...

...

8, జులై 2011, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము -43





ఆధారాలు :
అడ్డం: 1. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా (4,5)
6. అమెరికాలో దాక్కొన్న శత్రువు (2)
7. చెలియకు ఇది కొనిస్తే కట్టుకోక ఏం చేస్తుంది? (2)
9. రవితేజ, కాజల్ అగర్వాల్, తాప్సీ నటించిన ఫ్లాపు సినిమా (2)
10. మాల్దీవుల రాజధాని. (2)
12. అవలక్షణములో కర్పూరాన్ని పోలినది వెదుకుము. (4)
13.  నీరసము. నిమ్మరసం తాగితే ఇది పోతుంది. (4)
14. పండుగ, ఉత్సవము (3)
16. _ _ _ _ _ తో నువ్వొకటంటే తలుపుచెక్కతో నే రెండంటా (5)
17.  విల్లు కఱ్ఱ వికటకవిలాగా palindrome (3,2)
18.  సారా లభ్యమయ్యే ప్రాంగణము (3)
20.  మంచి కళ్ళు కలిగిన స్త్రీ, రాజ శబ్దం చేరిస్తే పాత తరం నటి. బహువచనంలో అయితే కళ్ళజోడు. (4)
23.  పున్నమకు పక్షం దూరంలో ఉంటుంది (4)
25.  'తొందర'లో తిరగబడింది. (2)
26.  ఇటువంటి మేలు తలపెట్టమన్నాడు గురజాడ (2)
27.  లక్ష్మీప్రసన్న పొట్టి సంతకం :) (2)
29.  రాగం పల్లవుల నడిమిది. కొండకచో స్నానం కూడా కావచ్చు.(2)
30.  కాసుల పురుషోత్తమ కవి వ్రాసిన శతకము. వాజ్యస్తుతికి చక్కని ఉదాహరణ (2,3,4)

నిలువు :
1.  కొండవీటి సత్యవతి నిర్వహించిన ఒక కాలమ్, స్త్రీ (2).
2. గుడిసె (4)
3.  పండు కాని పండూ, పండు వెన్నెల చెండూ (3,2)
4. యజ్ఞకర్త, ప్రభువు, సొంతగాడు, గృహస్థుడు అని బ్రౌణ్యము చెబుతోంది.(4)
5. మంచానికి నాలుగు. ఇక్కడ ఒకటే ఉండి శీర్షాసనం వేసింది.(2)
6. అథోలోకాలు ఏడూ చెప్పడానికి ఆయాస పడటమెందుకు? మొదటి మూడూ చెప్పండి చాలు (3,3,3)
8. బాలసాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు రచయిత చివరి అక్షరం మాయం. (6,3)
9.  వీక్షణములో వాయిద్యము (2)
11.  దేశభాషలందు తెలుగు? (2)
14.  మోహనా! ఓ మోహనా! శివారెడ్డి సంపాదకీయంతో వెలువడిన ఒకప్పటి పత్రిక, ప్రభాతము (3)
15.  రాలక తిరగబడితే ఉన్నారా అనే రోగం (3)
19.  వస్త్రదంతకాష్ఠాదుల చేత చేయఁబడిన బొమ్మ, పుత్తళిక అని బహుజనపల్లి వారి శబ్దరత్నాకరం తెలుపుతోంది. (5)
21.  సద్దన్నం (2)
22.  నానారాజ సందర్శనములో లభ్యమయ్యే బహుమతి (4)
23.  పార్వతి (4)
24. అడ్డం 26 లోని కవే దేశమంటే ఇది కాదన్నాడు. (2)
28.  ఏ స్టేటు నీది బుల్లోడా అంటే తిరగ మరగ చూస్తావేం? (2)
29.  గోతాములో తమరున్నారా? (2)



4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అడ్డం:1.నాయకుడువినాయకుడు,6.అరి,7.కోక,
9.వీర,10.మాలె,12.లవణము,13.నిస్సత్తువ, 14.వేడుక,16.తమలపాకు,17.లకోలకోల?, 18.వసారా,20.సులోచన,23.అమవాస,25.ల్దిజ,
26.గట్టి,27.లప్ర, 29.తానం,
30.ఆంధ్రనాయకశతకము
నిలువు: 1.నారి,2.కుటీరము,3.విభూదిపండు, 4.యజమాని,5.డుకో,6.అతలవితలసుతల,8. కలువకొలనుసదానం,9.వీణ,11.లెస్స,14.వేకువ,
15.కలరా,19.సాలభంజిక,21.చల్ది,22.నజరానా, 23.అగజాత,24.మట్టి,28.ప్ర ఆం,29.తాము
-అలకనంద

mmkodihalli చెప్పారు...

అజ్ఞాత పేరుతో ఒకరు ఈ పజిల్‌ను పూరించి పంపారు. అడ్డం 23లో మూడవ అక్షరానికి దీర్ఘం ఉండకూడదు. నిలువు 3లో దకారానికి బదులుగా తకారం వాడాలి. మిగిలినవన్నీ సరిపోయాయి. అజ్ఞాత గారికి అభినందనలు!

Anuradha చెప్పారు...

అడ్డం:
1.నాయకుడువినాయకుడు 6.అరి 7.కోక 9.వీర 10.మాలె 12.లక్షణము 13.నిస్సత్తువ 14.వేడుక 16.తమలపాకు 18.వసారా 20.సులోచన 23.అమవాస్య 25 ల్దిజ 26.గట్టి 27.లప్ర 29.తానం 30.ఆంధ్రనాయకశతకము

నిలువు:
1.నారి 2.కుటీరము 3.విభూదిపండు 4.యజమాని 5.డుకో 6.అతలవితలసుతల 9.వీణ 11.లెస్స 14.వేకువ 15.కలరా 19.సాలభంజిక 21.చల్ది 22.నజరానా 23.అగజాత 24.మట్టి

mmkodihalli చెప్పారు...

అనూరాధగారూ! మీరు పంపిన వాటిల్లో అడ్డం 23, నిలువు 3 తప్ప మిగతావి సరియైనవేనండి. పై అజ్ఞాత(అలకనంద) మాదిరి మీరు కూడా ఆ రెండు పదాల విషయంలో పప్పులో కాలేశారు. ఒకసారి పై సమాధానం చూడండి.