"చలం కథలోని పాత్రలన్నీ సంఘాన్ని పట్టించుకోకుండా స్వేచ్ఛగా విహరిస్తాయి. సంఘం, స్త్రీ పట్ల చూపిన వివక్షను ప్రశ్నిస్తూ చలం సాహిత్యాన్ని సృష్టించారు. అటువంటి చలం స్పృశించని కథాంశాన్ని తీసుకుని డా.జయధీర్ తిరుమలరావుగారు 'చలం చెప్పని కథ' రాశారు. చలం ఆలోచనల్ని, తాత్వికతను కథలో పొందుపరచడం వల్ల కథకు తాత్విక వాతావరణం అబ్బింది. ప్రేమ భావన, ఈస్థటిక్స్ కథలో సింహ భాగాన్ని ఆక్రమించాయి. చలం, చైతన్య (కథలోని పాత్రలు) ఇద్దరు కూడా ప్రేమను పొందలేక పోవడమనేది విషాద వాస్తవం. అదొక అనివార్యత. ఈ విషయాన్ని కథ చివరలో చెప్పడం శిల్పరీత్యా కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. సూటిగా సాగే కథా సంవిధానం పాఠకుల్ని విడవనీయకుండా కథను చదివిస్తుంది. ఈ కథలోని పాత్రలు సంఘం పెట్టిన కట్టుబాట్లలో కాదనలేక గడపడం గమనార్హం." -డా.బి.వి.ఎన్.స్వామి
కథాజగత్‌లో ప్రకటించిన డాక్టర్. జయధీర్ తిరుమలరావు గారి చలం చెప్పని కథ పై డా.బి.వి.ఎన్.స్వామిగారి విశ్లేషణ పైన చదవారు కదా. కథ చదివి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి