...

...

28, ఆగస్టు 2011, ఆదివారం

తెలుగు బాటఈరోజు తెలుగుబాట కార్యక్రమం తెలుగు లలిత కళాతోరణం నుండి ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ చౌరస్తా మీదుగా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వరకూ సాగింది. మన బ్లాగర్లు బజ్జర్లు కొంత మందితో పాటు కూచిభొట్ల ఆనంద్, అమర్‌నాథ్ రెడ్డి, గురజాల విజయ్‌కుమార్, కె.ఎల్.కామేశ్వరరావు, ఎఱ్ఱ నాయుడు, మాడభూషి అనంతాచార్యులు మొదలైన వారు కొందరు పాల్గొన్నారు. నడక ముగిసిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలోని నందమూరి తారకరామారావు కళాప్రాంగణంలో చిన్న సభ, తదనంతరం తెలుగు తల్లి విగ్రహాన్ని పుష్పమాలలతో అలంకరించడంతో కార్యక్రమం ముగిసింది. గత సంవత్సరం జరిగిన తెలుగుబాటతో పోల్చుకుంటే పాల్గొన్నవారి సంఖ్య బాగా తగ్గింది. e-తెలుగు సభ్యులు, ఆ సంస్థ కార్యవర్గ సభ్యులే చాలామంది గైర్హాజరు కావడం (కారణాలు ఏవైనా) చూస్తే ఇక ఇతరులు పాల్గొనక పోవడంపై ఆలోచించడంలో అర్థం లేదనిపిస్తోంది.   

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి