...

...

1, సెప్టెంబర్ 2010, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 26

బ్లాగ్మిత్రులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!








ఆధారాలు: 
అడ్డం: 
1. హాస్యదర్బార్ బ్లాగరుదే ఈ బ్లాగు. అక్షరాభ్యాసానికి ఇవి అవసరమేనా?
3. కోవెల సుప్రసన్నాచార్య రచించిన కావ్యము. నల్లవావిలి. కుడినుంచి ఎడమకు.
5. నిండినది!
7. ప్రతివాద భయంకర శ్రీనివాస్‌గారిలో దాగున్న టాలెంట్!
9. చిన్నయసూరి గారి పంచతంత్రంలోని కపట శిష్యుడు.
10. రా అని పిలవవోయ్!
11. ప్రామీత్సము!
14. విజయచందర్ కరుణామయుడు దీనికి ఒక చక్కని తిరగబడిన ఉదాహరణ! 
15. శ్రీదేవి పాడిన పాట ఈ సినిమాలో వుంది.
16. నిరుపయోగము.
నిలువు:
1. యండమూరి వ్రాసిన ఈ నవలకు దువ్వూరి రామిరెడ్డిగారి పానశాల పేరడీ ఏమాత్రం కాదు సుమా!!
2. పంచ కట్టిన పచ్చీసు!
4. రచన పత్రిక సంపాదకులు సాక్షాత్తు విష్ణుమూర్తియే!
5.  నక్షత్రములలో ఇది 20వ నక్షత్రము. ఇది శుక్రగ్రహ నక్షత్రమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
6. థియోసాఫికల్ సొసైటీ వారి తెలుగు పత్రిక 1910లో ప్రారంభమయ్యింది!
7. ఖండిత, పక్షి సంకలనాల కథారచయిత్రి!
8. విడిపోయిన భార్య పోషణ కోసం భర్త చెల్లించవలసిది అడ్డము 7,11లలో దాగింది!
9. ఈ మధ్య రాజకీయాల్లో చేస్తున్న బ్లాక్‌మెయిల్. అర్థంలేని దీక్ష!
12. జంట నగరాలలో నాటక కళా ప్రోత్సాహానికి నడుం బిగించిన ప్రముఖ రంగస్థల నాటక సంస్థ. మధ్యలో పూర్ణానుస్వారాన్ని కోల్పోయింది.
13.  అడ్డము 16లోని దూరము.


1 కామెంట్‌:

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము:
1)పలకబలపం,3)కలిఫాశే,5)పూర్ణీభవించినది,7)ప్రతిభ,9)నిగూఢపతి,10)రమ్మనవోయి,11)మరణం,14).....15)క్షణంక్షణం,16)నిష్ప్రయోజనము.
నిలువు:
1)పర్ణశాల,2)పంచవింశతి,4)శేషతల్పశాయి,5)పూర్వాషాడనక్షత్రం,6).....7)ప్రతిమ,8)భరణం,9)నిరాహారదీక్ష 12)....13)యోజనము.