...

...

10, అక్టోబర్ 2010, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 30



ఆధారాలు: 
అడ్డం: 
1. ఊరగాయకు ఉపయోగించే ఒకానొక కాయ!
3.నాగరాజు, నాగసుబ్రహ్మణ్యంలు అన్నదమ్ములుగా నటించిన సినిమా!
5. హైదరాబాదు నగర శివారులో ఉన్న లేళ్ల పార్కు!
7. చదువుము ఇక్కడ సైన్యం దాగివుంది!
9. ప్రయోజనము, పరమార్థము!
10. సుపుత్రుడు మన్మథుడే!
11. చేతిగుడ్డ కాస్త నాజూగ్గా!
14.విద్యలు ముదిరితే వేదాలవుతాయా?!
15. టిక్కు టిక్కు బండి! ____ బండి! సాగిపోవు బండి! హాల్ట్ లేని బండి! అదేమిటి? - గడియారమే కదా?
16. నిలువు 4 లోని వాడే - శుభ్రకరుడు కదా!
నిలువు:
1. మేషము!
2. మధుకరము!
4. అడ్డం16 లోని వాడే - వంద కిరణాలు కలిగినవాడట!
5.  పుల్లంటుఱాయి!
6. వరలక్ష్మీదేవికి ఇల వరాలిచ్చుజబ్బులు కలవా? (పాపము శమియించు గాక)
7. నెమలికి పించము రువ్విన జిడ్డు తగులుతుందా?
8. అల్లకల్లోలమైన గోమాతలు!
9. ఎకెసెక్కెపు మాటలు!
12. రామాయణ అరణ్యకాండలో ఒక ఘట్టము.
13. అగస్త్యుడు -  కుంభసంభవుడు కదా! 

4 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం
1. ఉసిరిక కాయ, 7. చమువు, 9. ఉపయోగము, 10. ఆత్మజన్ముడు/ఆత్మభువుడు, 11. రుమాలు, 14. ముదురు చదువులు, 15. టక్కులాడు(?)
నిలువు
1. ఉరణము/ఉరభ్రము, 2. యాయవరము, 5. హరిహయోపలము, 7. చమురు, 8. వు ఆలు, 12. మారీచవధ (అనుకుంటే అది అరణ్యకాండలో జరిగింది), 13. ఘటజుడు.

mmkodihalli చెప్పారు...

నిజమేనండి శంకరయ్యగారూ. మారీచ వధ జరిగినది అరణ్యకాండలో. తప్పును సరిచేసుకున్నాను. ఇక మీ సమాధానంలో అడ్డం 1,15 నిలువు 1 మాత్రం సరిపోవడం లేదండి.నిలువు 2 కూడా ఒక సారి సరిచూసుకోండి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము:
1)అమలకకాయ,3)లవకుశ,5)హమరవీరిణహ(మహవీరహరిణ)7)చమువు,9)ఉపయోగము,10)ఆత్మజన్ముడు,11)రుమాలు,14)ముదురుచదువులు,15)టక్కుటక్కు,16)ధవళకరుడు,
నిలువు:
1)అగ్నివాహం,2)యయావీరము,4)శతకిరణుడు,5)హరిహయోఫలము,6)హరింద్రజలుబులు,7)చమురు,8)వుఆలు,9)ఉల్లికుట్టుమాట,12)మారీచవధ,13)ఘటజుడు.

mmkodihalli చెప్పారు...

ఈ పజిల్‌ను పూరించడానికి ప్రయత్నం చేసిన కంది శంకరయ్య, భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లకు అభినందనలు!