...

...

23, అక్టోబర్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 54ఆధారాలు:

అడ్డం:
1. శ్రీశ్రీని భయపెట్టునది (3,3,2)

5. అగ్నిపర్వతములో నుండి వచ్చిన శిలాద్రవము (2)

7. నడుం విరిగిన (2)

8. పూతన ఒక ___ (3)

9. చింతామణి నాటకంలో ఒక పాత్ర (5)

12. సొరుగు (2)

13. దామోదరం సంజీవయ్య హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈయన పేరుమీద ఒక జిల్లా కూడా ఉంది (4)

15. దళసరి కానిది అట్నుంచి (3)

17. సరసముతో అభేదము (5)

18. సునందగారి అకౌంటు (3, 2)

19. చెదిరిన పుండు (3)

21. ఒకానొక గ్రామ దేవత. ఆరుద్ర ఈవిడ పేరుతో పదాలు సృష్టించాడు (4)

23. సుతరామూ కష్టపెట్టని కూతురు (2)

24. వెనుకకు మరలిన వారాంగన (5)

26. పొడుపు వెంట ఉండేది (3)

28. తిరగ బడిన పొలములు (2)

30. కుడినుండి ఎడమకు పార్వతి (2)

31. కృష్ణా జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షులు (3, 5)
నిలువు:
1. విడిది సబర్మతి ఆశ్రమంలో (2)
2. శూన్యం (3)
3. శర్కర (4)
4. తుమ్మెదలు (5)
5. శతసహస్రములను సాగదీస్తే లక్క (2)
6. 'రాబందులు రామచిలకలు' రచయిత్రి (4, 4)
10. పాండురంగడిని తిరగబడి ఆహ్వానించు (2)
11. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరును అని అర్థాన్నిచ్చే సామెత (4, 4)
12. అరలక్ష మాటల్లో ఆల్ఫాబెట్ (5)
14. ఓండ్ర (3, 2)
15. చేతికి ఇది వదిలిందంటే డబ్బులు ఖర్చైనట్టే లెఖ్ఖ (3) 
16. హరిద్రాచూర్ణము (3)
20. వజ్రాయుధం చేతబట్టిన ఇంద్రుడే కానీ ఇలా తడబడిపోయాడు (5)
22.  కొన మొదలు లేని బొమ్మరిల్లు (2)
23. పేరొందిన (4) 
25. 1995నాటి అంతర్జాల తెలుగుసాహిత్యపు గుంపు (3)
27. తలక్రిందలుగా క్రీడించు (2)
29. నిలువు 3 రుచికి విరుద్ధమైనది (2)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి