...

...

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వివాదంలో బుడ్డా వెంగళరెడ్డి!

అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ పక్షాన మేము ప్రకటించిన బుడ్డావెంగళరెడ్డి చారిత్రక నవల వివాదంలో చిక్కుకుంది. తన లిఖిత పూర్వకమైన అనుమతి లేకుండానే ఈ పుస్తకాన్ని మరొకరు ప్రచురించారని రచయిత శ్రీ ఎస్.డి.వి.అజీజ్ ఆరోపిస్తున్నారు. వివరాలు ఈ క్రింది వార్తాంశంలో చూడండి.
ఏదిఏమైనా ఇలా రచయిత అనుమతిగాని (లిఖితమైన అనుమతి లేదని రచయిత అంటున్నారు అంటే మౌఖికమైన అంగీకారం ఉందేమో!) మొదటి ప్రచురణకర్తలైన మాకు తగిన సమాచారం గాని లేకుండా ప్రచురించడం ఎంత వరకు సమంజసం? అన్ని హక్కులు రచయితవే అయినప్పటికినీ మొదటి ముద్రణ ప్రతులు పూర్తిగా అమ్ముడు పోకముందే రెండవ ముద్రణకు వేరే ప్రచురణ కర్తకు అనుమతి ఇవ్వడాన్ని కూడా (మౌఖికంగా ఇచ్చారనే మేం భావిస్తున్నాం) మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇటువంటి చర్యలు సాహిత్య వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. దీనిపై సాహిత్యాభిమానుల నుండి స్పందనలను, సూచనలను తురుపుముక్క ఆహ్వానిస్తున్నది.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి