...

...

8, ఏప్రిల్ 2010, గురువారం

నివాళి

                                          
                                        

 భమిడిపాటి రామగోపాలం(భరాగో) మరణ వార్త పేపర్లో చదివి మనసు విచారంలో మునిగిపోయింది. వారితో నాకు ముఖతః పరిచయం లేకపోయినా సుమారు ఏడాదినుండి వారితో అనేకసార్లు టెలిఫోన్‌లో  సంభాషించే అదృష్టం కలిగింది. వారు రచయితగా కంటే ఒక మిత్రునిగానే ఎక్కువ పరిచయస్తులు. వయసులో     నాకన్నా పెద్దవారైనా చాలా కలుపుగోలుగా మాట్లాడేవారు. నా పుస్తకం గ్రంథావలోకనమ్ చదివి ప్రశంసించడమే కాక ఆ పుస్తకాన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజస్, మైసూరు వారి గ్రాంటు కొరకు పట్టుబట్టి అప్లై చేయించారు. వారి ప్రోత్సాహం వల్లే ఆ గ్రంథానికి గ్రాంట్ లభించింది. వారి కథను నా కథాజగత్ వెబ్‌సైట్‌లో ప్రచురించడానికి అడగగానే ఎంతో సంతోషంతో అంగీకరించారు. ఎంతో అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ఎంతో ఉత్సాహంగా గలగలా మాట్లాడటం నాకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించేది. వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుణ్ణి వేడుకొంటున్నాను.    

1 కామెంట్‌:

Rajendra Devarapalli చెప్పారు...

భరాగో- భమిడిపాటి రామగోపాలం అంతిమయాత్ర చిత్రాలు ఇక్కడ చూడగలరు
http://wp.me/pPLDz-Up