...

...

21, మే 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 9


ఆధారాలు: 

అడ్డం: 
1. అల్లసాని పెద్దనకు రాయలవారు తొడిగినది ఇదియె?
3. మగువ జీవితాన్ని ఈ పత్రికతో పోల్చారు దాశరథి.
5.కారుతున్న రైలుసదనములో దాగున్న 'నానో' కర్షకులు :-)
7. HDFC బ్యాంకులో దాచిన అంకగణితపు భాగమేనా సారూ?
9. మొదట్లో తడబడిన బాడీగార్డుకు చివరనుంచి రెండో అక్షరం మటుమాయం.
10. బంగారు మురుగు
11. మంచి గొంతుక
14. లలామ రకం కతల్లో సులభ సాధ్యం.
15. తలవాకిలి
16. కవిసార్వభౌమునికి జరిగిన ఒకానొక సత్కారము. 

నిలువు:
1.కడివెడు పాలు : ఖరము :: గరిటెడు పాలు : ____
2. 'జహంగీరు 18వ భార్య'కెన్ని లక్షలు 'కన్యాశుల్కం 19దా'? 
4. పదిహేడో నెంబరు పురాణం.
5.తెలుగు న్యూసు పేపరు. 
6.శీర్షాసనం వేసిన కంసుడు మొదలైన శత్రువులు.
7. రంగడు సుశీలల మధ్య కఠినము.
8. పరమాణు సంఖ్య 15కల మూలకము.
9. ఏనుగు సవారీ ఒక సత్కారమేనా? 
12.పిల్లంగోవి ఈ బ్లాగరి కలంపేరు.
13. ఇక్కడ బావిలోన వెలసిన వినాయకుడు కొలువై ఉన్నాడు. 


4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అడ్డం
1. గండపెండేరము
3.మల్లెతీగ
10.స్వర్ణకంకణం
11.సుస్వరం
14.కరతలామలకం


నిలువు

1. గంగిగోవు
2.ముప్పై లక్షలు
7.గడుసు
8.భాస్వరం
9.గజారోహణము
13.కాణిపాకం

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

అడ్డం...

1. గండపెండేరము
3. మల్లెతీగ
5. సన్నకారు రైతులు
7. గలుభా(భాగాలు)
9. గఅంరక్షడు(అంగరక్షడు)
10.స్వర్ణకంకణం
11.సుస్వరం
14.కరతలామలకం
15.మునిముంగ
16.


నిలువు...

1.గంగిగోవు
2.ముపైరుకలు
4.గరుడ పురాణం
5.సమాచార పత్రిక
6.కంసాది కంటకులు
7.గడుసు
8.భాస్వరం
9.గజారోహణం
12.
13.కాణిపాకం

చదువరి చెప్పారు...

ఏంటిసార్ అప్పుడే పేకపంచేయడం, రెండు డిస్కార్డులూ కూడా అయ్యాయే! ఇదిగోండి నా కార్డు. (రెండు తురుపు ముక్క లుంటే బాగుండేది.) :)

అడ్దం:
1. గండపెండేరమె
3. మల్లెతీగ
5. సన్నకారు రైతులు
7. గసాభా
9. గఅంరక్షడు
10. స్వర్ణకంకణం
11. సుస్వరం
14. కరతలామలకం
15.
16. కనకాభిషేకం

నిలువు:
1. గంగిగోవు
2 మెహరున్నీసా
4. గరుడపురాణం
5. సమాచార పత్రిక
6. లుకుటకం దిసాకం
7. గడుసు
8. భాస్వరం
9. గజారోహణము
12.
13. కాణిపాకం

mmkodihalli చెప్పారు...

anu, భమిడిపాటి సూర్యలక్ష్మి, చదువరి గారలకు అభినందనలు! @చదువరిగారూ 12 నిలువు 'తురుపు ముక్కే'నండీ :-)