అడ్డం:
1. తిరుమల క్షేత్రానికి తొలి గడప. - దేవుని కడప (కడప పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి క్షేత్రము)
3. ఇది కుడుతుంటే తీపిగుంటదా అయినా నీవు కన్ను కొడుతుంటే వెన్నలొస్తది అని వేటూరి పాట. - తేనెటీగ (తేనెటీగ కుడుతుంటే తీపిగుంటదా ... అని పంతులమ్మ సినిమాలోని పాట.వేటూరి రచనకు రాజన్ - నాగేంద్ర సంగీతం కూర్చారు.)
5. మాయ జలతారు నవలా రచయిత అంటే ఎలా అర్థం అవుతుంది? ఆ నవలపేరు మార్చారు కద! - రావూరి భరద్వాజ (భరద్వాజగారి ప్రఖ్యాత నవల 'పాకుడురాళ్లు' కు మొదట మాయజలతారు అనే పేరు పెట్టారు. శీలా వీర్రాజు గారి సలహా మేరకు దాన్ని 'పాకుడురాళ్లు'గా పేరు మార్చారు.)
7. ఈమె ఎన్టీఆర్ జాతీయ అవార్డు గ్రహీత నిజము నమ్ము! - జమున
9. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పుస్తకం కొత్తదుప్పటి దీనికి ఓ ఉదాహరణ. - కథాసంపుటి
10.'ఎదురులేని మనిషి' రచయిత్రి వీరగంధం సుబ్బారావు మాజీ భార్యా? - లక్ష్మీపార్వతి (లక్ష్మీపార్వతి రచించిన ఎన్టీయార్ జీవితచరిత్ర పేరు ఎదురులేని మనిషి)
11. నేపాలు లంకలలో నిక్షిప్తమైన కటాహము తిరగబడింది. - లంపాక (కటాహము = కపాలము)
14. వుసిముసి నగమున దాగున్న హాసవిశేషము. - ముసిముసి నగవు
15. ఆ మధ్య పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సంఘటనలకు నెలవు ఇక్కడే! - నందిగ్రామ్
16. గోవిందరాజులు సుబ్బారావును తలచుకోగానే గుర్తుకొచ్చే పాత్ర. - మాయల మరాఠి ( 'బాలనాగమ్మ' సినిమాలో మాయల మరాఠీగా వీరు ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందారు.)
నిలువు:
1.కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్... ఈ పాట ఎవరిది? వసుదేవుడిదా? - దేవదాసు
2. విశ్వావసు తరువాతి అవమానము. - పరాభవము (తెలుగు సంవత్సరాలలో విశ్వావసు తర్వాత వచ్చేది పరాభవ)
4. ఆల్ ఇండియా రేడియోను ఇలా పిలిస్తే మీరొప్పుకోరు. - గగన భారతి (ఆకాశవాణికి పర్యాయపదం గగనభారతి)
5. అవతార పురుషుడి అసలు ఎజెండా - రాక్షస సంహారము
6.'ఆమె చెప్పిన కథలు అను పన్నెండు తేనెసాల కథలు' రచయిత. - జయంతి పాపారావు
7. క్లిష్టమైన మృగరాజు. - జటిలం (సింహానికి జటిలము అనే పేరు ఉంది)
8. కానల కరిగెడిది కాదు ఈ వెత. - నలక (నలక అంటే బాధ. కానీ అడవులకు వెళ్లేటంత బాధ కాకపోవచ్చు.)
9. అడ్డం 9 వంటిదే కానీ ఎక్కువమంది వండివార్చినది. - కథాసంకలనం
12.దీన్ని చూడ్డమంటే చాలా మంది చెవులు కోసుకుంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా! - పాత సినిమా
13. నిపుణుడు,నిష్ణాతుడు అనే అర్థంలో వాడుతారు ఈ వేద పండితుడిని. - ఘనాపాఠి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి