...

...

20, ఏప్రిల్ 2010, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 4



ఆధారాలు :

అడ్డం: 
1.ఏ పత్రికకైనా ఇది అవసరము. లేకుంటే పాఠకులకు కొంచెం యిబ్బంది.
3.పుత్తడిబొమ్మ సృష్టికర్త చివర్లో తడబడ్డాడు.
5.లవకుశులు మునికుమారులు కారు.
7.సమృద్ధి palindrome
9.ఎట్నుంచి చూసినా రామలింగడు రామలింగడే.
10.ద్వేషాలు + ద్వేషాలు ద్విరుక్తటకారమే.
11.'వెల'కల భూమి.
14.అట్నుంచి చదివినా అంతు చిక్కనిది ఈ హోమ్‌మినిస్టర్'స్ సీక్రెట్!
15.ఈ మధ్య అందరి నోళ్లలో నానుతున్న(ముఖ్యంగా రా.నా.లు జపిస్తున్న) పదం తిరగబడింది.
16.కింగ్‌ఫిషర్ టిట్టిభము.

నిలువు:
1.కిన్నెరసాని సృజనకారుడు.
2.వివేకానంద రాక్ మెమోరియల్ ఇక్కడ ఉంది.
4.భారతదేశంలో ప్రాచుర్యం పొందిన బుద్ధుని పూర్వ జన్మల గురించిన జానపద కథల సమాహారం.
5.నెలవంక తొంగి చూసిన విఠలాచార్య సినిమా. 1971నాటిది.
6.తలక్రిందలైన కీరవాణి ఆలాపములా? (పునరుక్తి దోషము శమియించుగాక!)
7.నానావిధమైన ఆంధ్రజ్యోతి సాహిత్యం పేజి.
8.పణ్యశాల
9.భరణీ వారి చిత్రరాజము. అక్కినేని,భానుమతుల నటసౌరభము. 1954 కాలం నాటిది.
12.పలురకాల ఏడు నిలువే!
13.మధురవాణిని తెగ నవ్వించిన జీవి.

11 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

1. నిలువు: విశ్వనాధ
1. అడ్డం: విషయసూచిక
2. నిలువు: కన్యాకుమారి

Malakpet Rowdy చెప్పారు...

14 అడ్డం: చిదంబర రహస్యం
7 అడ్డం: విరివి

Malakpet Rowdy చెప్పారు...

7 నిలువు: వివిధ
11 అడ్డం: ధరణి

ఊకదంపుడు చెప్పారు...

నిలువు
1. విశ్వనాధ
5.గండికోటరహస్యం
7.వివిధ
6. లుకులుపకలుచి.
12. రకరకాలు.
9.విప్రనారాయణ


అద్దం:
9. వికటకవి
11.ధరణి
15.ణరస్తవి
14.స్యం హరరబదంచి

Malakpet Rowdy చెప్పారు...

5 అడ్డం: గంధర్వ కుమారులు

Malakpet Rowdy చెప్పారు...

3 అడ్డం: గురడజా
4 నిలువు: జాతక కధలు

కామేశ్వరరావు చెప్పారు...

5 అడ్డం - ముని కుమారులు కాదు. రా"ముని"కుమారులు
5 నిలువు - రాజకోటరహస్యం
15 అడ్డం - అందరి నోళ్ళలోనూ నానుతోంది కాబట్టి, విస్తరణ అవ్వదేమో. తెలంగాణ అవ్వాలి.
16 అడ్డం - లకుముకిపిట్ట
13 నిలువు - లొట్టిపిట్ట
10 అడ్డం - పగపగలు అవ్వాలి. కాని అది ద్విరుక్త"ట"కారం ఎలా అయ్యిందో తెలియడం లేదు. పటపటలు అంటే ద్వేషాలనే అర్థం రాదనుకుంటాను.

mmkodihalli చెప్పారు...

మలక్‌పేట రౌడీ, ఊకదంపుడు, భైరవభట్ల కామేశ్వరరావు గార్లకు అభినందనలు. ధన్యవాదాలు. 10 అడ్డం, 8 నిలువు మినహా మిగతావన్నీ పూర్తయ్యాయి. కామేశ్వరరావుగారూ పగపగలు, పటపటలు రెండూ కావండి. వేచి చూద్దాము. ఈ రోజు ఎవరైనా ఆ రెండూ పంపుతారేమో. లేకుంటే రేపు పొద్దునే సమాధానాలు ఇచ్చేస్తాను.

కామేశ్వరరావు చెప్పారు...

8 నిలువు విపణి ముందే తెలిసింది.
10 అడ్డం - పగలు పగలు అని రాగానే గుర్తుకు రాలేదేమిటో! :-) ఇప్పుడర్థమయింది. పట్టపగలు. ఇది ద్విరుక్తటకార సంధా ఆమ్రేడిత సంధా?

mmkodihalli చెప్పారు...

భైరవభట్ల కామేశ్వరరావుగారూ నిజమేనండోయ్! మీరు చెప్పిన తర్వాత వికీపీడియాలో సంధి సూత్రాలు చూశాను. కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు అని వుంది. మీరు చెప్పినట్లు ఆమ్రేడిత సంధి అవుతుందేమో. కానీ పజిల్‌కు సంబంధించినంత వరకు ఇది ద్విరుక్త'ట'కారమే :-) ఈసారికి ఇలా కానిచ్చేద్దాం.

Unknown చెప్పారు...

కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ...,



ఆధారాలు :

అడ్డం: 
1.ఏ పత్రికకైనా ఇది అవసరము. లేకుంటే పాఠకులకు కొంచెం యిబ్బంది.
3.పుత్తడిబొమ్మ సృష్టికర్త చివర్లో తడబడ్డాడు.
5.లవకుశులు మునికుమారులు కారు.
7.సమృద్ధి palindrome
9.ఎట్నుంచ_____________________మంచి టపా అందించారు.