...

...

3, ఏప్రిల్ 2010, శనివారం

క్రాస్‌వర్డ్ పజిలు సాల్వుము - 3


ఆధారాలు:

అడ్డం: 1. బద్దం భాస్కర రెడ్డి నేకెడ్ పొయెట్టా?
3.కొయ్యగుర్రం హృషీకేశ్వర రావు.
5.దాశరథి రంగాచార్య ఇలా సుప్రసిద్ధులు.
7.కవి ముఖములో దాగియున్న ప్రతికూలత.
9.శత్రువు  'ప్రతి అవస్థ అత'నితో.
10.తృణసూనము అనుకోవచ్చా?!
11.జనాంతికముగా ముడ్డి అగుపించిందా? 
14.ఇది నరం మీద పుండు అని సామెత.
15.ఐతా చంద్రయ్య ఈ బిరుదును కలిగిఉన్నాడు.
16.పుష్పాలు - ప్రేమికులు - పశువులు అంటూ పలవరించిన ఈ కథకుడు ఋషి గ్రామపు ఱేడు!  

నిలువు: 1.మన రాష్ట్ర అధికార క్రీడ.
2.అగ్ని హోత్రము.
4.హిందు సాంప్రదాయ ఆచార సందేహ నివృత్తి గ్రంధము
5. తెలుగు లెంక తుమ్మలవారి మరొక బిరుదు
6. బ్రహ్మ కడిగిన పాదము  కీర్తనలో ఇది తిరమని చూపిన - పరమ పాదము నీ పాదము ... అని అంటున్నాడు అన్నమయ్య.
7. కవిత తిన్నది కన్నది లేదు కనుకనే వ్యాప్తి చెందింది.
8. పక్షి, వాయువు, బాణము.
9. గుమ్మడి విఠల్ ఇలా ప్రసిద్ధుడు.
12.భారతాన్ని తెనుగించినది..
13.అయిదు నిలువు ఆయనదే మరో బిరుదం. 

4 కామెంట్‌లు:

చదువరి చెప్పారు...

అడ్డం:
1: చెరబండరాజు
3 నగ్నముని
5 (అభినవ వ్యాసుడు)
7
9
10 గరికపూవు
11
14 నడమంత్రపుసిరి
15
16 మునిపల్లె రాజు

నిలువు:
1 చెడుగుడు
2
4 నిర్ణయ సింధువు
5 అభినవ తిక్కన
6 తిరువేంకటగిరి
7
8
9
12 కవిత్రయము
13 కవిరాజు

చదువరి చెప్పారు...

అతడు గద్దరని తెలుసు. కానీ ఆరక్షరాలుందే!?

చదువరి చెప్పారు...

అడ్డం:
1: చెరబండరాజు
3 నగ్నముని
5 (అభినవ వ్యాసుడు)
7 విముఖ
9
10 గరికపూవు
11
14 నడమంత్రపుసిరి
15
16 మునిపల్లె రాజు

నిలువు:
1 చెడుగుడు
2
4 నిర్ణయ సింధువు
5 అభినవ తిక్కన
6 తిరువేంకటగిరి
7 ఖగము
8
9
12 కవిత్రయము
13 కవిరాజు

mmkodihalli చెప్పారు...

చదువరి గారూ అతడెవరో మీకు తెలిసిపోయింది. అతడిని ఏమని పిలుస్తారో కొంచెం ఆలోచించండి. అలాగే అయిదు అడ్డం మొదటి చివరి అక్షరాలు తెలిసిపోయాయి కాబట్టి ఆ దిశగా మీ బుఱ్ఱకు పని పెట్టండి :)