...

...

4, అక్టోబర్ 2011, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 51


అడ్డం:

1. ఈ చరిత్ర ఈ నవ్వుతో (4)

3. ముతక సంచిలో చేవ్రాలు (4)

5. తమిళ నమస్కారంలో పోకచెక్క (2)

6. లట్టువ అనబడు చిటితాళము (3)

7. బెజవాడ రౌడీలు సినిమా నిర్మిస్తున్నది (2)

9.  నెపం. కన్నడలో చాలు (2)

1 1. చిత్రను పిలవండి (2)

13. కలెక్టర్ జానకి సినిమాలో నాగభూషణం చెప్పిన హరికథలో అంతర్లీనంగా దీని గురించే చెప్పాడు. (3,4) 15. తల తెగిన కండువాతో తిరగబడిన అతడు.(2)

17. తతిమ్మా సమూహము కనబడిందా? (2)

18. అగ్రిమెంటు చివరి అక్షరం మొదటికి వచ్చింది (5)

19. కాంచన ఈ సినిమా సీక్వెల్ (2)

20. కుడితిలో పడిన ఉత్కంఠ (2)

22. గొప్ప ప్రారంభములు అనవచ్చా (2, 5)

24. ఇది వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు. (2)

25. ప్రముఖుల కార్యాలయాలలో వ్యక్తిగత సహాయకులు-కార్యదర్శులు పనిచేయు విభాగము దీర్ఘం కోల్పోయి తిరగబడింది (2)

26. అవనిలో అడవి (2)

28. వాచీ కలిగివున్న వస్త్ర విశేషము (3)

30. 3.2కిలోమీటర్లు రమారమిగా (2)

31. కారము కాని కారము (4)

32. వేశ్యా సంపర్కమునకు తీపి గుర్తు (4)

నిలువు:
1. చోటును ఇక్కడ వెదుకుము (2)
2. సంచికలో సేవకము (2)
3. అడ్డం 3లోని మార్కెట్టు (2)
4. చంద్రగుప్తుడి తల్లిని పిలవండి (2)
5. స్మశానము (4)
8. ఎంతటివారినైనా లొంగదీసేది (4)
9. పెంచు (2)
10. సంసారంలో తగాదాలు (3, 4)
11. బొమ్మలు గీసేవాడి ప్రతిభ అనుకోవచ్చా? (4, 3)
12. బలము అథవా జాగ్రత్త (2)
14. సింపుల్ (5)
16. మూలా నారాయణస్వామి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డిగార్ల పేరొందిన సంస్థ! (3)
17. ఇవి తట్టడేల? అని వేమన ప్రశ్నిస్తున్నారు. తొలి సగమే! (3)

19. చిరంటి, జామి, జీవత్పతి, పతిపత్ని, పుణ్యస్త్రీ, భర్తృమతి, సనాథ, సిందూర తిలక, సీమంతిని, సీమాటి, సుమంగళి, సువాసిని వగైరా... (4) 
21. గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి పురస్కారం తెచ్చిపెట్టిన పాత్ర (4)
22.  ఎన్.ఆర్.నంది రాసిన సుప్రసిద్ధ నాటకం తొలి రెండక్షరాలు (2)
23. పేను + పేను బోల్తా కొట్టాయి (2)
27. ఇది చాల సుఖమా? రాముని సన్నిధి సుఖమా? అని త్యాగరాజు అడుగుతున్నాడు. (2)
28. రసిక, కొమ్మున్న పిపీలికము (2)
29. వెంకటేశ్, భూమిక ప్రధాన పాత్రధారులుగా 2002లో వెలువడిన ఒక సినిమా (2)
30. శార్వరి నామ సంవత్సరం తర్వాత నాలుగేళ్ళకు వచ్చేది. (2)

6 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

అడ్డం
౧ ఇతిహాసం
౫ వక్క
౧౫ డువా
౧౯ ముని
౨౬ వని
౩ సంతకము
౩౧ ధిక్కారము
౩౨ సుఖవ్యాధి
౩౦ కుతి
౭ రాము
౧౧ చిత్రా
౧౩ కుటుంబ నియంత్రణ
౨౨ మహా ప్రారంభములు
౯ సాకు
౧౮ ఒడంబడిక
౨౫ పేషీ
౩౦ క్రోసు
౧౭ తమ్మా
౬ చిటిత
౨౮ చీనీవా
౨౪ రోలు
నిలువు
౧ ఇక్క
౫ వల్లకాడు
౧౬ వాహిని
౧౯ ముత్తైదువ
౨౭ నిధి
౨౯ వాసు
౧౭ తళుకు
౪ మురా
౧౨ త్రాణ
౧౦ కుటుంబ కలహాలు
౧౪ నిరాడంబరం
౯ సాకు
౨౨ పేలు
౨౧ తిమ్మరుసు
౩౦ క్రోధి
౮ ముద్దుగుమ్మ
౨ సంత
౨౮ చీము
౨౨ మరో
౨ సంచి

mmkodihalli చెప్పారు...

ఆత్రేయగారూ! మీ సమాధానాలలో అడ్డం 6,22,18,25,17,28 నిలువు8, 23 నావద్ద ఉన్న సొల్యూషన్‌తో సరిపోవడం లేదండీ. వాటిల్లో అడ్డం 6,17,28 నిలువు 8 మాత్రం తప్పుగా వ్రాశారు. నిలువు 11 ఒక్కటి మీరు కనుక్కోలేకపోయారు.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) ఇతిహాసం, 3) సంతకము, 5) వక్క, 6) చిడు(రు)త, 7) రాము, 9) సాకు, 11) చిత్రా, 13) కుటుంబ నియంత్రణ, 15) డువా, 17) తలి, 18) కఒడంబడి, 19) ముని, 20) కుతి, 22) మహా ఆరంభములు, 24) రోలు, 25) పేషి, 26) వని, 28) చీకువా, 30) క్రోసు, 31) ధిక్కారము, 32) సుఖవ్యాధి.

నిలువు: 1) ఇక్క, 2) సంచి, 3) సంత, 4) మురా, 5) వల్లకాడు, 8) ముదుసలి, 9) సాకు, 10) కుటుంబ కలహాలు, 11) చిత్రకుడి .... 12) త్రాణ, 14) నిరాడంబరం, 16) వాహిని, 17) తళుకు, 19) ముత్తైదువ, 21) తిమ్మరుసు, 22) మరో, 23) లుపే, 27) నిధి, 28) చీము, 29) వాసు, 30) క్రోధి.

mmkodihalli చెప్పారు...

సూర్యలక్ష్మిగారూ! మీ సమాధానాలలో అడ్డం 6,17,25,నిలువు 8 మాత్రం తప్పు. అడ్డం 22కు సమాధానం నేను అనుకున్నది ఇంకొకటి. నిలువు 11కూడా సగమే పూరించారు.

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం - 1.
ఇతిహాసం; 3. సంతకము; 5. వక్క; 6. చిఱుత; 7. రాము; 9. సాకు; 11. చిత్రా; 13. కుటుంబనియంత్రణ; 15,డువా; 17. తతి; 18. కఒడంబడి; 19. ముని; 20. కుతి; 22. మహాప్రారంభములు; 24. రోలు; 25. షిపే; 26. వని; 28. చీకువా; 30. క్రోసు; 31. ధిక్కారము; 32. సుఖవ్యాధి.
నిలువు -
1. ఇక్క; 2. సంచి; 3. సంత; 4. మురా; 5. వల్లకాడు; 8. ముఖస్తుతి; 9. సాకు; 10. కుటుంబకలహాలు; 11. చిత్రగాడిశేముషి; 12. త్రాణ; 14. నిరాడంబరం; 16. వాహిని; 17. తళుకు; 19. ముత్తైదువ; 21. తిమ్మరుసు; 22. మరో; 23. లుపే; 27. నిధి; 28. చీము; 29. వాసు; 30. క్రోధి.

mmkodihalli చెప్పారు...

కంది శంకరయ్యగారూ అడ్డం 6,22, నిలువు11 మినహా అన్నీ సరైనవేనండీ!