శశిధర్ పింగళిగారి కథ మార్పు కథాజగత్‌లో చదవండి.
...

31, జులై 2011, ఆదివారం
30, జులై 2011, శనివారం
అభినందన!
గురజాడ శోభాపేరిందేవి గారి డైరెక్టు కథ (అంటే ఇదివరకు ఎక్కడా ప్రచురింపబడని కథ) అభినందన కథాజగత్‌లో చదివి ఆనందించండి. మీ అభిప్రాయం చెప్పండి.
Labels:
katha jagat
29, జులై 2011, శుక్రవారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము -46
ఆధారాలు :
అడ్డం: 1. పసిపాపలా నిదురపో
బంగారు తల్లిగా అంటూ మనల్ని జోకొడుతున్న ఘంటశాల దానికోసం ఇది చేస్తానంటున్నాడు. (3,3,3)
6. దేనికోసం చిన్నోడా
వెదుకుతున్నావ్? బ్యాగుకోసమేనా? (2)
7. మాతృదేశం సరి అక్షరాలు
తీస్తే మీదేం కాదు (2)
9. ఇగురు (2)
10. పావగడలో
లభ్యమయ్యే తిండి (2)
12. సినిమాకో, నాటకానికో మార్గ నిర్దేశం చేసేవాడు (4)
13.
'లోపాయకారి' వ్యవహారం కాబట్టే మధ్య
అక్షరం మాయమై రివర్సయ్యింది. (4)
14. కృష్ణసారము అంటే పిలక సరిచేస్తావేం? (3)
16. అడ్డం 10 ఉన్న హిమాలయ పర్వతం (5)
17.
మంత్రనటి
తరువాయి చిత్రం ఆమె పేరుతో కలగలిసి చెల్లాచెదురయ్యింది (5)
18. శివుడే లోకేశ్వరుడు కదా? (3)
20.
హనుమంతుడే
(4)
23.
బిడియము
(4)
25.
వితంతువు
చివరి అక్షరం లుప్తం. (2)
26. రాష్ట్ర గనుల శాఖ మంత్రి ఇంటిపేరు (2)
27.
మొద్దు, స్థాణువు అపసవ్య దిశలో (2)
29.
అడ్డం
9కి వ్యతిరేకం. గ్రామం
(2)
30.
తిరుమల
రామచంద్రగారి స్వీయ చారిత్రాత్మక కథనం (2, 2, 3, 2)
నిలువు :
1. నీరు నిలవ ఉంటే పట్టేది అడపా చిరంజీవికి తెలుసు (2)
2. తర్కశాస్త్రము తెలిసినవాఁడు.
(4)
3. ఎన్.టీ.ఆర్ నటించిన 1953నాటి చిత్రం తలక్రిందలుగా. వెఱ్ఱి
వెంగళప్ప, తిక్కశంకరయ్య లాంటిదే
(5)
4. తుమ్మల శిరీష్ కుమార్‌గారి
బ్లాగు. (4)
5. ఆల్ఫా బీటాల సరసన
ఉండేది. (2)
6. ఎడిటోరియల్ బోర్డు
మెంబరు (4, 2, 3)
8. టి.కృష్ణ దర్శకత్వంలో
వచ్చిన సినిమాల్లో ఒకటి (3, 3, 3)
9. సిరా (2)
11. తొడిమ తలక్రిందలుగా. (2)
14. వికల లో ఉన్నవి (3)
15. నవాబ్ పటౌడి భార్యామణి శీర్షాసనం వేసింది (3)
19. ఇప్పుడు నడిచే కల్పము పేరు _ _ _ _ _ కల్పం. (5)
21. పైరవిలో ప్రభాకరుడు (2)
22. అర్జునుడి పేర్లలో ఒకటి కలగాపులగం అయ్యింది. (4)
23. అషామాషీ వంటిదే (4)
24. పన్నగము ఇది పడుతుందని
ఒక అపప్రథ. (2)
28. మద మాత్సర్యాల తోడిది (2)
29. పొట్టు (2)
28, జులై 2011, గురువారం
25, జులై 2011, సోమవారం
24, జులై 2011, ఆదివారం
ఆంధ్ర నాటక మణి మాణిక్యాలు ధర్మవరం – కోలాచలం
సాహిత్య రంగంలో గాని,
సాంస్కృతిక రంగంలో గాని ఆ మాటకు వస్తే మరే రంగంలో గాని సమ
ఉజ్జీలయిన వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు
కనిపిస్తాయి. ఆయా రంగాలకు విశేషమైన
ప్రాచుర్యం కలుగుతుంది. ఈ విషయం నిరూపించే తార్కాణాలు మనకు చరిత్రలో ఎన్నో
కనిపిస్తాయి. ఈ వ్యాసంలో అటువంటి ఇద్దరు మహానుభావుల వలన ఆంధ్ర నాటక రంగానికి
లభించిన కీర్తి ప్రతిష్ఠలు మనం గమనించవచ్చు.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1853 - 1912), కోలాచలం శ్రీనివాసరావు(1854 - 1919) వీరిరువురి మధ్య చాలా సారూప్యవిబేధాలు వున్నాయి. ఇరువురూ నాటక రంగంలో ఉద్దండులే. వీరిద్దరూ నాటకాలు
వ్రాసినవారే. ధర్మవరం రామకృష్ణమాచార్యులు తెలుగు కన్నడ ఆంగ్లభాషలలో సుమారు 31 నాటకాలు వ్రాశారు. కోలాచలం వారు కూడా దాదాపు 32కి పైగా నాటకాలు, ప్రహసనాలు రచించారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు పౌరాణిక, చారిత్రక నాటకాలు వ్రాస్తే, కోలాచలం మొదట్లో సాంఘిక నాటకాలు వ్రాసినా తరువాత చారిత్రక పౌరాణిక నాటకాలు
వ్రాశారు. ఇరువురూ దర్శకులు ప్రయోక్తలు కూడా. ఒకరు ఆంధ్రనాటక పితామహులుగా
పేరునొందితే మరొకరు ఆంధ్ర చరిత్ర నాటక పితామహులుగా ప్రసిద్ధి చెందినారు.
ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారు మంచి నటులు. వీరి నాటకములలో ప్రధానపాత్రలను
వీరే పోషించేవారు. వీరు దశరథ, బాహుక, రాజరాజనరేంద్ర, చిరాకారి, అజామిళ పాత్రలు అభినయించటంలో దిట్ట. సంగీతంలో
కూడా వీరికి ప్రవేశం వుంది. పాటలకు పద్యాలకు వీరే రాగాలు నిర్ణయించేవారు.
శ్రావ్యంగా పద్యాలను పాటలను అభినయం చెడకుండా ఆలపించేవారు. మోహన, జంఝాటి, కేదారగౌళ, కమాజు మొదలైన రాగాలంటే వీరికి ప్రీతి.
ఇక కోలాచలం శ్రీనివాసరావుగారు నటించిన దాఖలాలు లేవు. అయితే వీరిరువురి నాటకాల
మూలంగా తెలుగుజాతికి ఒక అద్భుతమైన నటుడు లభ్యమయ్యాడు. అతనే బళ్ళారి రాఘవ.
కోలాచలంవారి రామరాజు (విజయనగరపతనం అని మరోపేరు) నాటకంలో పఠాను, సునందిని నాటకంలో దుష్టబుద్ధి, సుల్తానా చాంద్ బీబీ నాటకంలో ఉస్మాన్ ఖాన్, భారత ధర్మ యుద్ధములో దుర్యోధన, హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రలు బళ్ళారి రాఘవకు ఎనలేని
కీర్తిని తెచ్చిపెట్టాయి. రామకృష్ణమాచార్యులు
వ్రాసిన సారంగధర నాటకంలో నాయకపాత్ర సారంగధరుడు, పాదుకాపట్టాభిషేకంలో దశరథుడు, ప్రమీళార్జునీయంలో
అర్జునుడు, చిత్రనళీయములో నలుడు, ప్రతాపరుద్రీయంలో ప్రతాపరుద్రుడు, విరాటపర్వములో కీచకుడు, సావిత్రి నాటకంలో యముని పాత్ర మొదలైనవి బళ్ళారి రాఘవను ఉత్తమ నటునిగా
నిలబెట్టాయి.
ధర్మవరం రామకృష్ణమాచార్యులవారు సంస్కృత నాటక లక్షణాలను, పార్సీ, ఆంగ్ల నాటక
లక్షణాలను కలిపి కొత్తపద్ధతిలో నాటకాలు వ్రాశారు. సంస్కృత నాటకాలలోని పద్యాలను, ఇంగ్లీషు నాటకాలలోని అంకాలు - రంగాలు, పార్సీ
నాటకాలలోని పాటలు మొదలైన వాటిని మేళవించి తెలుగు నాటక రంగంలో కొత్త ఒరవడిని
తెచ్చారు. తెలుగు నాటకాలలో రాగయుక్తంగా పద్యాలు, పాటలు పాడటం ప్రవేశపెట్టింది ధర్మవరం వారే.
రామకృష్ణమాచార్యుల నాటకాలు ఎక్కువగా విషాదాంతాలే.
కోలాచలం శ్రీనివాసరావుగారు తమ నాటకాలలో దీర్ఘ స్వగతాలు ప్రవేశ పెట్టారు. వీరి
నాటకాలపై షేక్స్పియర్ నాటకాల ప్రభావం వుంది. కోలాచలం వారికి ఎక్కువ పేరు
తెచ్చిపెట్టింది 'ప్రపంచ నాటక చరిత్ర' అనే నాట్య శాస్త్ర గ్రంథం.
ధర్మవరం వారు తమ నాటకాలను ప్రదర్శించటానికి సరసవినోదినీ సభ అనే సంస్థను
నెలకొల్పితే కోలాచలం వారు సుమనోరమ సభను నెలకొల్పారు. ఆ కాలంలో బళ్ళారిలో నాటకాలను ప్రదర్శించటానికి పక్కా
నాటకశాలలు లేవు. శ్రీనివాసరావు గారు ఈ లోటును భర్తీ చేయడానికి 'వాణీవిలాస నాటకశాల'ను నిర్మించి బాలగంగాధర తిలక్ చేత ప్రారంభింపచేశారు. దీనికి పోటీగా ‘రామకృష్ణ విలాస్’ అనే నాటకశాల ప్రారంభించబడింది.
వీరి తదనందరం ఈ నాటకశాలలు ప్రభాత్ సినిమా, స్టార్ సినిమా అనే పేర్లతో సినిమా థియేటర్లుగా రూపాంతరం చెందాయి.
వృత్తిపరంగా కూడా ధర్మవరం కోలాచలం ఇద్దరూ న్యాయవాదులే. వీరిరువురి కార్యస్థానం
బళ్ళారి. వీరి గురించి కల్లూరు అహోబలరావు గారు తమ రాయలసీమ రచయితల చరిత్రలో ఇలా
పేర్కొంటారు. "ఆంధ్ర నాటక పితామహులు, ఆంధ్ర చరితనాటక పితామహులు
వీరిద్దరి వలన యాంధ్రనాటక కళ తన జీవితమును మూడు పూవు లారు కాయలు గావించుకొన్నది. ఈ
కవిద్వయము నాటక కళాభివృద్ధికి పాటు పడుటకు, భాషా సేవ చేయుటకు రంగస్థలమైన
బళ్ళారి పుర మెంతయు ధన్యమైనది."
(సాహితీకిరణం మాసపత్రిక రంగస్థల ప్రత్యేక సంచికలో ప్రచురితం)
23, జులై 2011, శనివారం
'మాట'లయుద్ధం ముగిసిన వేళ
దాట్ల లలిత గారి 'మాట'లయుద్ధం ముగిసిన వేళ కథానిక కథాజగత్‌లో చదవండి.
Labels:
katha jagat
22, జులై 2011, శుక్రవారం
ఒంటరి పక్షి - మబ్బుతునక
నవులూరి వెంకటేశ్వర రావు గారి కథ మిథ్యాబింబాలు కథాజగత్‌లో చదవండి. ఈ కథపై మీ అభిప్రాయం చెప్పండి.
Labels:
katha jagat
19, జులై 2011, మంగళవారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము -45
ఆధారాలు :
అడ్డం: 1. దక్షిణభారతదేశంలో మొట్టమొదటి మూకీ కథా చిత్రం 'కీచకవధ' నిర్మాత (4,5)
6. విరోధము (2)
7. అటునుంచి భారతదేశంలోని
25వ రాష్ట్రం (2)
9. చిత్రలేఖిని (2)
10. చిక్కడు
దొరకడులో ప్రభువు (2)
12. కాటుక కంటినీరు _ _ _ _ పయింబడ నెల ఏడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! (4)
13.
రాజశేఖరరెడ్డి
చనిపోయేరోజు హాజరు కావలసిన కార్యక్రమం (4)
14. శత్రువు V ρ ధి (3)
16. భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి (3, 2)
17.
నెమలి, కేకి (5)
18. పార్వతి నిలువు 15ను
కాస్త నాజూకుగా పలికితే సరి (3)
20.
హైదరాబాదుకు
తలమానికము తిరగబడింది (4)
23.
నవ్వులాట (4)
25.
పావురాయి
(2)
26. దుమ్ము ధూళి తువ్వలాంటిదే (2)
27.
వెనుకనుంచి
సుషుప్తి (2)
29.
కవీ
ఆ దైన్యం ఎందుకు? (2)
30.
మహాభారతంలోని
సుప్రసిద్ధ పద్యము గోగ్రహణ ఘట్టంలోనిది మాధవపెద్ది గళంలో నర్తనశాల చిత్రంలో
వీనులవిందు గొల్పినది (5, 4)
నిలువు :
1. నాలుకకు ఇది ఉండదు (2)
2. అశ్వత్థ వృక్షము (4)
3. సింధులోయ నాగరికతకు సంబంధించి హరప్పాతో పాటుగా శిథిలాలు
లభించిన పట్టణం. ఎన్.ఆర్.నంది నాటకం మరొకటి (5)
4. కుబేరుడు - అర్థరాట్టు, విత్తేశుడు మల్లే (4)
5. తిరగబడ్డ అంగ్లేయుల సంగ్రామము. (2)
6. చివర్లో రెండక్షరాలు
లేకున్నా కేంద్ర గిరిజన శాఖ మంత్రి మనవాడే. (4,3,2)
8. తెలంగాణ ప్రాంతమందలి
354 మంది ఆధునిక కవుల వివరాలు,
183 మంది
ప్రాచీన కవుల వివరాలు కలిగి వున్న సురవరం ప్రతాపరెడ్డిగారి సంకలనం (3, 3,
3)
9. బాలవిధవ,
ఒక తిట్టు
కూడా (2)
11. రాజమార్గము మండపము సభ కలకలము లేదా కలహము (2)
14. బస (3)
15. అడ్డం 18ని కాస్త ఒత్తి పలికితే పొగడ్త అవుతుందా? (3)
19. బుద్ధదేవుడు (5)
21. తలక్రిందలైన ప్రేమ (2)
22. బాలక్రీడావిశేషము (4)
23. ఏడురెళ్ళు (4)
24. ఒక పక్షి విశేషము, ఉపశాఖ (2)
28. తిరగబడ్డ అడవి (2)
29. వదలు అంటున్న ఇతగాడు (2)
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 44 సమాధానాలు!
ఈ పజిల్‌ను పూరించడానికి ప్రయత్నించిన అనూరాధ, వోలేటి, కంది శంకరయ్య, రాధ, ప్రసీద (వేదుల సుభద్ర), ఆత్రేయ, భమిడిపాటి సూర్యలక్ష్మి తదితరులకు అభినందనలు!
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
14, జులై 2011, గురువారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము -44
ఆధారాలు :
అడ్డం: 1. బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ ఇంకానా! ఇకపై చెల్లవు అని గర్జించిన వ్యక్తి. (3,6)
6. అజ్ఘలము, కేవడము, భేటకము, డాలు. (2)
7. అరేబియా సముద్రములోని
సంబోధనము కుడి ఎడమలయ్యింది. (2)
9. మధుబాబు డిటెక్టివ్ నవలల హీరో (2)
10. సుత్తి
కొట్టడంలాంటిదేనా ఇది పెట్టడం?
(2)
12. శత్రువులు (4)
13.
అటువైపునుండి
ఆర్డరు (4)
14. బూడిద (3)
16. దౌత్యము, సంధి (5)
17.
కుంచె
- చిత్రాన్ని
లిఖిస్తుంది కదా! (5)
18. పండుగ, ఉత్సవం (3)
20.
ఎంత
నేర్పరి అయితే మాత్రం వెనుదిరగాలా పిల్లా? (4)
23.
శిశువు (4)
25.
లక్షణములోని
సంఖ్య తిరగబడిందోచ్! (2)
26. గొట్టపు బావి (2)
27.
అటునుంచి
బలము లేదా స్థూలత్వము (2)
29.
ఇక్కడ
రోమన్లలాగే ప్రవర్తించాలి. (2)
30.
విజయనగరానికి
చెందిన తెదేపా సీనియర్ నేత (3,
4, 2)
నిలువు :
1. _ _ పొంగిన జీవగడ్డయి పాలు
పాఱిన భాగ్యసీమయి వ్రాలినది యీ భరతఖండము భక్తి పాడర తమ్ముడా! (2)
2. ఆవులకును ఎడ్లకును
మెడక్రింద వ్రేలాడెడు తోలు, గంగ చేతిలోని డ్రమ్ము
కాదు (4)
3. పర్పెండిక్యులర్ (5)
4. మానసమున తుల్యము (4)
5. ఓడలు వగయిరా నిలుచుండే
ప్రదేశం లేదా చాకలివాళ్ళు బట్టలుతికే చోటు తలకిందలుగా (2)
6. మేఘసందేశం సినిమా
దర్శకుడు (3, 6)
8. మహాభారతములో పదమూడవ
పర్వము, శాంతి పర్వము తరువాతిది (6, 3)
9. కారు లేని షావుకారు (2)
11. అడ్డం 10ని తిరగేస్తే ఒక సినీ నటి (2)
14. గంటలో అరవయ్యో వంతు (3)
15. రంగు రుచి తెలిసిన రమణీయము (3)
19. ఈ పూజ చేయని బడిపంతుళ్ళు అరుదు (3, 2)
21. ఫూంఖ్ సినిమా తెలుగు వర్షన్! (2)
22. బాలచంద్రుడు (4)
23. లిమిట్టు (4)
24. లజ్జ (2)
28. అలా తిరగబడింది (2)
29. ఎగఊపిరివిడుచు, ఒగర్చు (2)
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
క్రాస్వర్డు పజిలు సాల్వుము - 43 సమాధానాలు!
వివరణ :
నిలువు 8. బాలసాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు రచయిత - కలువకొలను సదానంద
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
8, జులై 2011, శుక్రవారం
క్రాస్వర్డు పజిలు సాల్వుము -43
ఆధారాలు :
అడ్డం: 1. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా (4,5)
6. అమెరికాలో దాక్కొన్న
శత్రువు (2)
7. చెలియకు ఇది కొనిస్తే
కట్టుకోక ఏం చేస్తుంది? (2)
9. రవితేజ,
కాజల్
అగర్వాల్, తాప్సీ నటించిన ఫ్లాపు
సినిమా (2)
10. మాల్దీవుల
రాజధాని. (2)
12. అవలక్షణములో కర్పూరాన్ని పోలినది వెదుకుము. (4)
13.
నీరసము.
నిమ్మరసం తాగితే ఇది పోతుంది. (4)
14. పండుగ, ఉత్సవము (3)
16. _ _ _ _ _ తో నువ్వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా (5)
17.
విల్లు
కఱ్ఱ వికటకవిలాగా palindrome (3,2)
18. సారా లభ్యమయ్యే
ప్రాంగణము (3)
20.
మంచి
కళ్ళు కలిగిన స్త్రీ, రాజ శబ్దం చేరిస్తే పాత
తరం నటి. బహువచనంలో అయితే కళ్ళజోడు. (4)
23.
పున్నమకు
పక్షం దూరంలో ఉంటుంది (4)
25.
'తొందర'లో తిరగబడింది. (2)
26. ఇటువంటి మేలు తలపెట్టమన్నాడు గురజాడ (2)
27.
లక్ష్మీప్రసన్న
పొట్టి సంతకం :) (2)
29.
రాగం
పల్లవుల నడిమిది. కొండకచో స్నానం కూడా కావచ్చు.(2)
30.
కాసుల
పురుషోత్తమ కవి వ్రాసిన శతకము. వాజ్యస్తుతికి చక్కని ఉదాహరణ (2,3,4)
నిలువు :
1. కొండవీటి సత్యవతి
నిర్వహించిన ఒక కాలమ్, స్త్రీ (2).
2. గుడిసె (4)
3. పండు కాని పండూ, పండు వెన్నెల చెండూ (3,2)
4. యజ్ఞకర్త, ప్రభువు, సొంతగాడు, గృహస్థుడు అని
బ్రౌణ్యము చెబుతోంది.(4)
5. మంచానికి నాలుగు. ఇక్కడ
ఒకటే ఉండి శీర్షాసనం
వేసింది.(2)
6. అథోలోకాలు ఏడూ
చెప్పడానికి ఆయాస పడటమెందుకు?
మొదటి
మూడూ చెప్పండి చాలు (3,3,3)
8. బాలసాహిత్యానికి కేంద్ర
సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు రచయిత చివరి అక్షరం మాయం. (6,3)
9. వీక్షణములో వాయిద్యము (2)
11. దేశభాషలందు తెలుగు? (2)
14. మోహనా! ఓ మోహనా! శివారెడ్డి సంపాదకీయంతో వెలువడిన ఒకప్పటి
పత్రిక, ప్రభాతము (3)
15. రాలక తిరగబడితే ఉన్నారా అనే రోగం (3)
19. వస్త్రదంతకాష్ఠాదుల చేత చేయఁబడిన బొమ్మ, పుత్తళిక అని బహుజనపల్లి వారి శబ్దరత్నాకరం
తెలుపుతోంది. (5)
21. సద్దన్నం (2)
22. నానారాజ సందర్శనములో లభ్యమయ్యే బహుమతి (4)
23. పార్వతి (4)
24. అడ్డం 26 లోని కవే దేశమంటే
ఇది కాదన్నాడు. (2)
28. ఏ స్టేటు నీది బుల్లోడా అంటే తిరగ మరగ చూస్తావేం? (2)
29. గోతాములో తమరున్నారా? (2)
Labels:
క్రాస్వర్డు పజిల్,
పజిల్
5, జులై 2011, మంగళవారం
3, జులై 2011, ఆదివారం
రూపు సనాతనం ఆలోచన అధునాతనం
ఇరవయ్యో శతాబ్దపు తెలుగు భాషాసాహిత్యాల చరిత్రలో డా.తిరుమల రామచంద్రకు సముచితమైన, సుస్థిరమైన స్థానం ఉంది. గొప్ప పండితునిగా, కవిగా, బహుభాషా కోవిదునిగా, పాత్రికేయ శిరోమణిగా, పరిశోధకునిగా, ప్రాచ్య లిఖిత గ్రంథాల పరిష్కర్తగా, లేఖకునిగా పేరొందిన తిరుమల రామచంద్ర 1913 జూన్ 17న జన్మించి 1997 అక్టోబరు 12 వరకు జీవించారు. భారతి, మీజాన్, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెయిలీ టెలీగ్రాఫ్ తదితర పత్రికలద్వారా పాఠకులకు చేరువైన తిరుమల రామచంద్ర మన లిపి - పుట్టు పూర్వోత్తరాలు, నుడి - నానుడి, సాహితీసుగతుని స్వగతం, గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు - పర్వాలు, హాల గాథలు, తెలుగుపత్రికల సాహిత్య సేవ మొదలైన గ్రంథాలెన్నో వ్రాశారు. హైదరాబాద్ నోట్‌బుక్, హైదరాబాద్ లేఖ వంటి శీర్షికలను నిర్వహించారు.
1953-56ల మధ్యకాలంలో పరిశోధన అనే ద్వైమాస పత్రికకు సంపాదకత్వం వహించి సుమారు 20 సంచికలు ప్రచురించారు. తెలుగు సాహిత్యంలో ఉన్నత ప్రమాణాలకు ఆదర్శంగా, నిస్పక్షపాతం, నిర్భీతి సాధనాలుగా ఈ పత్రిక వెలువడింది. ప్రభాకర సంస్మరణ సంచిక, సోమనాథ సంచిక, ఆంధ్ర నాటక పితామహ సంచిక, గురజాడ అప్పారావు సంస్మరణ సంచిక, బుద్ధ సంచిక మొదలైన ప్రత్యేక సంచికల ద్వారా దేశంలోని ప్రముఖ పరిశోధకుల వ్యాసాలను ఆంధ్ర పాఠకలోకానికి అందించారు. ఈ పత్రికద్వారా కుంటిమద్ది శేషశర్మ అలంకార సర్వస్వం, బులుసు వేంకట రమణయ్య అలంకార చరిత్ర మొదలైన గ్రంథాలను ప్రకటించారు.
ఈ భాషాసేవ అంతా ఒక ఎత్తు. స్వీయ చరిత్రాత్మక వృత్తాంతం 'హంపీ నుంచి హరప్పా దాక' మరొక ఎత్తు. ఈ ఆత్మకథ ఒక గొప్ప ఆధునిక ఇతిహాసం. మనోహర మంజులమైన మహాకావ్యం. ఈ గ్రంథం చదివినంత సేపు పాఠకులు బాహ్య ప్రపంచాన్ని మరిచిపోతారు. భావుకతా సముద్రంలో ఈదులాడుతారు. తన్మయత్వంతో ఆయా సంఘటనలలో మమేకమై ఆశ్చర్యానందాల వంటి భావోద్రేకాలకు లోనవుతారు. గత శతాబ్దపు అత్యుత్తమ తెలుగు గ్రంథాలలో 'హంపీ నుంచి హరప్పా దాక' మొదటి వరుసలో ఉంటుంది.
తిరుమల రామచంద్ర జీవితంలోని వైవిధ్యాలు, వైరుధ్యాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సనాతన వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వీరు సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఆయుర్వేదం చదువుకున్నారు. తాత తండ్రుల ప్రభావంతో కాంగ్రెస్ వాదిగా జాతీయోద్యమంలో పనిచేశారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు. బ్రిటీష్ శాసనోల్లంఘనానికి పాల్పడి రాయవెల్లూరు, తిరిచిరాపల్లి జైళ్లలో శిక్ష అనుభవించారు. కానీ తర్వాత విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా ఇరుక్కున్నారు. బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరే తరువాత భుక్తి కోసం మిలటరీలో హవల్దార్ క్లర్క్‌గా బలూచిస్తాన్, క్వెట్టా, యెమెన్ ప్రాంతాలలో పనిచేశారు. అచ్ఛర్ సింఘ్ అనే మిత్రునికి సహాయం చేయబోయి కోర్టు మార్షల్‌కు గురి అయ్యారు. ఓరియెంటల్ మ్యానుస్క్రిప్టు లైబ్రరీలో కాపీయిస్టుగా, తంజావూరు సర్సవతీ మహల్ లైబ్రరీలో పండితునిగా, లాహోర్ విశ్వవిద్యాలయంలో తాళపత్రాల సూచీకర్తగా, హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయునిగా, కాన్పూర్ డెయిలీ టెలీగ్రాఫ్ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేసిన వీరే మద్రాసు మింటు స్ట్రీటులోని గుజరాతీ హోటల్లోను, రామావిలాస్ అనే హోటల్లోను పనిచేశారు. లాహోర్‌లో ఒక రోల్డుగోల్డు కంపెనీ గుమాస్తాగా, కాన్పూర్‌లో మరి కొన్ని చిల్లర మల్లర పనులు కూడా చేశారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు. వీరి జీవన యానం సరియైన లక్ష్యంలేక సాగినప్పటికీ, అంది వచ్చిన కొన్ని అవకాశాలు జారవిడిచినప్పటికీ పలువురు ప్రముఖుల పరిచయాలు వీరి జీవితంపై అంతులేని ప్రభావాన్ని చూపించాయి.
తన ఆత్మకథను తిరుమల రామచంద్రగారు సుమారు 78యేళ్ల వయసులో వ్రాయడం ప్రారంభించారు. తమ మూడేళ్ల వయసు నుండి జరిగిన సంఘటనలను గుర్తుపెట్టుకొని ఎంతో హృద్యంగా వర్ణించడం చూస్తే వీరి జ్ఞాపక శక్తికి జోహారులర్పించక తప్పదు. చిన్ననాటి వీరి ముచ్చట్లు పాఠకుల మనసును దోచుకుంటాయి. తమ పెద్దల ద్వారా విన్న రాఘవమ్మ కథ, హంపి చరిత్ర, తెనాలి రామన మంటప వృత్తాంతం, గొడుగు పాలుని కథ మొదలైన వాటిని ఎంతో ఆసక్తితో చదివేలా రాశారు.
వీరి జీవితంలో తారసిల్లిన ఎంతో మంది ప్రముఖ వ్యక్తుల జీవిత విశేషాలు ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. కోలాచలం వెంకటరావు, కోలాచలం శ్రీనివాసరావు, పానుగంటి నరసింహారావు, రూపనగుడి నారాయణరావు, కుంటిమద్ది శ్రీనివాసాచార్యులు, కుంటిమద్ది శేషశర్మ, బళ్ళారి రాఘవ, వావికొలను సుబ్బారావు, మానవల్లి రామకృష్ణ కవి, కలచవీడు శ్రీనివాసాచార్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, వేదం వెంకటరామ శాస్త్రి, కామరాజ నాడర్, మద్దూరి అన్నపూర్ణయ్య, గుమ్మడిదల దుర్గాబాయి, ఆదిభట్ల నారాయణదాసు, దువ్వూరి రామిరెడ్డి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, సంగెం లక్ష్మీబాయి, కాశీనాథుని నాగేశ్వరరావు, విస్సా అప్పారావు, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సి.వి.రామన్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, విన్స్టన్ చర్చిల్ మొదలైన ప్రముఖుల ప్రస్తావన వీరి జీవన విస్తృతికి తార్కాణం.
వీరి సామాజిక జీవిత పరిశీలన, మానవ స్వభావ చిత్రణ, మనస్తత్వ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉన్నాయి. బసివి నాగమ్మను గురించి వ్రాస్తూ "మా అమ్మ తర్వాత స్త్రీల ఎడల నాకు గౌరవం చిన్ననాటి నుంచే కలిగించింది నాగమ్మ. తన చేతులతో పెంచింది. ఆమెను తలుచుకుంటే నాకు వేద, పురాణ మహిళలందరూ గుర్తుకు వస్తార"ని అంటారు. వీరి పిన్నయ్యగారి చేతికి ఉన్న గరుడ రేఖను చూసి పాములు తోక ముడుచుకుపోయిన సంఘటనను వివరిస్తూ "ఆయన ధైర్యం, ఆత్మస్థైర్యమే గరుడరేఖ అని ఇప్పుడు నేను భావిస్తున్నా"నంటారు. ఆనెగొంది విద్యభ్యాస సమయంలో వీరిని కనిపెట్టిన కొండమ్మవ్వను గురించి ఇలా విశ్లేషిస్తారు. "ఆమె మనసున్న మరమనిషి. ఏ పనీ ఆమెది కాదు, కానీ అన్ని పనులూ ఆమెవే. క్రమశిక్షణలో ఆమె ఒక సైనికురాలు. సమయపాలనలో సూర్యచంద్రులకు దీటు. నా చిన్నతనంలో దాదాపు ప్రతి బ్రాహ్మణ కూటుంబంలోను అలాంటివారు ఉంటూనే ఉండేవారు. సేవ చేస్తూనే ఉండేవారు. చందనం చెక్కలాగా అరిగిపోతునే ఉండేవారు." తమ చిన్నతనంలో చిరుతపులిని వేటాడి చిత్రవధ చేసే క్రమాన్ని వివరిస్తూ "ఎంతటి అమానుష వినోదం! చిత్రవధ చేయడంలో శాడిస్టుకు ఎంత సంతోషం?" అంటూ వాపోతారు.
తమ అవలక్షణాల గురించి ప్రస్తావించడానికి వీరు వెనుదీయలేదు. మూఢత్వం, మనో చాంచల్యం, పెద్దల మాటలను పెడచెవినపెట్టడం, సరైన లక్ష్యం లేకపోవడం వంటి లక్షణాలను అక్కడక్కడా ప్రస్తావించారు. వీరి విధేయత, సౌజన్యశీలత, సౌహార్ద్రత ఈ గ్రంథంలోని ప్రతిపుటలోను స్పష్టంగా కనిపిస్తుంది. తమ జన్మ వృత్తాంతాన్ని వివరించడంలోనే వీరి విధేయత, వ్యక్తిత్వం బయటపడుతుంది. "నేను పుట్టినప్పుడు దేవదుందుభీలు మోగలేదు. అట్లని భయంకరంగా పిడుగులు పడలేదు. భూమి కంపించలేదు. నేను పుట్టాను. కొన్ని వేలమంది పుట్టినట్లుగా, కొన్ని లక్షల మంది పుట్టినట్లుగా, కోటానుకోట్లమంది పుట్టినట్లుగా పుట్టాను. అంతే..." అని అంటారు.
తిరుమల రామచంద్రగారి ఆత్మకథ ఒక పెద్ద బాలశిక్ష వంటిది. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన అంశాలెన్నో దీనిలో లభిస్తాయి. 1917 నుండి 1944 వరకు సూమారు 27 సంవత్సరాల జీవితాన్ని ఈ "హంపీ నుంచి హరప్పా దాక"లో పొందుపరిచారు. వీరి తదుపరి జీవితంలో కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ జీవిత విశేషాలను చరిత్ర రూపంలో గ్రంథస్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(రాజకీయ సామాజికార్థిక వారపత్రిక ఈవారం జనవార్త అక్టోబర్ 5-11, 2008 సంచికలో ప్రచురితమైనది)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)