...

...

14, జులై 2011, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము -44


ఆధారాలు :

అడ్డం: 1. బలవంతుల దౌర్జన్యాలూ, ధనవంతుల పన్నాగాలూ ఇంకానా! ఇకపై చెల్లవు అని గర్జించిన వ్యక్తి. (3,6)
6. అజ్ఘలము, కేవడము, భేటకము, డాలు. (2)
7. అరేబియా సముద్రములోని సంబోధనము కుడి ఎడమలయ్యింది. (2)
9. మధుబాబు డిటెక్టివ్ నవలల హీరో (2)
10. సుత్తి కొట్టడంలాంటిదేనా ఇది పెట్టడం? (2)
12. శత్రువులు (4)
13.  అటువైపునుండి ఆర్డరు (4)
14. బూడిద (3)
16. దౌత్యము, సంధి (5)
17.  కుంచె - చిత్రాన్ని లిఖిస్తుంది కదా! (5)
18.  పండుగ, ఉత్సవం (3)
20.  ఎంత నేర్పరి అయితే మాత్రం వెనుదిరగాలా పిల్లా? (4)
23.  శిశువు (4)
25.  లక్షణములోని సంఖ్య తిరగబడిందోచ్! (2)
26.  గొట్టపు బావి (2)
27.  అటునుంచి బలము లేదా స్థూలత్వము (2)
29.  ఇక్కడ రోమన్లలాగే ప్రవర్తించాలి. (2)
30.  విజయనగరానికి చెందిన తెదేపా సీనియర్ నేత (3, 4, 2)

నిలువు :
1.  _ _   పొంగిన జీవగడ్డయి పాలు పాఱిన భాగ్యసీమయి వ్రాలినది యీ భరతఖండము భక్తి పాడర తమ్ముడా! (2)
 2.  ఆవులకును ఎడ్లకును మెడక్రింద వ్రేలాడెడు తోలు, గంగ చేతిలోని డ్రమ్ము కాదు (4)
3.  పర్పెండిక్యులర్ (5)
4. మానసమున తుల్యము (4) 
5. ఓడలు వగయిరా నిలుచుండే ప్రదేశం లేదా చాకలివాళ్ళు బట్టలుతికే చోటు తలకిందలుగా (2)
6. మేఘసందేశం సినిమా దర్శకుడు (3, 6)
8. మహాభారతములో పదమూడవ పర్వము, శాంతి పర్వము తరువాతిది (6, 3)
9.  కారు లేని షావుకారు (2)
11.  అడ్డం 10ని తిరగేస్తే ఒక సినీ నటి (2)
14.  గంటలో అరవయ్యో వంతు (3)
15.  రంగు రుచి తెలిసిన రమణీయము (3)
19.  ఈ పూజ చేయని బడిపంతుళ్ళు అరుదు (3, 2)
21.  ఫూంఖ్ సినిమా తెలుగు వర్షన్! (2)
22.  బాలచంద్రుడు (4)
23.  లిమిట్టు (4)
24. లజ్జ (2)
28.  అలా తిరగబడింది (2)
29.  ఎగఊపిరివిడుచు, ఒగర్చు (2)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి