేమి
(3)
17. గుడ్డిగా ఒకరి
వెంట నడిచేవారిని వీటితో పోలుస్తారు (3)
21. పేగు మధ్య పళ్ళెంతో
రెచ్చిపో (3)
22. నియంత్రణ (3)
27. భూమి ఇలా ఉంటుంది
(3)
28. ఆక్షేపించువాడు
(3)
29. ఆంగ్లంలో మొగ్గు, వాలు (3)
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
4, డిసెంబర్ 2011, ఆదివారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 59
అడ్డం:
1. ఆవు, గంగ, తులసి, హనుమంతుడు,
భీముడు లేదా పవిత్రురాలు (3)
4.
ఈ చీర కట్టుకున్న చిన్నది బంగారు బాబు చిత్రంలో వున్నది (3,2)
7.
అమెరికా బుల్లెమ్మ గుఱ్ఱమునెక్కు సాధనము (3)
9.
అడవి మల్లెలో మత్స్య విశేషము (2)
11.
నరసయ్య పేరులో నాల్క (3)
13.
2 3 5 అక్షరాలతో గణిత సంబంధము, 1 4 5 అక్షరాలతో శరీర సంబంధముగల తత్తరపాటు (5)
15.
పద్యం కానిది అనడానికి వీలు లేదు. ఇప్పుడు
ఈ పద్యాలు కూడా వస్తున్నై (3)
17.
గ్యాసు నూనె కొన్నిప్రాంతాలలో __ నూనె (2)
18.
కొప్పు (4)
20.
సూర్య నటించిన తమిళ డబ్బింగ్ సినిమా (2)
22.
అయిదక్షరాల తుమ్మెద (5)
23.
మరల వ్యావహారికంలో కుచించుకుపోయింది (2)
24.
పంటి గాటు(4)
26.
తిరస్కారము, బెదిరించుట (2)
27.
మొసలి కంటిలో లేశము (3)
29. సెంటరాఫ్ గ్రావిటీ (5)
30.
కొస చిరిగిన వస్త్రం (3)
32.
సంపూర్ణ కళలు గల చంద్రునితో కూడిన పున్నమ,
ఆగమనము (2)
33.
కొత్తపాళీ 99 లో వ్రాసిన ప్రసిద్ధమైన కథ
(3)
35. రాజకీరములు (5)
36.
కుత్సితము (3)
నిలువు:
2. మొదటి రెండు నెలలలో
కన్పించు సస్య విశేషము (2)
3. లేని కారణములలో
సంహారమును వెదుకుము (5)
5. వీక్షణం (4)
6. ఈటె (3)
8. మునసబు విడిచెడి
నిట్టూర్పు (2)
9. అబ్బురపు ఎడారి (ప్ర)దేశం (3)
10. సాహితీ - యానం
బ్లాగరు (5)
12. దురద (2)
14. ఒక రుచి (3)
16. గిలిగింత (5)
19. అటూఇటూ అయిన అటమటము
(3)
20. అంటుకోను ___
లేదుకాని మీసాలకు సంపెంగ నూనె అని సామెత (3)
21. దూబకుంట నారాయణకవి
అనువదించిన గ్రంథము (5)
23. ఎటుచూచినా గొప్పతనమే
(3)
25. నాగవల్లి (5)
26. నాగరికతలో గడ్డి
(3)
27. జూదగాండ్రు (4)
28. వీరేశలింగం పంతులుగారి ఇంటిపేరులో బిడ్డ (2)
29. వడబోయు గాజు పనిముట్టు (3)
31.
కూసెదను(?) అంటున్న కూతురు (2)
34. కిరీటిలో బురద మెచ్చే జంతువు (2)
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
1, డిసెంబర్ 2011, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)