...

...

21, మే 2010, శుక్రవారం

రంభ వర్ణనము

రంభ(సినీ నటి కాదు అప్సరస)ను వర్ణించే పద్యం ఇక్కడ చదివి ఆస్వాదించండి.


సీ. కుంభికుంభ స్మయాలంభ, సత్కుచకుంభ
               పీత తనూజిత శాత కుంభ
   సారంగ కరరుచిరోరు రంభాస్తంభ
               నిశ్చలయౌవనాన్విత విజృంభ
   కుంభినీ ధరవరోజ్జృంభ కటీదంభ
               శుభద్విలాస సంస్తంభకుంభ
   యాయజూకముదావహాగళితారంభ
               మల్లికా కోరక - మంజు జంభ


గీ. బంభర వినీలకేశ కుసుంభవర్ణ
     శుంభ దంశుక కనదవష్టంభమునను
     జంభదనుజారి గొల్వ నదంభరక్తి
     రంభ చనుదెంచె నధిక సంరంభమునను.

ఇంత సొగసైన పద్యాన్ని వ్రాసిన కవి పుంగవుడెవరో కనుక్కోగలరా?

2 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

ఇంకెవరు శ్రీనాథ కవిసార్వబౌములే అయ్యుంటారు.

కోడీహళ్లి మురళీమోహన్ చెప్పారు...

@సౌమ్యగారూ శ్రీనాథ కవిసార్వభౌములు కారండీ! ఈ పద్యాన్ని వ్రాసింది ఆంధ్రవాల్మీకి బిరుదాంకితులు వాసుదాసుగా ప్రసిద్ధి చెందిన వావికొలను సుబ్బారావు అనే కవిగారు. బహుశా ఈ పద్యం శ్రీకుమారాభ్యుదయం అనే కావ్యంలోనిది కావచ్చు అని అనుకుంటున్నాను.