...

...

9, ఏప్రిల్ 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 3 సమాధానాలు



సమాధానాలు:

అడ్డం: 1. బద్దం భాస్కర రెడ్డి నేకెడ్ పొయెట్టా?   - చెరబండరాజు
3.కొయ్యగుర్రం హృషీకేశ్వర రావు.                        - నగ్నముని
5.దాశరథి రంగాచార్య ఇలా సుప్రసిద్ధులు.             - అక్షరవాచస్పతి
7.కవి ముఖములో దాగియున్న ప్రతికూలత.        - విముఖ
9.శత్రువు  'ప్రతి అవస్థ అత'నితో.                          - ప్రత్యవస్థాత
10.తృణసూనము అనుకోవచ్చా?!                       - గఱికపూవు
11.జనాంతికముగా ముడ్డి అగుపించిందా?            - తికము
14.ఇది నరం మీద పుండు అని సామెత.               - నడమంత్రపు సిరి
15.ఐతా చంద్రయ్య ఈ బిరుదును కలిగిఉన్నాడు.   - కథాశిల్పి
16.పుష్పాలు - ప్రేమికులు - పశువులు అంటూ పలవరించిన ఈ కథకుడు ఋషి గ్రామపు ఱేడు!   - మునిపల్లె రాజు
  

నిలువు: 1.మన రాష్ట్ర అధికార క్రీడ.   -  చెడుగుడు
2.అగ్ని హోత్రము.             - జుహువానము
4.హిందు సాంప్రదాయ ఆచార సందేహ నివృత్తి గ్రంధము - నిర్ణయ సింధువు
5. తెలుగు లెంక తుమ్మలవారి మరొక బిరుదు - అభినవ తిక్కన
6. బ్రహ్మ కడిగిన పాదము  కీర్తనలో ఇది తిరమని చూపిన - పరమ పాదము నీ పాదము ... అని అంటున్నాడు అన్నమయ్య.    - తిరువేంకటగిరి
7. కవిత తిన్నది కన్నది లేదు కనుకనే వ్యాప్తి చెందింది. - వితతి
8. పక్షి, వాయువు, బాణము.  - ఖగము
9. గుమ్మడి విఠల్ ఇలా ప్రసిద్ధుడు.   - ప్రజాయుద్ధ నౌక
12.భారతాన్ని తెనుగించినది.          - కవిత్రయము
13.అయిదు నిలువు ఆయనదే మరో బిరుదం.    - కవిరాజు



ఈ పజిల్‌ను పూరించడానికి ప్రయత్నించిన చదువరి గారికి అభినందనలు. 


కామెంట్‌లు లేవు: