...

...

12, అక్టోబర్ 2010, మంగళవారం

కొత్తపాళీ కథ!

సీనియర్ బ్లాగర్  కొత్తపాళీ (ఎస్.నారాయణస్వామి) గారి కథ ఖాండవ వనం కథాజగత్‌లో ప్రకటించాం. చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

2 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

బాగుంది, చదువుతున్నంతసేపు ఎందుకో ఏడుతరాలు (Roots) గుర్తొచ్చింది.

"ఏదో స్క్వాడు గూడెం దిక్కొచ్చిందని ఆల్లకి ఇంపరమేసనంట - ఈన్ని తీస్కెల్లి బొక్క లిరగ బొడిసిన్రు. చెంచోడంటె అందరికి లోకువే గద. ఐన మమ్మల్ని ఇరగ బొడవల్నంటె ఆల్లకి కారణం గూడెందుకు?" .....ఇది చదవగానే CWG పేరుతో అమాయకులని చిత్రహింసలు పెట్టే డిల్లీ పోలీసులు గుర్తొచ్చారు. CWG వలన్ హెవీ వెహికిల్స్ రాత్రి 11.00 దాటితేగానీ రోడ్ పై వెళ్ళకూదదు, రాత్రి 11.00 నుండి తెల్లవారి 4.00 వరకూ వాళ్లకి అనుమతి ఉంది. ఆ మధ్య సమయంలో వెళ్ళినా కూడా ఆ ట్రక్కు డ్రైవర్లని పోలీసులు చితకబాదడం చూసాకా చాలా బాధనిపించింది. పోలీసుల బలం అంతా ఆ అమాయకపు ట్రక్కు డ్రైవర్లమీదే, పాపం.

కథా మంజరి చెప్పారు...

నిన్ననే కథా జగత్ లో మీ కథ చదివాను. చాలా నచ్చింది నాకు. అనేక కారణాల వలన తరాలుగా అడవి అంటుకుని మండి పోతూనే ఉంది. గిరి పుత్రులు అను నిత్యం భయాల మాటున, సందేహాల చాటున, అపనమ్మకాల సరసన మసిబారిన బతుకులు బ్రతుకుతున్నారు.భిన్న శక్తుల మధ్య, శత్రుత్వాల మధ్య నలిగి పోతున్నారు. అలాంటి జీవితాలలో రవ్వంత వెలుగు నింప గలగడం కన్నా మేల్తరమయిన పని మరొకటి ఉండ బోదు.
కథ ముగింపు చాలా బాగుంది. ఏవో తటపటాయింపులతో, మరేదో నిర్లిప్తతో, వెనుకడుగు వేసే వారికి సైతం ఆ ఛిద్ర జీవితాలలో వెలుగులు నింపే కృషిలో భాగస్వాములను చేస్తూ, వారిని కూడా సంసిద్ధులను చేస్తూ, దిశానిర్దేశం చేసినందుకు, కథ ముగింపు నాకు నచ్చింది. కథనం కడదాకా ఎక్కడా సడలి పోకుండా గాఢంగా సాగింది.. అభినందనలు.