...

...

19, జులై 2011, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము -45
ఆధారాలు :

అడ్డం: 1. దక్షిణభారతదేశంలో మొట్టమొదటి మూకీ కథా చిత్రం 'కీచకవధ' నిర్మాత (4,5)
6. విరోధము (2)
7. అటునుంచి భారతదేశంలోని 25వ రాష్ట్రం (2)
9. చిత్రలేఖిని (2)
10. చిక్కడు దొరకడులో ప్రభువు (2)
12. కాటుక కంటినీరు _ _ _ _ పయింబడ నెల ఏడ్చెదో కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! (4)
13.  రాజశేఖరరెడ్డి చనిపోయేరోజు హాజరు కావలసిన కార్యక్రమం (4)
14. శత్రువు V ρ ధి (3)
16. భారతదేశపు మొట్టమొదటి ఐ.పి.ఎస్.అధికారిణి (3, 2)
17.  నెమలి, కేకి (5)
18.  పార్వతి నిలువు 15ను కాస్త నాజూకుగా పలికితే సరి (3)
20.  హైదరాబాదుకు తలమానికము తిరగబడింది (4)
23.  నవ్వులాట (4)
25.  పావురాయి (2)
26.  దుమ్ము ధూళి తువ్వలాంటిదే (2)
27.  వెనుకనుంచి సుషుప్తి (2)
29.  కవీ ఆ దైన్యం ఎందుకు? (2)
30.  మహాభారతంలోని సుప్రసిద్ధ పద్యము గోగ్రహణ ఘట్టంలోనిది మాధవపెద్ది గళంలో నర్తనశాల చిత్రంలో వీనులవిందు గొల్పినది (5, 4)
నిలువు :
1. నాలుకకు ఇది ఉండదు (2)
 2.  అశ్వత్థ వృక్షము (4)
3.  సింధులోయ నాగరికతకు సంబంధించి హరప్పాతో పాటుగా శిథిలాలు లభించిన పట్టణం. ఎన్.ఆర్.నంది నాటకం మరొకటి (5)
4. కుబేరుడు - అర్థరాట్టు, విత్తేశుడు మల్లే (4) 
5. తిరగబడ్డ అంగ్లేయుల సంగ్రామము. (2)
6. చివర్లో రెండక్షరాలు లేకున్నా కేంద్ర గిరిజన శాఖ మంత్రి మనవాడే. (4,3,2)
8. తెలంగాణ ప్రాంతమందలి 354 మంది ఆధునిక కవుల వివరాలు, 183 మంది ప్రాచీన కవుల వివరాలు కలిగి వున్న సురవరం ప్రతాపరెడ్డిగారి సంకలనం (3, 3, 3)
9.  బాలవిధవ, ఒక తిట్టు కూడా (2)
11.  రాజమార్గము మండపము సభ కలకలము లేదా కలహము (2)
14.  బస (3)
15.  అడ్డం 18ని కాస్త ఒత్తి పలికితే పొగడ్త అవుతుందా? (3)
19.  బుద్ధదేవుడు (5)
21.  తలక్రిందలైన ప్రేమ (2)
22.  బాలక్రీడావిశేషము (4)
23.  ఏడురెళ్ళు (4)
24. ఒక పక్షి విశేషము, ఉపశాఖ (2)
28.  తిరగబడ్డ అడవి (2)
29.  వదలు అంటున్న ఇతగాడు (2)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి