...
31, జనవరి 2010, ఆదివారం
తెలుగు కథానికా శతజయంతి ముగింపు ఉత్సవాలు!
గత ఏడాది ఫిబ్రవరి 6,7 తేదీలలో విజయనగరంలో గురజాడ అప్పారావు గారు నివసించిన గృహంలో అట్టహాసంగా ప్రారంభమైన తెలుగు కథానికా శతజయంతి ఉత్సవాలు అన్ని జిల్లాల వారీగానూ, ప్రాంతాలవారీగానూ సదస్సులు,చర్చా వేదికలు నిర్వహించుకుని ఈ రోజు ఆ ఉత్సవాల ముగింపు సమావేశం హైదరాబాద్ లోని ఆంధ్ర సారస్వత పరిషత్‌లో ఘనంగా జరిగింది. డాక్టర్ వేదగిరి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకూ ఈ సమావేశాలు జరిగాయి. ఈ సదస్సుల్లో కథానికకు వందేళ్ళు( 23 జిల్లాల కథానిక తీరుతెన్నుల వ్యాసాల సంపుటం), వియోగి, రాచపూటి రమేష్, ఎ.వి.యంల సంపాదకత్వంలో వచ్చిన మినీ కథా సౌరభం, కొలకలూరి ఇనాక్ దళిత కథానికలు, యర్రంశెట్టి శాయి హాస్య కథానికలు, పి.వి.ఆర్ శివకుమార్ కథానికలు మొదలైన పుస్తకాలు ఆవిష్కరింప బడ్డాయి. కథానికా పరిణామ వికాసాలు, కథానిక - నూత్న దృక్పథాలు, కథానికా సంపుటాలు, సంకలనాల ప్రచురణ - విక్రయ సమస్యలు, కథానిక- భవిష్యద్దర్శనం మొదలైన విషయాలపై కూలంకషంగా చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో సర్వశ్రీ మునిపల్లె రాజు, కొలకలూరి ఇనాక్, పోరంకి దక్షిణామూర్తి, బి.ఎన్.స్వామి, వీరాజీ, విహారి, శిరంశెట్టి కాంతారావు, బి.ఎస్.రాములు, కాలువ మల్లయ్య, రావూరి భరద్వాజ, పోతుకూచి సాంబశివరావు, తుమ్మల రామకృష్ణ, వాసా ప్రభావతి, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, పోరంకి దక్షిణామూర్తి, అబ్బూరి చాయాదేవి, ఆడెపు లక్ష్మీపతి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి మొదలైన ప్రముఖ కథారచయితలు అనేకమంది హాజరైనారు. ఈ సమావేశాలలో నా కథాజగత్ విషయం ప్రస్తావింప బడడమే కాకుండా సమావేశాల చివర్లో జరిగిన వందమందికి సత్కారంలో నన్నుకూడా శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్లు:
మురళీ,
నా దృష్టిలో ఇది నీ శ్రమకు చిన్న గుర్తింపు మాత్రమే. ధన్యవాదాలు.
సంతోషమండీ
కామెంట్‌ను పోస్ట్ చేయండి