...

...

16, మే 2010, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 8



ఆధారాలు: 

అడ్డం: 
1. తిరుమల క్షేత్రానికి తొలి గడప.
3. ఇది కుడుతుంటే తీపిగుంటదా అయినా నీవు కన్ను కొడుతుంటే వెన్నలొస్తది అని వేటూరి పాట.
5. మాయ జలతారు నవలా రచయిత అంటే ఎలా అర్థం అవుతుంది? ఆ నవలపేరు మార్చారు కద!
7. ఈమె ఎన్టీఆర్ జాతీయ అవార్డు గ్రహీత నిజము నమ్ము!
9. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పుస్తకం కొత్తదుప్పటి దీనికి ఓ ఉదాహరణ.
10.'ఎదురులేని మనిషి' రచయిత్రి వీరగంధం సుబ్బారావు మాజీ భార్యా?
11. నేపాలు లంకలలో నిక్షిప్తమైన కటాహము తిరగబడింది.
14. వుసిముసి నగమున దాగున్న హాసవిశేషము.
15. ఆ మధ్య పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సంఘటనలకు నెలవు ఇక్కడే!
16. గోవిందరాజులు సుబ్బారావును తలచుకోగానే గుర్తుకొచ్చే పాత్ర.  

నిలువు:
1.కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్... ఈ పాట ఎవరిది? వసుదేవుడిదా?
2. విశ్వావసు తరువాతి అవమానము.
4. ఆల్ ఇండియా రేడియోను ఇలా పిలిస్తే మీరొప్పుకోరు.
5. అవతార పురుషుడి అసలు ఎజెండా
6.'ఆమె చెప్పిన కథలు అను పన్నెండు తేనెసాల కథలు' రచయిత.
7. క్లిష్టమైన మృగరాజు.
8. కానల కరిగెడిది కాదు ఈ వెత.
9. అడ్డం 9 వంటిదే కానీ ఎక్కువమంది వండివార్చినది.
12.దీన్ని చూడ్డమంటే చాలా మంది చెవులు కోసుకుంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా!
13. నిపుణుడు,నిష్ణాతుడు అనే అర్థంలో వాడుతారు ఈ వేద పండితుడిని. 



1 కామెంట్‌:

సిద్ధార్థ్ చెప్పారు...

అడ్డం 7. జమున
అడ్డం 10.లక్ష్మీపార్వతి
అడ్డం 14. ముసిముసినగవు
నిలువు 1. దేవదాసు