...

...

18, ఏప్రిల్ 2010, ఆదివారం

మనమీదేనర్రోయ్!

ఈ రోజు సాక్షి ఫన్‌డేలో 'రామనాథం గారి బ్లాగ్ కథ' అనే కథ ప్రచురించారు. రచయిత నిరుపమ్ ప్రతాప్. బహుశా బ్లాగులమీద వచ్చిన తొలి తెలుగు కథ ఇదేనేమో. ఈ కథ లింకు కోసం ఇక్కడ నొక్కండి. ఇందులో బ్లాగర్లగురించి, బ్లాగుల్లోని రాతలగురించి కాస్త వ్యంగ్యంగా రాశారు. కాకపోతే ఇందులో  కొంచెం వాస్తవం కూడా లేకపోలేదు. తరచి చూస్తే మనలోనే ఎందరో రామనాథాలు కనిపిస్తారు.  ఈ కథ చదివి మనసారా నవ్వుకోండి.  

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అవునన్డీ చాలా బాగా రాశారు కధని..కాబట్టి ఇక నుంచీ జనం భగ్వత్గీతా.రామాయణం లాంటి ఇతిహాసాల్ని తమ బ్లాగ్ ల్లో సృష్టించాలని...వాటిని తమ కళ్ళు తెరిపించి ప్రపంచంలో బ్లాగ్ లకు తన కధ ద్వారా దశా నిర్ఢేశమ్ చేసిన ఆ రచయితకు అంకితం గావించాలనీ బ్లాగ్ లు రాసుకుంటూ అమాయకంగా బతుకుతున్న జనాలకు తెలియ చేసుకుంటున్నా...

Saahitya Abhimaani చెప్పారు...

సాక్షి ఆదివారం అనుబంధంలో కథ బాగున్నది. కొన్నిసార్లు మనం వ్రాసింది అనేకమంది చూస్తున్నారు అన్న ఉత్సాహంలో కొన్ని కొన్ని విషయాలు వ్రాస్తే ఏమవుతుంది ఊహించి మంచి ముగింపు ఇచ్చారు కథకి.

ఇదివరకు మనలాంటి సామాన్యులకు లేని ఆవకాశం, బ్లాగుల పుణ్యమా అని వ్రాసుకునే ఆవకాశం వచ్చింది. ఆ వ్రాయటం వేలం వెర్రి కాకుండా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

mmkodihalli చెప్పారు...

kvsv గారూ హ..హ.. మీ కౌంటరు చాలా బాగుందండీ! శివగారూ మీరు చెప్పింది నిజమేనండి.