...

...

11, మే 2010, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 7



ఆధారాలు:

అడ్డం:

1.నలమహారాజు పాయస సేవనములో టైమ్ మేనేజ్‌మెంట్.
3.జంపాల ఉమామహేశ్వరరావు మనకు ఇలా సుపరిచితుడు.
5.కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్రుడే కాని కొంచెం తడబడ్డాడు.
7.భరాగో ఈ కథలు వ్రాశారు.
9.గణతంత్ర దినోత్సవంనాడు రాష్ట్రపతి బహూకరించే ఒకానొక  గ్యాలంటరీ అవార్డు.
10.కన్నుల పండుగ లాంటిదే మరో ఇంద్రియానిది.
11.మా సీమయందు ప్రార్థనా స్థలంబు కలదో?
14.చేనేత దీనికి ఒక ఎక్జాంపుల్.
15.పూర్తిగా నెరిసిన తలను పోల్చడానికి ఇంతకంటే మంచి ఉపమానం ఉందా?
16.యండమూరి నవల థ్రిల్లర్ ఆధారంగా నిర్మించబడ్డ సినిమా.

నిలువు:

1.సేమియా పాయసమురా నిరాకరించకు.
2.కంటిచుక్క ఈ హీరోయిన్.
4.లష్కరు.
5.డోన్ట్ బి కన్ఫ్యూజ్‌డ్
6.ప్రచండమైన నిపుణత్వము.
7.అనక్రమ హి.. హి..
8.ఈ డేవిడ్ తెలుగోడే!
9.నామలింగానుశాసనమ్
12.ఆటవెలదితోనో, తేటగీతితోనో జతగూడనిదే దీనికి కుదరదు.
13.హరి సద్దుమణిగిన ఎల్ల(ల్లా)?

5 కామెంట్‌లు:

చదువరి చెప్పారు...

1.సమయపాలన
3.సహవాసి
5.(తిక్కన సోమయాజి)
7.సరదా
9.అశోకచక్ర
10.వీనులవిందు
11.మసీదు
14.కుటీర పరిశ్రమ
15.ముగ్గుబుట్ట
16.ముత్యమంత ముద్దు

నిలువు:

1.ససేమిరా
2.నయనతార
4.సికిందరాబాదు
5.తికమకపడకు
6.
7.సక్రమ
8.దావీదు
9.అమరకోశము
12.సీసపద్యము
13.సరిహద్దు

mmkodihalli చెప్పారు...

చదువరిగారూ భేష్! ఇంత త్వరగా స్పందించినందుకు అభినందనలు. పజిల్ ఈజీగా ఉందన్నమాట. ఇంకొంచెం కష్టంగా ఉంటే బాగుంటుందా?

చదువరి చెప్పారు...

తేలిగ్గానే ఉన్నట్టుందండి. :)

చదువరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

చదువరి గారికి అభినందనలు. నేనూ మీలాగే అన్నీ సాధించాను కాని 6 నిలువు మాత్రం రాలేదు. ఏ ఒక్కటి రాకున్నా ఆ పజిల్ క్లిష్టంగా ఉన్నట్టే లెక్క.