...

...

5, సెప్టెంబర్ 2010, ఆదివారం

దేవరాజు మహారాజుగారి కథ!

డాక్టర్ దేవరాజు మహారాజు గారి కథ సోదా కథాజగత్‌ లో ప్రకటించాము. ఈ కథపై పాలపిట్ట మాసపత్రిక ఆగస్టు నెల సంచికలో వచ్చిన సగ్గురాజయ్యగారి అభిప్రాయం ఇక్కడ చదవండి. 

ఆనందింపజేసిన 'సోదా '
పోలీసు అంటే రాజ ప్రతినిధి. రాజుగారి చేత ఏర్పడిన చట్టాలను రక్షించేవాడు. అన్యాయం జరిగినప్పుడు ఆపద్బాంధవుడిలా ఆదుకునేవాడు. కాని ఈ కాలంలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయని చెప్పే కథ సోదా . నా లండన్‌కోటు కథల పుస్తకంలో 'దొంగ ఎవరు?' అనే నాటిక ఉంది. అది అపరాధ పరిశోధక ఇతివృత్తం. దానిలో దొంగను పట్టుకోడానికి పోలీసులు చేసే ప్రయత్నాలలో భాగంగా వాడిన తెలంగాణ పోలిసు భాష అతి స్వల్పము. డా.దేవరాజు మహారాజు తన కథ 'సోదా 'లో వాడిన భాషను చదివి, అమితానందభరితుడనైయ్యాను. ఎంత చక్కగా సందర్భాలను వివరిస్తూ రాశారో. వారికి భాష మీద, భావం మీద ఎంత అవగాహన ఉందో సోదా కథ చదివిన వారికి అవగతమౌతుంది. దేవరాజు మహారాజు కథలు అన్నీ బావున్నాయి. డా.దేవరాజు మహారాజుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. జంతుశాస్త్ర నిపుణులు. మొక్కలలో ఉండే నిమటోడ్ పరాన్న జీవులపై పరిశోధన చేశారు. వీరు చేసిన పరిశోధన వల్ల వ్యవసాయ రంగం రైతుల జీవనంలో వికాసం కలిగింది. సమాజంలో శాస్త్రీయ అవగాహనను పెంచడానికి సరళ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు ప్రకటిచారు. రచయితగా మహారాజుగారి పరిధి విస్తృతమైనది. మానవ నైజాన్ని సుతిమెత్తగా ఎత్తి చూపిన వ్యంగ్య రచనలు మనిషి 'కత'లూ ఉన్నాయి.
- సగ్గు రాజయ్య, సికింద్రాబాద్.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి