...

...

18, సెప్టెంబర్ 2010, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 28


ఆధారాలు: 
అడ్డం: 
1. Human Computer అని ప్రసిద్ధికెక్కిన గణిత శాస్త్ర మాయా జాలము.
3. కాపరి శ్రమపడితే ఇండస్ట్రీ వస్తుందా?
5. వినమ్రపు మహజరు వినవిన సమయము లేదా?
7. హిమికలోనున్న తుహిరము.
9. జగపతిబాబు-ప్రియమణి-మదన్-కీరవాణిల కలయికలో వచ్చిన 2009 మూవీ!
10. లడ్లు విస్తృతరూపంలో!
11. సేద్యముచేయుటకై సహాయముగా నియ్యఁబడు సొమ్ము అని బహుజనపల్లి వారి శబ్దరత్నాకరము చెప్పుచున్నది.
14. పండబారిన వెన్నెల రాత్రిలో, చేరదేశపు చెలులు దగ్గర ఉండగా, చక్కటి తెలుగు పాట పాడుతూ, సింధు నదిని పడవ నడుపుదాం అని పాడిన తమిళకవి.
15. ప్రభాకరుడే!
16. సర్వసంగ పరిత్యాగి అనగా సర్వమూ ________ __.
నిలువు:
1. అశరీరవాణి పలికిన విలుకాడు.
2. విషయమును గ్రహించువాడా?
4. బి.నరసింగరావు డైరెక్షన్‌లో వచ్చిన ఆర్ట్ ఫిలిం. 1991నాటిది.
5.  ఛత్రపతి శివాజీకి గురువు!
6. ఈమధ్యే మనం జరుపుకున్నపండుగ!
7. శలభము.
8. కపిలవర్ణము కకావికలైంది.
9. ఆకాశవాణి + దూరదర్శన్ = ?
12. మెర్సీ కిల్లింగ్‌ను ఇలా తెలుగీకరించవచ్చా?
13.  రావాలి రావాలి రమ్మంటె రావాలి రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి - ఘంటశాల, జమునారాణిల డ్యూయెట్టు ఈ సినిమాలోనిదే!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి