...

...

27, నవంబర్ 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 58




అడ్డం:
     1. పైన ధరించు చొక్కాయి,  లాంగు కోటు (4)

4. ఆడంబరము, ఆర్భాటము లేదా దర్పములో నవ్వును తొలగిస్తే పుస్తకానికి పైన ఉండేది (2)

5. తూచుట (3)

8. నోరువెడల్పుగల చిట్టి మట్టిపాత్ర (2)

9. నడవను అంటున్న వసారా (3)
11. పసిడితో ఏతము (2)
13. తోబుట్టు వైనట్టి తొయ్యలి నేమందురు? (4)

15.  ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ బహుమతిని అందుకున్న వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన గత దశాబ్దపు చిత్రం (4,1)

18. నాస్తికతలో నాస్తి నాస్తి (2)  

19. పల్లవము (6)

21. మోహన్ లాల్‌ కు చెందిన మళయాళం టీవీ ఛానెల్ (3)

22. ఫుల్లు మూను (2, 4)

24. సీలు లేని తహసీలు (2)

26. జింక చర్మము (5)

27. నందమూరి హరికృష్ణ సోదరుణ్ణి పిలవండి (4)

30.  వగరు, రొప్పు (2)

32. డిస్కౌంటు, ముదరా (3)

34.  స్త్రీల ఈ శరీరభాగాన్ని శంఖంతో పోలుస్తారు (2)

35.  కంతి గల బొట్టు (3)

36.  పేగు(2)

37. ఆడుచీమ (4)

నిలువు:
1. ఉజ్జాయింపు (3)
2. వట్టి మాటలు కట్టిపెట్టోయ్ __ మేల్ తలపెట్టవోయ్ అంటున్నారు గురజాడ (2)
3. కావు అడవిని వెదకండి (2)
4. మేథ मे ట్రిక్స్ చేసి చూపించి ఇటీవల కన్నుమూసిన రచయిత (5, 6)
6. సినిమాలో రాత్రి (2)
7. ముత్యం అంటేనే స్వచ్ఛతకు మారుపేరు. మరి ఇది మరింత నిర్మలత్వాన్ని సూచించదూ (4, 3)
10. ముచికుంద నదిలో కంబము (2)
12. ఏలెడివాడు (3)
14. లేవడి (3)
16. రవంత, కొంచెము, ఇనుమంత, ఇంచుక (2)
17. అమ్మ ___ ___ మేనమామకు తెలియదా? (4, 3)
20. మంగళసూత్రము (2)
21. చితక్కొట్టిన మాంసం (2)
23. చంద్రుని కూతురా? ఏమో! (3)
     
    24. క్రిందనుండి అనుకూలము (2)
     
    25. హత్య (3)
     
    28. కారా మాష్టారు నిర్వహించిన క్రతువు (2)
     
    29.  దీని పొగకే సిగమెక్కితే, గుగ్గిలం పొగ కెట్లూగాలి? (2)
     
    31. సలసల కాగే తడక (2)
     
    33. తీతువుపిట్టకు తెలిసిన రుచి (2)
     
    34.  పురి, పెన (2) 

8 కామెంట్‌లు:

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

16 నిలువు: అధారం యివ్వలేదు ( కొంచెం)

mmkodihalli చెప్పారు...

ఇప్పుడు యిచ్చాను చూడండి

కంది శంకరయ్య చెప్పారు...

అడ్డం -
1. అంగరకా; 4. అట్ట; 5. తూనిక; 8. చట్టి; 9. నడవ; 11. సిడి; 13. సహోదరి; 15. కలిసుందాంరా; 18. కత; 19. లతాయాతకము; 21. కైరాళి; 22. నిండుచందమామ; 24. తహ; 26. కృష్ణాజినము; 27. జయకృష్ణా; 30. గస; 32. రాయితీ; 34. మెడ; 35. తిలకం; 36. ప్రేవు; 37. పిపీలిక.
నిలువు -
1. అంచనా; 2. గట్టి; 3. కాన; 4. అవసరాల రామకృష్ణారావు; 6. నిసి; 7. కడిగిన ముత్య(త్తె)ము; 10. కుంద; 12. ఏలిక; 14. రిక్తత; 16. సుంత; 17. పుట్టినింటి సంగతి; 20. తాళి; 21. కైమా; 23. చంద్రజ; 24. తజి; 25. హననం; 28. యజ్ఞం; 29. పిడక; 31. సల; 33. తీపి; 34. మెలి.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము: 1) అంగరకా, 4) అట్ట, 5) తూనిక, 8) చట్టి, 9) నడవ, 11) సిడి, 13) సహోదరి, 15) కలిసుందాం రా, 18) కత, 19) లతాయాతకము, 21) కైరాళి, 22) నిండు చందమామ, 24) తహ, 26) కృష్ణాసనము, 27) జయకృష్ణ, 30) గస, 32) రాయితీ 34) మెడ, 35) తిలకం, 36) ప్రేవు, 37) పిపీలికం.

నిలువు: 1) అంచనా, 2) గట్టి, 3) కాన, 4) అవసరాల రామకృష్ణరావు, 6) నిసి, 7) కడిగిన ముత్యము, 10) కుంద, 12) ఏలిక, 14) రిక్తత, 16) సుంత, 17) పుట్టినింటి సంగతి, 20) తాళి, 21) కైమా, 23) చంద్రజ, 24) తస, 25) హననం , 28) యజ్ఞం, 29) దండకం, 31) సల, 33) తీపి, 34) మెలి.

mmkodihalli చెప్పారు...

భమిడిపాటి సూర్యలక్ష్మిగారూ, మీ సమాధానాలలో అడ్డం 26,27,37 నిలువు 4,29 మాత్రం తప్పండి.

mmkodihalli చెప్పారు...

కంది శంకరయ్యగారూ ఆల్ కరెక్ట్‌గా పూరించారు. అభినందనలు!

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డము : 26) కృష్ణాజినము, 27) జయకృష్ణా, 37) పిపీలిక.
నిలువు : 4) అవసరాల రామకృష్ణారావు, 24) తజి (జిత)

Unknown చెప్పారు...

అడ్డం: 1. అంగరకా 4. అట్ట 5. తూనిక 8. చట్టి 9.నడవ 11. సిడీ 13. సహోదరి 15. కలిసుందాం రా 18.కత 19. లతాప్రముఖము (?? 21. కైరాళి 22. నిండు చందమామ 24.తహ 26.కృష్ణాజనము 27. జయకౄష్ణా 30.గస 32. రాయితీ 34.మెడ 35. తిలకం 36.ప్రేవు 37.పిపీలిక
నిలువు: 1.అంచనా 2. గట్టి 3.కాన 4. అవసరాల రామకృష్ణారావు 6.నిసి 7.కడిగిన ముత్యము 10.కుంద 12. ఏలిక 14. రిక్తము 16.సుంత 17. పుట్టినింటి సంగతి 20.తాళి 21.కైమా 23. చంద్రజ 24. తజ ( జత తిరగబడి) 25.హననం 28.యజ్జం 29. --డక (నాకు తెలియలేదు) 31. సల 33.తీపి 34. మెలి